కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/04 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2004
  • ఉపశీర్షికలు
  • మే 10తో ప్రారంభమయ్యే వారం
  • మే 17తో ప్రారంభమయ్యే వారం
  • మే 24తో ప్రారంభమయ్యే వారం
  • మే 31తో ప్రారంభమయ్యే వారం
  • జూన్‌ 7తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2004
km 5/04 పేజీ 2

సేవా కూటాల పట్టిక

మే 10తో ప్రారంభమయ్యే వారం

పాట 18 (162)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. 4వ పేజీలోని సలహాలు మీ సంఘ క్షేత్రానికి ఆచరణాత్మకంగా ఉంటే, వాటిని ఉపయోగిస్తూ మే 15 కావలికోటను, ఏప్రిల్‌-జూన్‌ తేజరిల్లు!ను (పత్రిక ప్రతిపాదన కాలమ్‌లో రెండవది) ఎలా అందించాలో ప్రదర్శించండి. వేరే అందింపులు కూడా ఉపయోగించవచ్చు. ప్రతి ప్రదర్శనలోను “నాకు నా స్వంత మతముంది” అని సంభాషణను ఆటంకపరిచే వారితో విభిన్న రీతుల్లో ఎలా వ్యవహరించాలో చూపించండి.​—బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను పుస్తకంలో 10-11 పేజీలు చూడండి.

15 నిమి: ప్రశ్నా భాగం సమీక్షించండి. ప్రచారకులు వేరే భాష మాట్లాడే ప్రజలను కలుసుకున్నప్పుడు, 1998 అక్టోబరు 15వ, తేదీతో సంఘాలన్నింటికీ వ్రాసిన ఉత్తరంలో వివరించిన ప్రకారం ప్లీజ్‌ ఫాలో అప్‌ (S-43) ఫారాన్ని ఉపయోగించమని ప్రచారకులను ప్రోత్సహించండి. సాధారణంగా, ఆ వ్యక్తి రాజ్య సందేశంలో ఆసక్తి చూపించకున్నా సరే ఆ ఫారాన్ని ఇదే ఉద్దేశానికి ఉపయోగించాలి.

20 నిమి: “మీ హృదయములను విశాలపరచుకొనుడి.”a దేవుణ్ణి ఆరాధించండి పుస్తకం 150వ పేజీ, 14వ పేరాలోని వ్యాఖ్యానాలను చేర్చండి.

పాట 15 (127), ముగింపు ప్రార్థన.

మే 17తో ప్రారంభమయ్యే వారం

పాట 6 (45)

10 నిమి: స్థానిక ప్రకటనలు.

15 నిమి: “మీ కృతజ్ఞతను చూపించండి.”b సమయానుకూలతను బట్టి, ఉదాహరించిన లేఖనాలపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి. 3వ పేరా చర్చిస్తున్నప్పుడు, ఇటీవల సహాయ పయినీరు సేవ చేసినవారు ఆ సేవవల్ల తాము పొందిన ఆశీర్వాదాలను తెలుపమని కోరండి.

20 నిమి: మనం పరస్పరం శ్రద్ధ చూపించుకుంటాము. (1 కొరిం. 12:24-26) మన పరిచర్య పుస్తకం 157-9 పేజీలు, “ఒకరి యెడల ఒకరు శ్రద్ధకల్గివుండుట” ఉపశీర్షిక కింది సమాచారం ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. యెహోవా ప్రజలు భూమ్మీది అన్ని భాగాల్లోను నివసిస్తున్నప్పటికీ మనం చాలా సన్నిహితంగా ఐక్యమయ్యాము. మనం మన సహోదరుల కోసం ప్రతి దినమూ ప్రార్థించాలి. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం వెంటనే స్పందిస్తాం కూడా. కీలక లేఖనాలు చదివి చర్చించండి, మన ప్రచురణల్లో నుండి తీసుకున్న ఒకటి లేదా రెండు అనుభవాలు చేర్చండి.

పాట 22 (130), ముగింపు ప్రార్థన.

మే 24తో ప్రారంభమయ్యే వారం

పాట 13 (124)

12 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్‌ రిపోర్టు. జూన్‌ 1 కావలికోటను, ఏప్రిల్‌-జూన్‌ తేజరిల్లు!ను (పత్రిక ప్రతిపాదన కాలమ్‌లో నాలుగవది) ఎలా అందించాలో ప్రదర్శించండి. ప్రతి ప్రదర్శన స్థానిక మతానికి చెందిన ఎవరో ఒకరికి ఆకర్షణీయంగా ఉండేలా మలచండి.

