కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/04 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2004
  • ఉపశీర్షికలు
  • జనవరి 12తో ప్రారంభమయ్యే వారం
  • జనవరి 19తో ప్రారంభమయ్యే వారం
  • జనవరి 26తో ప్రారంభమయ్యే వారం
  • ఫిబ్రవరి 2తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2004
km 1/04 పేజీ 2

సేవా కూటాల పట్టిక

జనవరి 12తో ప్రారంభమయ్యే వారం

పాట 28 (224)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. 4వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ, జనవరి-మార్చి తేజరిల్లు!ను (పత్రికల ప్రతిపాదన కాలమ్‌లో మొదటిది), జనవరి 15 కావలికోటను ఎలా అందించాలో ప్రదర్శించండి. మాట్లాడేది ఒక పత్రిక గురించే అయినా ప్రతి ప్రదర్శనలో రెండు పత్రికలను జంటగా ఇవ్వాలి. ప్రతీ ప్రదర్శన తర్వాత, ఆ ప్రతిపాదనలోవున్న మంచి అంశాలను కొన్నింటిని ప్రత్యేకంగా పేర్కొనండి.

15 నిమి: స్థానిక అవసరాలు.

20 నిమి: అందుకోవడానికి మనం సంతోషించిన కొత్త ప్రచురణలు! ప్రేక్షకులతో చర్చ. “దేవుణ్ణి మహిమపరచండి” జిల్లా సమావేశంలో విడుదల చేయబడిన రెండు కొత్త ప్రచురణలు అందుకోవడానికి మనం సంతోషించాం. ‘మంచి దేశమును చూడండి’ అనే ప్రచురణ మన లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నింటికంటే భిన్నమైనది. మీరు పేజీ తిరగేసే ప్రతీసారి, వాగ్దానదేశానికి సంబంధించిన విభిన్న అంశాల గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి. వివిధ మ్యాపుల్లో కనబడే వివరాలను కొన్నింటిని సూచించండి. ఈ ప్రచురణను ఉపయోగించగల ఆచరణాత్మక విధానాలు సూచించండి. గొప్ప బోధకుడి నుండి నేర్చుకోండి (ఆంగ్లం) అనే పుస్తకం మన పిల్లల ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పటిష్ఠం చేస్తుంది. ఆ పుస్తకంలోని సమయోచిత అంశాలను కొన్నింటిని ప్రస్తావిస్తూ వాటినుండి పిల్లలు తలిదండ్రులు ఎలా ప్రయోజనం పొందవచ్చో చూపించండి. ఈ రెండు కొత్త సాహిత్యాలను ఫలవంతంగా ఎలా ఉపయోగిస్తున్నారో వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

పాట 22 (130), ముగింపు ప్రార్థన.

జనవరి 19తో ప్రారంభమయ్యే వారం

పాట 18 (162)

5 నిమి: స్థానిక ప్రకటనలు.

40 నిమి: “జిల్లా మరియు అంతర్జాతీయ సమావేశాలు దేవుణ్ణి మహిమపరచేందుకు మనలను పురికొల్పాయి!” దీనిని ఒక పెద్ద నిర్వహించాలి. ఒక నిమిషం లేదా అంతకంటే తక్కువ సమయం ఉపోద్ఘాతం తర్వాత, ఆర్టికల్‌లో ఇవ్వబడిన ప్రశ్నలు ఉపయోగిస్తూ సమావేశ కార్యక్రమాన్ని ప్రేక్షకులతో చర్చించండి. బహుశ కొన్ని ప్రశ్నలకు కేవలం ఒక జవాబునే అనుమతిస్తూ, అన్ని ప్రశ్నలు చర్చించబడేలా సమయం కేటాయించండి. సూచించబడిన లేఖనాలన్నింటిని ఈ భాగం కోసం కేటాయించబడిన సమయంలో చదవడం వీలుపడదు; సులభంగా జవాబులు కనుగొనేందుకే ఇవి సూచించబడ్డాయి. నేర్చుకున్నవి అన్వయించడంలోవున్న ప్రయోజనాలపైనే వ్యాఖ్యానాలు దృష్టి నిలపాలి.

పాట 7 (51), ముగింపు ప్రార్థన.

