కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/00 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2000
  • ఉపశీర్షికలు
  • డిసెంబరు 11తో ప్రారంభమయ్యే వారం
  • డిసెంబరు 18తో ప్రారంభమయ్యే వారం
  • డిసెంబరు 25తో ప్రారంభమయ్యే వారం
  • జనవరి 1తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2000
km 12/00 పేజీ 2

సేవా కూటాల పట్టిక

డిసెంబరు 11తో ప్రారంభమయ్యే వారం

పాట 6 (45)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. సంఘంలో మహాగొప్ప మనిషి లేక గొప్ప బోధకుడు (ఆంగ్లం) పుస్తకాలు స్టాకున్నట్లయితే, సెలవు దినాల్లో పరిచర్యనందు వాటిని ప్రయోజనకరమైన రీతిలో ఎలా ఉపయోగించవచ్చో చూపించండి. డిసెంబరు 25తో ప్రారంభమయ్యే వారపు సేవా కూటంలో జరిగే చర్చ కోసం సిద్ధపడడంలో భాగంగా ద బైబిల్‌​—ఏక్యురేట్‌ హిస్టరీ, రిలయబుల్‌ ప్రోఫసీ అనే వీడియో క్యాసెట్‌ను చూడమని ప్రతి ఒక్కర్నీ ప్రోత్సహించండి. ఆ వీడియో క్యాసెట్‌ ఉన్నవారు, దాన్ని లేనివారికి ఇవ్వడంగానీ, బహుశా వాళ్లతో కలిసి చూడడంగానీ చేయవచ్చు.

15 నిమి: “దినమెల్లా యెహోవాకు భయపడండి.”a తేజరిల్లు !, ఫిబ్రవరి 8, 1998 సంచికలో, 27వ పేజీలో ఉన్న దైవభయాన్ని గురించిన వివరణను కూడా చేర్చండి. యెహోవాకు భయపడడం వల్ల కల్గే క్షేమాభివృద్ధికరమైన ప్రయోజనాలను నొక్కి చెప్పండి.

20 నిమి: “తోటివారి ఒత్తిడి, ప్రకటించే మీ ఆధిక్యత.” ప్రసంగం, పరిచయాలు. తోటివారి ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రకటించడంలో చురుకుగా ఎలా కొనసాగగలిగారో తెలియజేసేందుకు తోటివారి ఒత్తిడిని అనుభవించిన ఆ యా వ్యక్తులను ఆహ్వానించండి.

పాట 21 (191) ముగింపు ప్రార్థన.

డిసెంబరు 18తో ప్రారంభమయ్యే వారం

పాట 5 (46)

15 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్‌ రిపోర్టు. డిసెంబరు 25, జనవరి 1ల కోసం ప్రత్యేక క్షేత్ర సేవా ఏర్పాట్లను గురించి తెలియజేయండి. ఈ ప్రశ్నకు జవాబివ్వండి: మతపరమైన కారణాలబట్టి చేయనంత వరకూ క్రైస్తవత్వంకాని మూలాలను కల్గివున్న వేడుకల్లో పాల్గొనడానికి ఏమైనా అభ్యంతరముందా?​—రీజనింగ్‌ పుస్తకంలోని 178-80 పేజీలను చూడండి.

12 నిమి: “2001వ సంవత్సరం కోసమైన దైవపరిపాలనా పరిచర్య పాఠశాల.” పాఠశాల పై విచారణకర్త ఇచ్చే ప్రసంగం. చదవవలసిన బైబిలు భాగాన్ని ఎప్పటికప్పుడు పూర్తిచేయమనీ, స్కూల్లో ఇవ్వబడిన అసైన్‌మెంట్లను నెరవేర్చడంలో పూర్తి శ్రద్ధను చూపమని అందరిని ప్రోత్సహించండి.

18 నిమి: “మీరు ధైర్యంగా ప్రకటిస్తారా?”b ఆర్టికల్‌లో ఉన్న లేఖనాలపై అభిప్రాయ వ్యక్తీకరణ వ్యాఖ్యానాలను రాబట్టండి. మన పరిచర్య పుస్తకంలోని 86వ పేజీని ఉపయోగిస్తూ, క్షేత్ర సేవలో మనం మరింత ధైర్యాన్ని సంపాదించి, మరింత ఫలవంతంగా ఎలా ఉండగలమో చూపండి.

పాట 13 (124) ముగింపు ప్రార్థన.

డిసెంబరు 25తో ప్రారంభమయ్యే వారం

పాట 3 (32)

10 నిమి: స్థానిక ప్రకటనలు. సాక్ష్యపు పనిలో ఇటీవల పొందిన అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి. జనవరి కోసమైన సాహిత్య ప్రతిపాదనల గురించి తెల్పండి.

10 నిమి: “క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమం.” ప్రశ్నా జవాబులు. జరగబోయే ప్రాంతీయ సమావేశ తారీఖులను ప్రకటించి, సమావేశం జరిగే రెండు రోజులూ హాజరవ్వమని అందరినీ ప్రోత్సహించండి. బైబిలు విద్యార్థులను సమావేశానికి ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా ప్రయత్నించమని అందరినీ ప్రోత్సహించండి. బైబిలు విద్యార్థులు సమావేశానికి హాజరవ్వడమనేది, సంఘంతో క్రమంగా సహవసించాలనే కోరికను రేకెత్తించవచ్చు.

25 నిమి: “ద బైబిల్‌​—ఏక్యురేట్‌ హిస్టరీ, రిలయబుల్‌ ప్రోఫసీ అనే వీడియో నుండి నేర్చుకోవడం.” ప్రేక్షకులతో చర్చ. ఇతరులను ప్రేరేపించేలా ఈ వీడియోను ఎలా ఉపయోగించవచ్చు అన్న విషయంపై సూచనలను ఇవ్వండి. (1999 వార్షిక పుస్తకంలోని 51-2 పేజీలు) బైబిలుపై తయారుచేయబడిన ఈ వీడియో పరంపరలో రెండవదైన ద బైబిల్‌​—మాన్‌కైండ్స్‌ ఓల్డెస్ట్‌ మోడరన్‌ బుక్‌ వీడియోను ఫిబ్రవరిలో మనం పరిశీలిస్తాం.

పాట 26 (212) ముగింపు ప్రార్థన.

జనవరి 1తో ప్రారంభమయ్యే వారం

పాట 11(85)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మీ సంఘం, కూటాల సమయాన్ని క్రొత్త సంవత్సరం నుంచి మార్చుకుంటున్నట్లైతే ఆ మారిన సమయాల ప్రకారం ప్రతి ఒక్కరూ కూటాలకు క్రమంగా హాజరవుతూ ఉండాలని దయాపూర్వకంగా ప్రోత్సహించండి. కూటాలు జరిగే సమయాల్లో ఎటువంటి మార్పులు చేసినా బైబిలు విద్యార్థులకూ, ఆసక్తిగల మరితరులకూ తెలియజేయండి, కూటాలు జరిగే క్రొత్త సమయాల్ని తెలియజేసే హ్యాండ్‌ బిల్లులను ఉపయోగించడం ప్రారంభించండి. దేశానికీ, స్థానిక సంఘానికీ సంబంధించిన ఆగస్టు నెల సేవా రిపోర్టుపై వ్యాఖ్యానించండి. డిసెంబరు నెల సేవా రిపోర్టును ఇవ్వమని ప్రచారకులకు గుర్తు చేయండి.

10 నిమి: “క్రొత్త ప్రత్యేక దిన సమావేశ కార్యక్రమము.” ఒక ప్రసంగం. రాబోయే ప్రత్యేక దిన సమావేశము ఎప్పుడు జరుగుతుందో తెలిస్తే ఆ తారీఖును తెలియజేసి, సమావేశం జరిగే రోజంతా ఉండేలా హాజరవ్వమని అందరినీ పురికొల్పండి. క్రొత్తగా ఆసక్తి చూపిస్తున్న వారినీ, బైబిలు విద్యార్థులనూ ఆహ్వానించమని ప్రచారకులను ప్రోత్సహించండి.

25 నిమి: పునర్దర్శనాల కోసం ఎలా సిద్ధపడాలి. తాము తమ పరిచర్యలో మరింత ఫలవంతంగా ఎలా ఉండగలరన్న దానిని తండ్రి తన కుటుంబంతో చర్చిస్తాడు. ఆసక్తి కనబరచిన వారందరి దగ్గరకూ తిరిగి వెళ్ళడానికున్న లేఖన కారణాలను ఆయన నొక్కి చెబుతాడు. కావలికోట, జూలై 1, 1999 సంచికలో 22వ పేజీ నందు, 18వ పేరాలో ఉన్న మార్గదర్శక సూత్రాలను ఉపయోగిస్తూ, కొన్ని పునర్దర్శనాలు చెయ్యడానికి ఆ కుటుంబ సభ్యులు సిద్ధపడతారు. తాము పరిచర్యలో మాట్లాడిన ప్రజలను మరలా సందర్శించాలన్న విషయాన్ని వారందరూ గుర్తిస్తారు. మొదటి సందర్శనంలో తమకు తారసపడిన వారి ప్రతిస్పందనను ప్రతి ఒక్కరూ వివరించగా, మిగతా కుటుంబ సభ్యులు పునర్దర్శనంలో దేని గురించి మాట్లాడితే బాగుంటుందో, ఏ లేఖనాన్ని ఉపయోగిస్తే బాగుంటుందో సూచిస్తారు. ప్రతిభావంతంగా ఉపయోగించగల విషయాలను దేవుడు కోరుతున్నాడు బ్రోషూరులో వారు కనుగొంటారు. ఆ తల్లిదండ్రులు తమ పిల్లల్లో ఒకరు పునర్దర్శనం చేసేటప్పుడు దేని గురించి మాట్లాడాలనే దాన్ని ప్రాక్టీస్‌ చేయిస్తారు. వచ్చే వారంలో పునర్దర్శనాలు చేయడానికని వారు నిర్దిష్ట సమయాన్ని ఏర్పాటు చేసుకుంటారు.

పాట 18 (162) ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాతాన్ని ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాతాన్ని ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి