ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు జూన్‌లో: జ్ఞానము పుస్తకాన్ని లేదా దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను ప్రతిపాదించండి. గృహస్థుల దగ్గర ఈ ప్రచురణలు అప్పటికే ఉంటే సంఘంలో స్టాకున్న మరో సముచితమైన బ్రోషుర్‌ను ఉపయోగించండి. జూలై, ఆగస్టుల్లో: ఇక్కడ ప్రస్తావించబడిన 32 పేజీల బ్రోషుర్‌లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, నిరంతరం నిలిచే దైవిక నామం (ఆంగ్లం), పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం) మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. సముచితమనుకున్న చోట్ల మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మృతుల ఆత్మలు—అవి మీకు సహాయపడగలవా లేక హాని తలపెట్టగలవా? అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), యుద్ధంలేని లోకం ఎప్పటికైనా ఉంటుందా? (ఆంగ్లం), సర్వమానవాళి కొరకైన గ్రంథం, సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు? అనే బ్రోషుర్‌లను ప్రతిపాదించవచ్చు. సెప్టెంబరులో: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా?, “నీ రాజ్యము వచ్చుగాక” (ఆంగ్లం) లేదా పాతబడి, రంగుమారిన ఏదైనా 192 పేజీల పుస్తకం లేదా 1988కి ముందు ప్రచురింపబడిన మరే పుస్తకమైనా ప్రతిపాదించవచ్చు.
◼ బహిరంగ ప్రసంగంయొక్క అనేక క్లుప్తప్రతుల్ని సంస్థ ఇటీవల నవీకరించింది. 2003 ఆగస్టులో వార్షిక ఫారమ్స్‌తోపాటు ఆంగ్ల క్లుప్తప్రతుల పూర్తి సెట్ పంపించబడుతుంది. అప్పటికల్లా తయారైన ప్రాంతీయ భాషా క్లుప్తప్రతుల్ని కూడా సంఘాలకు పంపిస్తాము. మిగతా క్లుప్తప్రతులు ఆ తర్వాత పంపించబడతాయి. నవీకరించి పంపబడిన క్లుప్తప్రతులు అందిన వెంటనే, సంఘాలు పాత వాటిని తీసివేసి వాటి స్థానంలో కొత్తవి పెట్టాలి.
◼ రవాణా ఖర్చులు పొదుపు చేయడానికి కొన్నిసార్లు సాహిత్యాలు, పత్రికలు, మన రాజ్య పరిచర్య ఇతరత్రా అన్నీకలిపి పంపబడతాయి. కాబట్టి, రవాణాలో కార్టన్లు వచ్చినవెంటనే వాటిని విప్పిచూసి తమ విభాగానికి సంబంధించనివేవైనా ఉంటే వాటిని సత్వరమే సంఘ పైవిచారణకర్తకు అప్పగించాలని సాహిత్యాలు, పత్రికల పంపిణీ చూసుకొనే సహోదరులకు చెప్పాలి.
◼ CD-ROMలో వాచ్‌టవర్ లైబ్రరీ—2001 ఎడిషన్ కొరకు సంఘాలిప్పుడు తమ రిక్వెస్టులను పంపవచ్చు. ఈ కంపాక్టు డిస్కు ఆంగ్లంలో మాత్రమే అందుబాటులోవుంది. ఇది ప్రజా పంపిణీకొరకు, స్కూల్ గ్రంథాలయాలకొరకు, లేదా యెహోవాసాక్షులయందు ఆసక్తివుందని కేవలం చెప్పుకొనే వారికివ్వడానికి కాదని దయచేసి గుర్తుంచుకోండి. వాచ్‌టవర్ లైబ్రరీ—2001 సంఘంలో కంప్యూటర్ సౌకర్యమున్న సభ్యులకొరకు మాత్రమే. ఇది కేవలం సంఘం ద్వారానే లభ్యమౌతుంది. ఈ కంపాక్టు డిస్కులు లభ్యమై రవాణా చేయబడేవరకు సంఘాల ప్యాకింగు లిస్టునందు “పెండింగ్”లో ఉంచబడతాయి.
◼ మళ్ళీ లభ్యమయ్యే ప్రచురణలు:
దేవుని మార్గదర్శనము—పరదైసుకు మన మార్గము (ముస్లిమ్‌లకు)—ఆంగ్లం, కన్నడ, బెంగాలీ, మలయాళం
◼ లభ్యమయ్యే కొత్త ప్రచురణలు:
దేవుని మార్గదర్శనము—పరదైసుకు మన మార్గము (ముస్లిమ్‌లకు)—గుజరాతీ