పత్రికల గురించి ఏమని చెప్పాలి?
తేజరిల్లు! జన.-మార్చి
“మనలో చాలామందికి, డయబెటిస్ ఉన్న ఎవరో ఒకరు తెలుసు. వారికి మనం సహాయం చేయగలదేమైనా ఉందా? [ప్రతిస్పందించనివ్వండి, ఆ తర్వాత 12వ పేజీలోవున్న ఆర్టికల్ చూపించండి.] ఈ పత్రిక, దీర్ఘకాల వ్యాధిగ్రస్తునికి మనమిప్పుడే ఫలవంతంగా సేవ చేయడానికి మనకు దేవుని వాక్యమెలా సహాయం చేయగలదో చర్చించడమే కాకుండా త్వరలోనే అన్ని రకాల వ్యాధులు తొలగించబడతాయనే సృష్టికర్త వాగ్దానంతో కూడా మనలను ఓదారుస్తోంది.”
కావలికోట మార్చి 15
“ఏప్రిల్ 4, ఆదివారం జరగనున్న ప్రభువు రాత్రి భోజన ఆచరణకు మిమ్మల్ని ఆహ్వానించడానికి ఇష్టపడుతున్నాం. [పత్రిక వెనుక పేజీలోని లేదా ముద్రిత జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానంలోని సమాచారాన్ని ఉపయోగిస్తూ వివరించండి. ఆ తర్వాత లూకా 22:19 చదవండి.] ఈ కావలికోట సంచికలోని కవర్ ఆర్టికల్‌లు ఈ ఆచరణ అర్థాన్ని, అది ఆచరించబడే విధానాన్ని వివరిస్తాయి.”
తేజరిల్లు! జన.-మార్చి
“న్యూనతా భావంతో బాధపడుతున్న వారు బహుశా మీకు తెలిసి ఉండవచ్చు. అలాంటివారు గౌరవ భావాన్ని వృద్ధిచేసుకొని తమను గురించి హూందాగా భావించడానికి మీరెలా సహాయం చేయవచ్చు? [ప్రతిస్పందించనివ్వండి, ఆ తర్వాత 13వ పేజీలోని ఆర్టికల్ చూపించండి.] అలాంటి వారికి సహాయం చేయడానికి మీరు చేపట్టగల కొన్ని ఆచరణాత్మక చర్యలను ఈ పత్రిక చర్చిస్తోంది.”
కావలికోట ఏప్రి. 1
“క్రూర మృగంయొక్క ముద్రకు సంబంధించి బైబిల్లోని నిగూఢ వర్ణన కలిగించినంత మీమాంసను చాలా తక్కువ గ్రంథాలు కలిగించాయి. మీరు దాని గురించి ఎప్పుడైనా విన్నారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత ప్రకటన 13:16-18 చదవండి.] ఈ ప్రహేళికను అర్థం చేసుకోవడానికి బైబిలే స్వయంగా కీలకాంశాలను అందజేస్తోంది. అవేమిటో ఈ పత్రిక వివరిస్తోంది.”