యెహోవాకు సన్నిహితమవండి పుస్తకాన్ని అందించడానికి సూచనలు
◼ బైబిలును సిద్ధంగా ఉంచుకొని ఇలా చెప్పండి: “దేవుణ్ణి నమ్మే చాలామంది ఆయనకు సన్నిహితంగా ఉండాలని కోరుకుంటారు. తనకు సన్నిహితమవమని దేవుడు మనలను ఆహ్వానిస్తున్నాడని మీకు తెలుసా? [యాకోబు 4:8 చదవండి.] ప్రజలు తమ సొంత బైబిలును ఉపయోగించి దేవునికి సన్నిహితులవడానికి సహాయపడేందుకే ఈ పుస్తకం రూపొందించబడింది.” 16వ పేజీలోని 1వ పేరా చదవండి.
◼ బైబిలును సిద్ధంగా ఉంచుకొని ఇలా చెప్పండి: “నేడు అన్యాయం పెరిగిపోతోంది. అది ఇక్కడ వర్ణించబడినట్లే ఉంది. [ప్రసంగి 8:9బి చదవండి.] దేవుడు అసలు ఈ విషయాలను పట్టించుకుంటాడా అని చాలామంది ఆలోచిస్తుంటారు. [119వ పేజీలో 4వ పేరాలోని మొదటి రెండు వాక్యాలు చదవండి.] దేవుడు కొంతకాలంపాటు అన్యాయాన్ని ఎందుకు అనుమతిస్తున్నాడో ఈ అధ్యాయం వివరిస్తోంది.”