ప్రకటనలు
▪ సాహిత్య ప్రతిపాదనలు ఆగస్టు నెలలో: ఈ క్రింద ఇవ్వబడిన 32-పేజీల బ్రోషూర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, నిరంతరము నిలిచే దైవిక నామము (ఆంగ్లం), పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. ఈ బ్రోషూర్లతో పాటు మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మృతుల ఆత్మలు—అవి మీకు సహాయపడగలవా లేక హాని తలపెట్టగలవా? అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), యుద్ధంలేని లోకం ఎప్పటికైనా ఉంటుందా? (ఆంగ్లం), సర్వమానవాళి కొరకైన గ్రంథము అనే బ్రోషూర్లను సముచితమైనచోట్ల ప్రతిపాదించవచ్చు. సెప్టెంబరు నెలలో: ఇరవయ్యో శతాబ్దమందలి యెహోవాసాక్షులు అనే బ్రోషూరు, జీవం—ఇక్కడికెలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? (ఆంగ్లం) అనే పుస్తకము. అక్టోబరు నెలలో: కావలికోట, తేజరిల్లు! పత్రికలు. ఆసక్తి ఉన్న చోట పత్రికా మార్గాలను వృద్ధి చేయడానికి పునర్దర్శనాలు చేయండి. పత్రికా మార్గం ఆచరణాత్మకం కానప్పుడు మాత్రమే చందాలను ప్రతిపాదించవచ్చు. నవంబరు నెలలో: దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? బ్రోషూరు లేక నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకము. ఒకవేళ ఇవి ప్రజల దగ్గర అప్పటికే ఉంటే దేవుని కోసం మానవజాతి అన్వేషణ (ఆంగ్లం) లేక ఇతర పాత ప్రచురణను ప్రతిపాదించవచ్చు.
▪ సంఘ పైవిచారణకర్త గానీ లేక ఆయన నియమించిన మరొకరు గానీ సెప్టెంబరు 1న లేక అటు తర్వాత సాధ్యమైనంత త్వరలో సంఘపు అక్కౌంట్స్ ఆడిట్ చేయాలి. ఇలా ఆడిట్ చేసిన వివరాలు, తరువాతి అక్కౌంట్స్ రిపోర్టు చదివిన తర్వాత సంఘానికి ప్రకటించాలి.
▪ త్వరలోనే బెంగళూరులోని క్రొత్త బ్రాంచి సదుపాయాలకు మారే సందర్భాన్ని పరిగణలోకి తీసుకొని, రెండు సంవత్సరాలకు సరిపడే ఫారములు, 2002, 2003 సేవా సంవత్సరాల్లో ఉపయోగించడానికి విడి విడి ప్యాకెట్లలో ప్రతి సంఘానికి ఈ సంవత్సరం పంపబడతాయి. దయచేసి ఈ ఫారాలను వివేచనతో ఉపయోగించండి. అవి దేనికి ఉద్దేశించబడినవో వాటి కోసం మాత్రమే ఉపయోగించాలి. 2003వ సేవా సంవత్సరానికి పంపించే ప్యాకెట్టును భవిష్యత్తులో ఉపయోగించడానికి జాగ్రత్తగా దాచిపెట్టండి.
▪ ఇకపై, పయినీరు సర్వీసు స్కూలుకు హాజరయ్యే క్రమపయినీర్లకు, తాము హాజరయ్యే సంవత్సరంలోని సెప్టెంబరు 1కల్లా కనీసం 16 ఏండ్ల వయస్సు ఉండి తీరాలి. ఒకవేళ అలా మైనారిటీ తీరని పయినీరు తల్లి లేక తండ్రి అదే స్కూల్లో హాజరవడానికి యోగ్యులవుతే మినహాయింపు ఉంటుంది.
▪ ఆగస్టు 31, 2001న లేక ఆలోగా వీలునుబట్టి స్టాకులో ఉన్న పత్రికలతో సహా సాహిత్యాలన్నింటి వార్షిక ఇన్వెంటరీ తీసుకోవాలి. ప్రతినెల లిటరేచర్ కో-ఆర్డినేటర్ లెక్కించే విధంగానే ఈ ఇన్వెంటరీ చేయాలి, అలా లెక్కించిన స్టాకు వివరాలను లిటరేచర్ ఇన్వెంటరీ ఫారంలో (S-18) ఎక్కించాలి. స్టాకులో ఉన్న పత్రికల మొత్తం సంఖ్యను సంఘంలో ఉండే లిటరేచర్ గ్రూపులోని పత్రికలను పర్యవేక్షించే సేవకుల నుండి పొందవచ్చు. ప్రతి కోఆర్డినేటింగ్ సంఘానికి మూడు లిటరేచర్ ఇన్వెంటరీ ఫారంలు (S-18) అందుతాయి. దయచేసి ఒరిజినల్ ఫారంను బ్రాంచి కార్యాలయానికి సెప్టెంబరు 6వ తేదీకి ముందే పోస్టు చేయండి. రెండవ కాపీని మీ ఫైళ్ళ కోసం ఉంచుకోండి. మూడవ కాపీని వర్క్ షీటుగా ఉపయోగించవచ్చు. లిటరేచర్ ఇన్వెంటరీ కో-ఆర్డినేటింగ్ సంఘ కార్యదర్శి పర్యవేక్షణలో జరగాలి. కార్యదర్శి, సంఘ పైవిచారణకర్త ఇద్దరూ ఫారంపై సంతకాలు చేస్తారు.
▪ లోనావ్లా బేతేలులో 2001, ఆగస్టు 24 నుండి 31 వరకు స్టాకులో ఉన్న సాహిత్యాలన్నింటి ఇన్వెంటరీ జరుగుతుంది. కాబట్టి, రిక్వెస్టు చేయబడిన సాహిత్యాలు ఆ కాలంలో ఏ సంఘానికి పంపించబడవు.
▪ లభ్యమయ్యే కొత్త ప్రచురణలు:
యెషయా ప్రవచనం—సర్వ మానవాళికి వెలుగు I —కన్నడ, తమిళం, తెలుగు, పంజాబి, హిందీ
మనం పరదైసుకు వెళ్ళడానికి దేవుని నడిపింపు —హిందీ