15 నిమి: “ఉత్తేజపరిచే సంగీతం.” ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. వార్షిక పుస్తకం 2002 (ఆంగ్లం), 175వ పేజీ, కావలికోట ఫిబ్రవరి 1, 1997, 27వ పేజీ 1-2 పేరాలలోని వ్యాఖ్యానాలను చేర్చండి.

18 నిమి: అనియత సాక్ష్యమిచ్చేందుకు సిద్ధంగా ఉండండి. జూన్‌ 2003 మన రాజ్య పరిచర్య 3వ పేజీ ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. అనియత సాక్ష్యమిచ్చినప్పుడు ఎదురైన అనుభవాలు చెప్పేందుకు కొందరిని ముందుగానే ఏర్పాటు చేసుకోండి. మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? కరపత్రమును, అన్ని దేశాల ప్రజలకు సువార్త (ఆంగ్లం) చిన్న పుస్తకమును అనియత సాక్ష్యమిచ్చేటప్పుడు ఎలా ఉపయోగించవచ్చో క్లుప్తంగా ప్రదర్శించండి.

పాట 22 (130), ముగింపు ప్రార్థన.

మే 31తో ప్రారంభమయ్యే వారం

పాట 3 (16)

8 నిమి: స్థానిక ప్రకటనలు. మే క్షేత్రసేవ రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తుచేయండి.

17 నిమి: జీవము​—విలువైందిగా పరిగణించవలసిన ఒక బహుమానం. తర్కించండి (ఆంగ్లం) పుస్తకం, 25-6 పేజీల ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. తేజరిల్లు! సెప్టెంబరు 8, 1993 10-11 పేజీలలోని వ్యాఖ్యానాలు చేర్చండి. తన సొంత శరీరాన్ని ప్రభావితం చేసే విషయాలపై నిర్ణయం తీసుకునే హక్కు స్త్రీకుంది అని భావించే వ్యక్తికి, గర్భస్రావం పట్ల యెహోవా దృక్పథం గురించి ఎలా వివరిస్తారు? కావలికోట జనవరి 1, 2000, 4వ పేజీ, 4-5 పేరాల్లోని అనుభవాన్ని చెప్పండి.

20 నిమి: “గొప్ప బోధకుడి నుండి నేర్చుకోండి (ఆంగ్లం) పుస్తక ప్రతిపాదన.” జూన్‌ నెలలో మనం ఈ ప్రచురణను ప్రతిపాదిస్తాం. ఆ పుస్తకం 7వ పేజీ, 1-3 పేరాల్లో వివరించబడిన అంశాలను సూచించండి. ఆ పుస్తకంలో వారికి నచ్చిందేమిటో చెప్పమని ప్రేక్షకులను అడగండి. ఇవ్వబడిన ప్రతిపాదనలను సమీక్షించండి. పుస్తకం ప్రతిపాదించేటప్పుడు అందులోని చిత్రాలను ఎలా ఉపయోగించాలో నొక్కి చెప్పండి. మొదటి ప్రతిపాదన ఒక చిన్న అబ్బాయి/అమ్మాయితో, రెండవది పెద్ద వారితో ప్రదర్శింపజేయండి. స్థానిక క్షేత్రంలో మరో ప్రతిపాదన ఎక్కువ ప్రభావం చూపించేటట్లయితే, దాన్ని రెండవ ప్రతిపాదన స్థానంలో చర్చించి ప్రదర్శించాలి.

పాట 13 (1), ముగింపు ప్రార్థన.

జూన్‌ 7తో ప్రారంభమయ్యే వారం

పాట 26 (212)

10 నిమి: స్థానిక ప్రకటనలు. “వారికి సహాయపడే మార్గం” నుండి ముఖ్యమైన అంశాలను చర్చించండి. స్థానిక క్షేత్రంలో ఎదురైన కొన్ని భాషలను పేర్కొనండి.

15 నిమి: స్థానిక అవసరాలు.

20 నిమి: మీ బోధలో సమర్థమైన ఉపమానాలను ఉపయోగించండి. కావలికోట సెప్టెంబరు 1, 2002, 22-4 పేజీల ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. ఒక ఉపమానాన్ని సమర్థవంతంగా చేసే నాలుగు కారకాలు ఏమిటి? ఉపమానాలను సరళంగా ఉంచడం ఎందుకు మంచిది? మంచి ఉపమానాలు మనకు ఎక్కడ లభిస్తాయి? 23వ పేజీ బాక్సులోని కొన్ని ఉదాహరణలను పరిశీలించి, ఒక్కొక్క ఉపమానాన్ని సమర్థవంతం చేస్తున్నది ఏమిటో చర్చించండి.

పాట 3 (16), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి