కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/02 పేజీ 8
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2002
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2008
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2003
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2002
km 11/02 పేజీ 8

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

తేజరిల్లు! అక్టో.-డిసెం.

“చాలామందికి పోలీసులంటే ఇష్టం లేనట్లు కనిపిస్తుంది, కానీ వాళ్ళు లేకపోతే ఈ దేశం ఎలా ఉండేదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? [జవాబు చెప్పనివ్వండి.] ప్రస్తుతం మనకు పోలీసులు అవసరం, అయితే త్వరలోనే వారు ఇక అవసరం లేని పరిస్థితి రానైయుంది. దానికిగల కారణాన్ని ఈ వచనంలో చూడండి. [2 పేతురు 3:13 చదవండి.] నేరంలేని లోకం గురించి మీరు ఇంకా ఎక్కువ చదవడానికి ఇష్టపడితే, తేజరిల్లు! యొక్క ఈ సంచికను చదివి మీరు తప్పక ఆనందిస్తారు.”

కావలికోట నవం. 15

“దేవుణ్ణి ఆరాధించడానికి మనకు చర్చీలు, ఆలయాలు అవసరమా అని కొందరు ఆలోచిస్తారు. మీరేమనుకుంటున్నారు? [జవాబు చెప్పనివ్వండి.] ఈ విషయంలో బైబిలు ఏమి చెబుతుందో గమనించండి. [అపొస్తలుల కార్యములు 17:24 చదవండి.] మరి ఆరాధనా స్థలాలు దేనికి ఉపయోగపడాలి? ఆ ప్రశ్నకు ఈ పత్రిక లేఖనాధారితమైన సమాధానాన్ని ఇస్తుంది.”

తేజరిల్లు! అక్టో.-డిసెం.

“కార్లను స్కూటర్లను కొనుక్కునే ప్రజల సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది, అయితే దుర్ఘటనలు కూడా అధికమవుతున్నాయి. దుర్ఘటనలను నివారించడం సాధ్యమేనా? [జవాబు చెప్పనివ్వండి.] ఏ ఒక్కరు కూడా విపత్తుకు అతీతులు కారని బైబిలు అంగీకరిస్తుంది. [ప్రసంగి 9:11 చదవండి, 22వ పేజీని చూపించండి.] అయితే, మీరు డ్రైవ్‌ చేసేటప్పుడు మీ భద్రతను ఎలా అధికం చేసుకోవచ్చో తేజరిల్లు! యొక్క ఈ సంచిక చర్చిస్తుంది.”

కావలికోట డిసెం. 1

“ఈ రోజుల్లో దాదాపు అందరూ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. చర్చీల విషయంలో కూడా అదే నిజం, విరాళాల కోసం చేసే అభ్యర్థనలు మరీ ఎక్కువైపోయాయి. మీకు అది విసుగు పుట్టిస్తుందా? [జవాబు చెప్పనివ్వండి, తర్వాత 1 థెస్సలొనీకయులు 2:9 చదవండి.] ఈ విషయం గురించి బైబిలు ఏమి చెబుతోందో ఈ కావలికోట చర్చిస్తుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి