పత్రికల గురించి ఏమని చెప్పాలి?
తేజరిల్లు! ఏప్రి.-జూన్
“నేడు చిన్నపిల్లలకు బోధించే బాధ్యత ఉపాధ్యాయులకు అప్పగించబడింది, వారు రాబోయే సంవత్సరాల్లో వారిని ప్రభావితం చేయగలరు. మన ఉపాధ్యాయులు మంచి ప్రభావాన్ని చూపిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? [సామెతలు 2:10, 11 చదవండి.] ఉపాధ్యాయులు నిర్వహించే ప్రధానమైన పాత్రను, వారికున్న ఈ కష్టమైన సవాలు విషయంలో వారికి సహాయపడడానికి తల్లిదండ్రులు ఏమి చేయగలరనే విషయాన్ని తేజరిల్లు! ఉన్నతపరుస్తుంది.”
కావలికోట జూన్ 15
“మనం ఎప్పటికైనా ఇలాంటి సమస్యల అంతాన్ని చూడగలమని మీరు అనుకుంటున్నారా? [మొదటి ఆర్టికల్ ప్రారంభంలో ఉన్న వాక్యాలను చదవండి, జవాబు చెప్పనివ్వండి.] ఇలాంటి సమస్యలు త్వరలోనే అంతమౌతాయని దేవుని ప్రేరేపిత వాక్యము మనకు హామీ ఇస్తుంది. [కీర్తన 72:12-14 చదవండి.] ఇది ఎలా సాధించబడుతుందో కావలికోట యొక్క ఈ సంచిక వివరిస్తుంది.”
తేజరిల్లు! ఏప్రి.-జూన్
“చాలామంది, అపరాధ భావాలను, కోరదగినవి కావు అన్నట్లు దృష్టిస్తారు. ఇలాంటి భావాలు మనకు ఏమైనా మంచి చేయగలవని మీరు అనుకుంటున్నారా? [జవాబు చెప్పిన తర్వాత, కీర్తన 32:3, 5 చదవండి.] ఈ భావాలు మనం అనుకూలమైన చర్య తీసుకునేలా మనల్ని ఎలా కదిలించగలవో తేజరిల్లు! యొక్క ఈ సంచిక చూపిస్తుంది.”
కావలికోట జూలై 1
“కోట్లాదిమంది తమ ఆరాధనలో విగ్రహాలను గానీ ప్రతిమలను గానీ ఉపయోగిస్తారు, మరోవైపు అలా చేయడం తప్పు అని కోట్లాదిమంది ఇతరులు భావిస్తారు. దేవుడు ఎలా భావిస్తాడని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? [జవాబు చెప్పనివ్వండి. తర్వాత యోహాను 4:24 చదవండి.] ప్రతిమలను ఉపయోగించడం ఎలా ప్రారంభమయ్యిందో, విగ్రహారాధన గురించి బైబిలు ఏమంటుందో ఈ ఆర్టికల్లు చూపిస్తాయి.”