తగిన కాలములో ఆధ్యాత్మిక ఆహారం
1. యెహెజ్కేలు 36:29 నేడు ఎలా నెరవేరుతోంది?
1 “మీకు కరవురానియ్యక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును” అని సర్వోన్నత ప్రభువైన యెహోవా ప్రకటించాడు. (యెహె. 36:29) ఈ ప్రవచనార్థక మాటలు నేటి దేవుని ప్రజలకు వర్తిస్తాయి. సూచనార్థకంగా చెప్పాలంటే యెహోవా తన ప్రజల కోసం పోషకాహారమైన ధాన్యము విస్తృతంగా మొలకెత్తేలా చేశాడు. మన జిల్లా సమావేశాల ద్వారా అందజేయబడుతున్న సమయోచితమైన ఆధ్యాత్మిక ఆహారం ఈ వాస్తవాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
2. యెహోవా తగిన కాలములో ఆధ్యాత్మిక ఆహారం పెట్టడానికి జిల్లా సమావేశాలను ఎలా ఉపయోగించుకున్నాడు?
2 ఒహాయోలోని కొలంబస్‌లో 1931లో జరిగిన సమావేశంలో, యెహోవాసాక్షులు అనే క్రొత్త పేరును స్వీకరించేలా యెహోవా తన ప్రజలకు మార్గనిర్దేశం ఇచ్చాడు. (యెష. 43:10-12) 1935లో, ప్రకటన 7:9-17లోని గొప్పసమూహము స్పష్టంగా గుర్తించబడింది. 1942లో, సహోదరుడు నార్ “శాంతి—అది నిలుస్తుందా?” అనే బహిరంగ ప్రసంగం ఇచ్చారు. ఆ ప్రసంగం ప్రపంచవ్యాప్త ప్రకటనా పనికి ప్రేరణనిచ్చి, వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ రూపొందడానికి దారితీసింది. కొన్ని సమావేశాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉన్నప్పటికీ, ప్రతి సమావేశం పంచభక్ష్య పరమాన్నంలాంటి పుష్టికరమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని తగిన కాలములో వడ్డించింది.—కీర్త. 23:5; మత్త. 24:45.
3. మన జిల్లా సమావేశంలోని ఆధ్యాత్మిక విందు నుండి ప్రయోజనం పొందడానికి మనం ఏమి చేయాలి?
3 మీరు ఎంత బాగా భోంచేస్తున్నారు? చుట్టూ ఆహారం ఉన్నప్పటికీ, దాన్ని తినకపోతే కుపోషణకు గురయ్యే అవకాశముంది. (సామె. 26:15) ఆధ్యాత్మిక భావంలో కూడా అలాగే జరుగుతుంది. కొన్ని సమావేశాల్లో, కార్యక్రమం నడుస్తున్న సమయంలో చాలామంది అనవసరంగా అటూ ఇటూ నడవడం లేదా ఇతరులతో మాట్లాడడం గమనించబడింది. క్షేమాభివృద్ధికరమైన సహవాసం సమావేశంలో ప్రాముఖ్యమైన అంశమే అయినప్పటికీ అది ప్రతి పూట కార్యక్రమానికి ముందు లేదా తర్వాత జరగాలి. (ప్రసం. 3:1, 7) మనం మన సీట్లలో కూర్చొని శ్రద్ధగా వినకపోతే, మనం ఏదైనా ముఖ్యమైన విషయాన్ని కోల్పోవచ్చు. ప్రయాణం, వేడిగా ఉండే వాతావరణం కాస్త మగతకు కారణం కావచ్చు. కానీ రాత్రి పూట బాగా నిద్రపోతే మరుసటి రోజు కార్యక్రమంపై ఏకాగ్రత నిలిపేందుకు మనకు సహాయం చేస్తుంది. సమావేశపు ఆయా విభాగాల పైవిచారణకర్తలు, నియమితులైన సహోదరులు సమావేశానికి సంబంధించిన విషయాల గురించి సమావేశ కార్యక్రమం నడుస్తుండగానే అప్పుడప్పుడు మాట్లాడవలసిన అవసరం ఏర్పడవచ్చు. వేరే సందర్భాల్లో వారు కార్యక్రమంపై ఏకాగ్రత నిలపడం ద్వారా ఆదర్శవంతంగా ఉండాలి. అందరూ ప్రతిరోజు ముగింపు ప్రార్థన అయిపోయేంత వరకు ఉండాలి. అందించబడుతున్న ఆధ్యాత్మిక ఆహారంలోని దేనినైనా గాని మనలో ఎవరమూ కోల్పోలేము.—1 కొరిం. 10:12; ఫిలి. 2:12.
4. యెహోవా అందజేస్తున్న సమృద్ధికి మన కృతజ్ఞతను ఎలా చూపించవచ్చు?
4 క్రైస్తవ మతసామ్రాజ్యం అందిస్తున్న కుపోషక తప్పుడు సిద్ధాంతాలకు భిన్నంగా, యెహోవా అందిస్తున్న సమృద్ధికరమైన ఆధ్యాత్మిక సత్యాలతో మనమెంత ఆనందిస్తామో కదా! (యెష. 65:13, 14) ‘మనం కృతజ్ఞులమై ఉన్నామని’ చూపించగల ఒక విధానం ఏమిటంటే, సమావేశాన్ని యెహోవా చేత బోధించబడే అవకాశంగా చూడాలి. (కొలొ. 3:15) ప్రసంగిస్తున్న సహోదరుడ్ని చూడడం కంటే, మన “మహోపదేశకుడు” ఇస్తున్న సందేశంపై శ్రద్ధ పెట్టండి. (యెష. 30:20, NW; 21; 54:13) ఏకాగ్రతతో వినండి. ముఖ్యాంశాలను క్లుప్తంగా వ్రాసుకోవడం యొక్క ప్రాముఖ్యతను మరచిపోకండి, అది ప్రతి సాయంత్రం ఆ రోజు కార్యక్రమంలోని ముఖ్యాంశాలను సమీక్షించడానికే కాక, సంవత్సరంలో ఆ తర్వాత జరిగే సేవా కూటంలో జరిగే పునఃసమీక్షలో పాల్గొనేందుకు కూడా సహాయకరంగా ఉంటుంది. మీరు నేర్చుకున్న వాటిని పాటించండి.
5. జిల్లా సమావేశాలు, మనం ఆనందించడానికి ఎలాంటి కారణాలను ఇస్తాయి?
5 అర్మగిద్దోనుకు ముందు జరిగే ప్రతి సమావేశం, అది శరణార్థుల శిబిరంలో జరిగినా, యుద్ధ బీభత్స ప్రాంతంలో జరిగినా, శాంతిభరితమైన ప్రాంతంలో జరిగే పెద్ద సమావేశమైనా అది సాతానుపై విజయమే! మనం ఐక్యతగల సహోదరులుగా, జిల్లా సమావేశాల్లో గుంపులు గుంపులుగా ఒకచోట సమకూడే అవకాశాలను విలువైనవిగా ఎంచుతాం. (యెహె. 36:38) యెహోవా మనకు మరొకసారి ‘తగిన కాలములో ఆహారమును’ ప్రేమపూర్వకంగా అందిస్తాడని దృఢ నమ్మకంతో ఉన్నాం.—లూకా 12:42.
[4వ పేజీలోని బాక్సు]
యెహోవా బల్ల పట్ల కృతజ్ఞులుగా ఉండండి
◼ ఏకాగ్రతతో వినండి
◼ ముఖ్యాంశాలను వ్రాసుకోండి
◼ ప్రతి సాయంత్రం ఆరోజు కార్యక్రమంలోని ముఖ్యాంశాలను సమీక్షించండి
◼ మీరు నేర్చుకున్న వాటిని పాటించండి