జనవరి 26తో ప్రారంభమయ్యే వారం

పాట 23 (200)

12 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్సు రిపోర్టు. జనవరి క్షేత్రసేవ రిపోర్టులను ఇమ్మని ప్రచారకులందరికీ గుర్తుచేయండి. 4వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ జనవరి-మార్చి తేజరిల్లు!ను (పత్రికల ప్రతిపాదన కాలమ్‌లో మూడవది), ఫిబ్రవరి 1 కావలికోటను ఎలా అందించాలో ప్రదర్శించండి. మాట్లాడేది ఒక పత్రిక గురించే అయినా ప్రతి ప్రదర్శనలో రెండు పత్రికలను జంటగా ఇవ్వాలి. ఒక ప్రతిపాదనలో పొరుగువారికి పత్రికలు ఎలా అందించవచ్చో ప్రదర్శించండి.

15 నిమి: మీ జీవితంలో ప్రతీ దినం దేవుని వాక్యం అన్వయించుకోండి. ప్రసంగం మరియు ప్రేక్షకులతో చర్చ. ప్రతిదినం లేఖనాలను పరిశోధించడం​—⁠2004 ను క్రమంగా ఉపయోగించమని అందరినీ ప్రోత్సహించండి. 3-4 పేజీల్లోవున్న ముందుమాటలోని వ్యాఖ్యానాలు చర్చించండి. దినవచనం పరిశీలించడానికి వ్యక్తిగతంగా ఏది శ్రేష్ఠమైన సమయమని కనుగొన్నారో ప్రేక్షకులను అడగండి. ఆ రోజు కొరకైన వచనాన్ని వ్యాఖ్యానాన్ని సంఘంతో చర్చించండి. ఆ సమాచారాన్ని ఆచరణాత్మకంగా ఎలా అన్వయించుకోవచ్చో వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి. ప్రతిదినం ఆ రోజు కొరకైన వచనాన్ని చర్చించినప్పుడు ఆ సమాచారాన్ని వారెలా అన్వయించుకోవచ్చో క్లుప్తంగా పరిశీలించమని అందరినీ ప్రోత్సహించండి.

18 నిమి: ప్రశ్నా భాగం. ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం.

పాట 9 (37), ముగింపు ప్రార్థన.

ఫిబ్రవరి 2తో ప్రారంభమయ్యే వారం

పాట 25 (204)

10 నిమి: స్థానిక ప్రకటనలు. ఫిబ్రవరి సాహిత్య ప్రతిపాదనలను పేర్కొనండి. యెహోవాకు సన్నిహితమవండి పుస్తకాన్ని అందించడానికి ఇవ్వబడిన సూచనలను పునఃసమీక్షించండి.

20 నిమి: “మీ సమయాన్నెలా వినియోగిస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి.”a ఆధ్యాత్మిక కార్యకలాపాలకు కేటాయించబడిన సమయానికి అప్రధాన కార్యకలాపాలు అడ్డుతగలకుండా వారేమి చేస్తున్నారో ప్రేక్షకులను వ్యాఖ్యానించమని ఆహ్వానించండి.

15 నిమి: క్రీస్తును అనుకరించిన పౌలును అనుకరించండి. (1 కొరిం. 11:⁠1) ప్రేక్షకులతో చర్చ. యేసువలే పౌలు, “తన్ను కలుసుకొను” వారికి సాక్ష్యమిచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. (అపొ. 17:​17) మన సేవా ప్రాంతంలో ఇలా చేయడానికి మనకెలాంటి అవకాశాలున్నాయి? మనం షాపింగ్‌కు వెళ్లినప్పుడు, ఉద్యోగ స్థలంలో లేదా పాఠశాలలో ఉన్నప్పుడు, లేదా ప్రజారవాణా వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మనమెవరిని ‘కలుసుకొంటాము’? మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎవరిని కలుసుకొనే అవకాశముంటుంది? తమ ప్రతిదిన కార్యకలాపాల్లో తాము కలిసిన ప్రజలకు సాక్ష్యమివ్వడంలో తమకు కలిగిన అనుభవాలు వివరించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

పాట 18 (162), ముగింపు ప్రార్థన.

[అధస్సూచి]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి