మీరు తప్పకుండా తిరిగి వెళ్లండి!
1 “ఎంత మంచి సంభాషణ జరిగిందో! నేను అక్కడకి తప్పకుండా తిరిగి వెళ్ళాలి.” మీరెప్పుడైనా అలా అని, తర్వాత ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడో మర్చిపోయారా? అయితే, మీరు ఖచ్చితంగా తిరిగి వెళ్లటానికున్న ఒకే ఒక మార్గం దాన్ని వ్రాసుకోవటమే.
2 వివరాలన్నీ వ్రాసుకోండి: ఆసక్తిగల వ్యక్తితో చేసిన సంభాషణ మీ మనస్సులోంచి ఇంకా చెరిగిపోకముందే, ఒక్క క్షణం ఆగి దానికి సంబంధించిన వివరాలను వ్రాసుకోండి. ఆ వ్యక్తి పేరును, ఆయన్ని మీరెలా గుర్తించగలరో వ్రాసుకోండి. అతని చిరునామాను వ్రాసుకోండి, అయితే దాన్ని ఊహించి వ్రాసేసుకోవద్దు కానీ అడిగి తెలుసుకుని కరెక్టుగా వ్రాసుకోండి. మీరు మాట్లాడిన విషయాన్ని, చదివిన లేఖనాల్ని, ఏ సాహిత్యాన్ని ఇచ్చారో అదీ వ్రాసుకోండి.
3 తిరిగి వచ్చినప్పుడు సమాధానం చెప్పేందుకు ఒక ప్రశ్నను అడిగినట్లైతే దాన్ని కూడా వ్రాసిపెట్టుకోండి. ఆ వ్యక్తి గురించి, అతని కుటుంబం, లేక మతాన్ని గురించి మీరేమైనా తెలుసుకున్నారా? అయితే దాన్ని వ్రాసుకోండి. తర్వాత మీరు వెళ్లినప్పుడు, వాటిని ప్రస్తావిస్తే ఆయా వ్యక్తులపై మీకున్న వ్యక్తిగత శ్రద్ధను అది చూపిస్తుంది. చివరిగా, మీరు వారిని మొదటగా ఎప్పుడు కలిశారో ఆ రోజును సమయాన్ని వ్రాసుకొని, ఎప్పుడు మరలా తిరిగి వస్తానని చెప్పారో అది కూడా వ్రాసుకోండి. చక్కగా వ్రాసిపెట్టుకోవటం వల్ల మీకు స్పష్టమైన జ్ఞాపికలు ఉంటాయి, తిరిగి వస్తానన్న మీ వాగ్దానాన్ని మర్చిపోకుండా ఉండగలుగుతారు.—1 తిమో. 1:12.
4 మీ రికార్డు ఒకసారి పూర్తైన తర్వాత, మీ మిగిలిన క్షేత్ర సేవ ఉపకరణాలతో పాటు, అంటే పుస్తకాల బ్యాగు, బైబిలు, తర్కము (ఆంగ్లం) పుస్తకం, సాహిత్యాలతోపాటు దాన్ని ఉంచితే చేతికి అందుబాటులో ఉంటుంది. తాళం వేసివున్న ఇళ్ల గురించి, మీరు మీ పునర్దర్శనాల గురించి వ్రాసివుంచుకునేందుకు ఉపయోగించే ఇంటింటి రికార్డులో కాకుండా మరోదానిలో వ్రాసి ఉంచుకోవడం మంచిది. పునర్దర్శనాల గురించి మీరు వ్రాసిపెట్టుకునేందుకు ఎంత కృషి చేసినప్పటికీ, మీరు తప్పకుండా తిరిగి వెళ్లడమే ప్రాముఖ్యమైన విషయం.
5 ఆ వ్యక్తి గురించి ఆలోచించండి: పరిచర్యకోసం తయారౌతున్నప్పుడు, మీ పునర్దర్శనాల నోట్సును ఒక్కసారి చూసుకోండి. ఒక్కో వ్యక్తి గురించి తలంచుతూ, పునర్దర్శనం చేసేటప్పుడు ఏం మాట్లాడితే బాగుంటుందో ఆలోచించండి. ఆ వ్యక్తికున్న ఆసక్తిని గృహ బైబిలు పఠనంగా ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించండి. అలా పథకం వేసుకోవడం సువార్త పరిచారకునిగా మీ సామర్థ్యాన్నే గాక, వ్యక్తిగతంగా మీ ఆనందాన్నీ పెంచుతుంది.—సామె. 21:5 ఎ.
6 ఈసారి ఆసక్తి ఉన్న వారిని మీరు కనుగొన్నప్పుడు, మీరు వారిని తేలిగ్గా గుర్తుంచుకోగలరని అనుకోకండి. బదులుగా, వివరాలను వ్రాసుకోండి, వాటిని మరోసారి చూసుకోండి, ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉండండి, మీరు తప్పకుండా తిరిగి వెళ్లండి!