“విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము”
1 “విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము” అని అపొస్తలుడైన పౌలు తిమోతికి ఉపదేశించాడు. (1 తిమో. 6:12) పౌలు ఆ మాటలకు తగ్గట్టుగానే జీవించాడు. తన జీవిత చరమాంకంలో, తాను వ్యక్తిగతంగా మంచి పోరాటాన్ని పోరాడినట్లు గట్టి నమ్మకంతో చెప్పాడు. (2 తిమో. 4:6-8) ఆయన తన పరిచర్యను అన్ని విధాలుగా దృఢంగానూ ధైర్యంతోనూ సహనంతోనూ పూర్తి చేశాడు. ఆయన మాదిరిని అనుకరించడం ద్వారా, క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన పోరాటంలో మనం చేయగలిగినంతా చేస్తున్నామన్న గట్టి నమ్మకాన్ని కలిగివుండవచ్చు.
2 తగినంత కృషి చేయండి: పౌలు పరిచర్యలో చాలా కష్టపడి పని చేశాడు. (1 కొరిం. 15:10) మన ప్రాంతంలో ఉన్న యోగ్యులైన వారందరినీ వెదికేందుకు మనం ప్రయత్నిస్తే మనం కూడా పరిచర్యలో అదేవిధంగా కష్టపడినవారమౌతాము. (మత్త. 10:11) యోగ్యులైన వాళ్ళలో కొంతమందిని వీధిలో కలిసి సాక్ష్యమిచ్చేందుకు మనం ఉదయాన్నే లేవవలసిన అవసరం ఉండవచ్చు అని దానర్థం. ప్రజలు ఇండ్లకు చేరే సమయానికి అంటే మధ్యాహ్నవేళ కానీ లేదా సాయంకాలం గానీ పనిచేయడం అని దానర్థం.
3 మన పుస్తకపఠన గుంపుతో క్షేత్రసేవ చేసేందుకు సమయానికి వెళ్ళడానికి మంచి క్రమశిక్షణ, మంచి ప్రణాళిక అవసరం. ఉదాహరణకు, బేతేలు కుటుంబంలోని కొంతమంది సభ్యులు తమకు నియమించబడిన సంఘాలతో వారాంతాల్లో కేవలం వెళ్ళడానికే 60 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టేంత దూరం ప్రయాణించి వెళ్తున్నారు. కొంతమంది ప్రచారకులు, కొన్ని కుటుంబాలు చాలా దూరం ప్రయాణించి వస్తున్నప్పటికీ, సమయానికి చేరుకుంటున్నందుకు మనం వారిని ప్రశంసించవచ్చు. అలా వారు శ్రద్ధ కల్గి ఉండడమూ తమ పనులను తాము సరైన విధంగా చక్కబెట్టుకోవడమూ వారిని, మనం అనుకరించదగిన మాదిరికర్తలనుగా చేస్తాయి.
4 మనం కనుగొన్న ఆసక్తిగల వారినందరినీ తిరిగి కలుసుకొనేలా మనం కదిలించబడాలి. మనం వీధి సాక్ష్యంలో గానీ లేక అనియత సాక్ష్యంలో గానీ మనం సాహిత్యాల్ని అందించినప్పుడు ఆ వ్యక్తి యొక్క చిరునామాను లేక ఫోన్ నెంబరును తీసుకొనేందుకు ప్రయత్నించాలి. ఆ తర్వాత అతనిలో ఆసక్తి పెరిగేలా తిరిగి ఆయనను కలిసి బైబిలు పఠనం ప్రారంభించేందుకు కృషిచేయాలి.
5 సేవలో క్రమంగా పాల్గొనాలి: పౌలు ఎంతో క్రమంగానూ సంపూర్ణంగానూ ప్రకటనాపనిలో పాల్గొన్నాడు. (రోమా 15:18, 19) మీ విషయమేమిటి? పరిచర్యలో మీరు క్రమంగా పాల్గొంటున్నారా? ఈ నెలలో ఇప్పటికింకా క్షేత్రసేవలో పాల్గొన్నారా లేదా? పుస్తక పఠన నిర్వాహకులు తమ గుంపులోని వారందరూ ఆగస్టు నెలలో క్షేత్రసేవలో పాల్గొనాలని ఆశిస్తున్నారు. అలా చేసేందుకు వాళ్ళు మీకు సహాయం చేస్తారు కూడా.
6 సువార్తకు పూర్తి మద్దతునివ్వడంలో పౌలు మాదిరిని అనుకరించడం ద్వారా ‘విశ్వాససంబంధమైన మంచి పోరాటం పోరాడడంలో’ మనం కొనసాగవచ్చు.