కార్యాచరణలో ఉన్న నూతన లోక సంస్థపై చారిత్రక పునఃసమీక్ష
1954 కాలపు ఈ వీడియో ఫిలింను మీరు చూస్తున్నప్పుడు, ఈ క్రింది ప్రశ్నలకు జవాబుల గురించి ఆలోచించండి: (1) మొట్టమొదట ఈ ఫిలింను ఎందుకు నిర్మించారు, అది ఏమి సాధించింది? (2) యెహోవాసాక్షులు ఎటువంటి ప్రచురణలను ప్రచురిస్తారు, ఎవరి కోసం, ఎందుకోసం? (3) కావలికోట పత్రిక యొక్క నేటి ప్రతుల సంఖ్యకు 1954 ప్రతుల సంఖ్యకు ఎలాంటి పోలిక ఉంది? (4) ఇటీవలి సంవత్సరాల్లో, మన ముద్రణా ప్రక్రియ మరింత ఎక్కువ స్థాయిలో ఎలా ఆధునీకరించబడింది? (5) 1953లో, యాంకీ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ సమావేశం గురించిన విషయాల్లో మిమ్మల్ని ప్రభావితం చేసిందేమిటి? (6) ట్రేలర్ సిటీ అని దేన్ని పిలిచారు, దాని గురించి ఎలాంటి విశిష్టమైన విషయాలను మీరు గమనించారు? (7) మన పని ఒక దేశానిది, ఒక జాతీయతకు సంబంధించినది లేక ఒక ప్రజది కాదని ఏమి చూపిస్తోంది? (8) యెహోవా సంస్థ కార్యాచరణల్లోని ప్రేమపూర్వక స్ఫూర్తిని మీరు ఏ విధానాల్లో గ్రహించగలిగారు? (కీర్త. 133:1) (9) నూతన లోక సంస్థ యొక్క 1950ల నాటి కార్యకలాపాల పునఃసమీక్షను చూడడానికి ఎవరు ఇష్టపడతారని మీరనుకుంటున్నారు?