కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/02 పేజీ 8
  • “తండ్రి లేనివారి”పట్ల

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “తండ్రి లేనివారి”పట్ల
  • మన రాజ్య పరిచర్య—2002
  • ఇలాంటి మరితర సమాచారం
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • తండ్రిలేని పిల్లలకు తండ్రి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • తల్లి లేక తండ్రి మాత్రమేగల కుటుంబాలు విజయవంతం కాగలవు!
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • ఒంటరి తల్లులకు చేయూతనివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2002
km 11/02 పేజీ 8

“తండ్రి లేనివారి”పట్ల

ప్రేమపూర్వకమైన శ్రద్ధ కనపర్చండి

1 యెహోవా “తండ్రి లేనివారికి తండ్రి.” (కీర్త. 68:​5) ఆయన ప్రాచీన ఇశ్రాయేలుకు ఇచ్చిన ఈ ఆజ్ఞలో వారి సంక్షేమంపట్ల ఆయనకున్న శ్రద్ధ ప్రతిబింబించబడుతుంది: “విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధపెట్టకూడదు. వారు నీచేత ఏ విధముగానైనను బాధనొంది నాకు మొఱపెట్టినయెడల నేను నిశ్చయముగా వారి మొఱను విందును.” (నిర్గ. 22:22, 23) ఇలాంటివారు తమ భౌతిక అవసరాలను తీర్చుకోవడానికి సహాయం చేసే ఏర్పాట్లు కూడా దేవుని ధర్మశాస్త్రములో ఉన్నాయి. (ద్వితీ. 24:19-21) క్రైస్తవ ఏర్పాటు క్రింద, సత్యారాధకులు ‘దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించమని’ ఉద్బోధించబడ్డారు. (యాకో. 1:27) ఒంటరి తల్లి/తండ్రి ఉన్న లేక మతపరంగా విభాగించబడిన కుటుంబాలలో పెరుగుతున్న పిల్లలపట్ల ప్రేమపూర్వకమైన శ్రద్ధ కనపర్చడంలో మనం యెహోవాను ఎలా అనుకరించగలము?

2 ఆధ్యాత్మిక శిక్షణ: మీరు ఒంటరి తల్లి/తండ్రి అయినా మీకు అవిశ్వాసి అయిన భాగస్వామి ఉన్నా మీ పిల్లలతో క్రమంగా గృహ బైబిలు అధ్యయనాన్ని నిర్వహించడం కష్టంగా ఉండవచ్చు. అయితే మీ పిల్లలు సమతుల్యతగల పరిణతి చెందిన వ్యక్తులుగా తయారవ్వాలంటే క్రమమైన, అర్థవంతమైన బైబిలు అధ్యయనం చేయడం అవసరం. (సామె. 22:6) వారితో ప్రతీరోజు ఆధ్యాత్మిక విషయాల గురించి సంభాషించడం కూడా చాలా అవసరం. (ద్వితీ. 6:6-9) కొన్నిసార్లు మీరు నిరుత్సాహపడవచ్చు, కానీ మీరు ఆ పనిని మాత్రం మానకండి. ‘మీ పిల్లలను యెహోవా శిక్షలోను బోధలోను పెంచుతుండగా’ మీకు శక్తినీ నడిపింపునీ ఇవ్వమని యెహోవాకు ప్రార్థించండి​—ఎఫె. 6:4.

3 మీకున్న లేఖనాధారిత బాధ్యతలను నెరవేర్చడంలో మీకు సహాయం అవసరమైతే, మీ అవసరాలను పెద్దలకు తెలియజేయండి. వారు ఆచరణాత్మక సలహాలను ఇవ్వగలరు లేక మీ గృహంలో మంచి ఆధ్యాత్మిక దినచర్యను ఏర్పాటు చేసుకోవడానికి సహాయం చేయగలరు.

4 ఇతరులు ఎలా సహాయపడవచ్చు: మొదటి శతాబ్దంలో, మతపరంగా విభాగించబడిన కుటుంబంలో పెరిగినప్పటికీ తిమోతి యెహోవాకు అత్యుత్సాహవంతుడైన సేవకుడిగా తయారయ్యాడు. ఆయన అలా తయారవ్వడానికి, ఆయనకు బాల్యములో పరిశుద్ధ లేఖనాలను నేర్పించాలని ఆయన తల్లి, అమ్మమ్మ చేసిన తీవ్రమైన కృషి ఖచ్చితంగా ప్రాముఖ్యమైన పాత్ర నిర్వహించింది. (అపొ. 16:1, 2; 2 తిమో. 1:3-5; 3:14, 15) అయితే, ఆయన ఇతర క్రైస్తవుల సహవాసం నుండి కూడా ప్రయోజనం పొందాడు. ఆ క్రైస్తవులలో, “ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు” అని తిమోతిని పిలిచిన అపొస్తలుడైన పౌలు కూడా ఉన్నాడు.​—1 కొరిం. 4:17.

5 అదేవిధంగా నేడు, ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన సహోదర సహోదరీలు సంఘంలోని తండ్రిలేని పిల్లలపట్ల ప్రేమపూర్వకమైన శ్రద్ధను కనపర్చడం ఎంత ప్రయోజనకరం! మీకు అటువంటి పిల్లలలో ప్రతి ఒక్కరి పేరు తెలుసా? క్రైస్తవ కూటాలలో, ఇతర సందర్భాలలో మీరు వారితో మాట్లాడతారా? మీతోపాటు క్షేత్ర పరిచర్యలో పాల్గొనమని వారిని ఆహ్వానించండి. బహుశా అప్పుడప్పుడు, మీరు వారిని వారి ఒంటరి తల్లి/తండ్రితోపాటు లేక విశ్వాసి అయిన తల్లి/తండ్రితోపాటు మీ కుటుంబ అధ్యయనంలో చేర్చుకోవచ్చు లేదా ఆరోగ్యకరమైన వినోదం కోసం మీరు చేస్తున్న ఏర్పాట్లలో వారిని చేర్చుకోవచ్చు. ఈ యౌవనస్థులు మిమ్మల్ని తమ స్నేహితులుగా దృష్టిస్తే, మీ మాదిరిని అనుకరించి మీ ప్రోత్సాహాన్ని స్వీకరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.​—ఫిలి. 2:4.

6 తండ్రిలేని పిల్లలపట్ల యెహోవా ఎంతో శ్రద్ధ కలిగివున్నాడు, వారు సత్యాన్ని అంగీకరించి, దాన్ని ప్రేమించి, దాని అనుసారంగా జీవించేలా సహాయపడేందుకు మనం ప్రేమపూర్వకంగా చేస్తున్న కృషిని ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఒంటరి తల్లి/తండ్రి ఉన్న లేక విభాగించబడిన గృహాలలో పెరిగిన అనేకమంది అలాంటి ప్రోత్సాహాన్ని పొంది ఇప్పుడు పయినీర్లుగా, పరిచర్య సేవకులుగా, పెద్దలుగా, ప్రయాణ పైవిచారణకర్తలుగా, బేతేలు కుటుంబ సభ్యులుగా విశ్వసనీయంగా సేవచేస్తున్నారు. మనమందరం మన పరలోక తండ్రిని అనుకరిస్తూ తండ్రిలేని పిల్లలపట్ల ప్రేమతో మన “హృదయములను విశాలపరచు”కొనడానికి అవకాశాల కోసం కనిపెట్టుకుని ఉందాము.​—2 కొరిం. 6:11-13.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి