మీరు ఎలా వింటున్నారన్నది చూసుకోండి
మనం సమావేశాలకు, సభలకు, సంఘకూటాలకు హాజరవుతున్నప్పుడు శ్రద్ధగా వినటం ఎంతో ప్రాముఖ్యం. (లూకా 8:18) వినే మీ సామర్థ్యాన్ని మీరు ఎలా మెరుగుపర్చుకోగలరు?
◼ కూటాలకు ముందు సుష్ఠుగా తినకండి.
◼ మీ మనస్సు ఇటు అటు వెళ్లటానికి అనుమతించకండి.
◼ ముఖ్యాంశాలను క్లుప్తంగా వ్రాసుకోండి.
◼ చదువుతున్న లేఖనాల్ని తీసి చూడండి.
◼ అవకాశం వచ్చినప్పుడు వ్యాఖ్యానించండి.
◼ అందించబడుతున్న విషయాన్ని గురించి ఆలోచించండి.
◼ మీరు వింటున్న వాటిని ఉపయోగించే మార్గాలను ఆలోచించండి.
◼ తర్వాత, మీరు నేర్చుకున్నవాటి గురించి మాట్లాడండి.
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నిర్దేశక పుస్తకము (ఆంగ్లం) 5వ పాఠాన్ని చూడండి.