కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/02 పేజీ 7
  • ప్రశ్నా భాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నా భాగం
  • మన రాజ్య పరిచర్య—2002
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రశ్నాభాగము
    మన రాజ్య పరిచర్య—1991
  • మనకు సంఘం అవసరం
    మన రాజ్య పరిచర్య—1995
  • మంచివార్త ప్రకటించే పద్ధతులు
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • సంఘం క్షేమాభివృద్ధి పొందనివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2002
km 11/02 పేజీ 7

ప్రశ్నా భాగం

◼ మనం నివసిస్తున్న క్షేత్రం అసైన్‌ చేయబడిన సంఘానికి హాజరవ్వడంలో ఉన్న ప్రయోజనాలు ఏమిటి?

సంఘ ఏర్పాటు ద్వారా “ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును” మనం ప్రోత్సహించబడతాము. (హెబ్రీ. 10:24, 25) సంఘం ద్వారా మనం సత్యాన్ని నేర్చుకుంటాము, శిష్యులను చేయమని మనకివ్వబడిన నియామకాన్ని నెరవేర్చడానికి సంసిద్ధులమౌతాము. (మత్త. 28:19, 20) కష్టాలను నమ్మకంగా సహించడానికి మనం బలపర్చబడతాము, పెరిగిపోతున్న ఒత్తిళ్ళతో, చింతలతో విజయవంతంగా వ్యవహరించడానికి మనకు సహాయం చేసేందుకు ప్రేమపూర్వకమైన పైవిచారణకర్తలు ఉన్నారు. నిజమే, మనం ఆధ్యాత్మికంగా సజీవంగా ఉండడానికి సంఘం ఎంతో ప్రాముఖ్యం. అయితే, మనం నివసిస్తున్న ప్రాంతమే క్షేత్రంగా అసైన్‌ చేయబడిన సంఘానికి హాజరవ్వడంలో ప్రయోజనాలు ఉన్నాయా?

వ్యక్తిగత పరిస్థితులు భిన్నంగా ఉంటాయి కాబట్టి ఉద్యోగం, అవిశ్వాసియైన భాగస్వామి, రవాణా సౌకర్యాలు వంటి విషయాలు తాము ఏ సంఘానికి హాజరవుతామన్న విషయంలో తీసుకునే తుది నిర్ణయాన్ని ప్రభావితం చేయవచ్చు. అయితే, ఒక వ్యక్తి తాను నివసిస్తున్న ప్రాంతమే క్షేత్రంగా అసైన్‌ చేయబడిన సంఘంతో సహవసించినప్పుడు నిర్దిష్టమైన ప్రయోజనాలు, ఆధ్యాత్మిక, ఆచరణాత్మక ప్రయోజనాలు ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో పెద్దలు ప్రచారకులందరినీ మరింత త్వరగా కాంటాక్ట్‌ చేసే అవకాశం ఉండవచ్చు. మునుపు వచ్చిన ప్రశ్నా భాగాలు అనేక ఇతర ప్రయోజనాలను ఉన్నతపర్చాయి.​—జూన్‌ 1991, ఏప్రిల్‌ 1976 (ఆంగ్లం), మార్చి 1967 (ఆంగ్లం).

సాధారణంగా దగ్గర్లో ఉన్న కూటాలకు హాజరవ్వడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇతరులతో మాట్లాడడానికి ముందుగా రావడం, అవసరమైన విషయాలను చూసుకోవడం, ప్రారంభపు పాట, ప్రార్థనల్లో పాల్గొనడం వంటివి సాధ్యమవుతాయి. క్రొత్తగా ఆసక్తి చూపిస్తున్నవారు మన ఇరుగుపొరుగున నివసిస్తుంటే, వారిని కలవడానికీ వారితో బైబిలు అధ్యయనాలను నిర్వహించడానికీ వారికి అత్యంత అనుకూలమైన కూటాలకు హాజరవ్వమని చెప్పడానికి మనకు మరింత సులభంగా ఉంటుంది.

కుటుంబ శిరస్సులు, తమ కుటుంబాల ఆధ్యాత్మిక, భౌతిక సంక్షేమానికి ఏది మంచిదో నిర్ణయించుకోవడంలో చేరివున్న అంశాలన్నింటినీ జాగ్రత్తగా పరిగణలోకి తీసుకుంటూ ఈ విషయాన్ని ప్రార్థనాపూర్వకంగా ఆలోచిస్తారని మాకు నమ్మకం ఉంది.​—1 తిమో. 5:8.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి