కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/00 పేజీలు 3-6
  • తూర్పు ఐరోపాలో విస్తరిస్తున్న సత్యారాధన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తూర్పు ఐరోపాలో విస్తరిస్తున్న సత్యారాధన
  • మన రాజ్య పరిచర్య—2000
  • ఇలాంటి మరితర సమాచారం
  • రాజ్య మందిర నిర్మాణ కార్యక్రమం ముందుకు సాగుతోంది
    మన రాజ్య పరిచర్య—2004
  • అసాధారణమైన పెరుగుదలవల్ల తక్షణ విస్తరణ అవసరమౌతోంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • యెహోవాకు ఘనత తెచ్చే నిర్మాణ పని
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • రాజ్య మందిర నిర్మాణ అవసరతను పూర్తిచేయడం
    మన రాజ్య పరిచర్య—1997
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2000
km 1/00 పేజీలు 3-6

తూర్పు ఐరోపాలో విస్తరిస్తున్న సత్యారాధన

1 మొదటి శతాబ్దపు క్రైస్తవులు అత్యంతాసక్తి గల రాజ్య ప్రచారకులు. సంఘాలు “అనుదినము లెక్కకు విస్తరించుచు”న్నప్పుడు వారు సంతోషించారు. (అపొ. 16:5) ధైర్యంతో కూడిన వారి ప్రకటన సత్యారాధనను ఆసియా, ఆఫ్రికా, ఐరోపాలకు తీసుకువెళ్ళింది, ఫలితంగా విశ్వాసుల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగింది.

2 ఈ అంత్యకాలాల్లో తూర్పు ఐరోపా దేశాలలోనికి సత్యారాధన అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. 1990ల తొలిభాగం వరకు ఏ దేశాల్లోనైతే మనం ప్రభుత్వ నిషేధాల క్రింద ఉన్నామో ఆ దేశాల్లో ఇప్పుడు మనం విశిష్టమైన పెరుగుదలను అనుభవిస్తున్నాము. అలాంటి రెండు దేశాలైన రష్యా, యుక్రేయిన్‌లలో ఒక్కోదానిలోనూ 1,00,000 కంటే ఎక్కువమంది ప్రచారకులు బహిరంగ పరిచర్యలో పాల్గొంటున్నట్లు 1999 వార్షిక పుస్తకం (ఆంగ్లం) తెలియజేస్తుంది. పూర్వపు సోవియట్‌ యూనియన్‌లోని 15 ప్రాంతాల్లో 1991 నుంచి 2,20,000 మంది యెహోవాకు సమర్పించుకొని బాప్తిస్మం పొందారు! వేగవంతమైన ఈ పెరుగుదల అనేక క్రొత్త రాజ్యమందిరాలు, సమావేశ మందిరాలు నిర్మించాల్సిన, అలాగే బ్రాంచి సౌకర్యాలను విస్తరింపజేయాల్సిన అవసరాన్ని సృష్టించింది.

3 అమెరికా దేశం కోసమైన మార్చి 1997 మన రాజ్య పరిచర్యలో ప్రకటించినట్లుగా, సొసైటీ రాజ్య మందిర నిధిలో కొంతభాగం, అనేక రాజ్యమందిరాల అవసరం అత్యవసరంగా ఉండి, పరిమితమైన వనరులు, తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్న దేశాల్లోని సంఘాలకు ఋణాలు ఇచ్చేందుకు సహాయపడుతుంది. 1996 మార్చి, 1998 అక్టోబరు మధ్యకాలంలో 11 తూర్పు ఐరోపా దేశాలను పర్యవేక్షిస్తున్న బ్రాంచి కార్యాలయాల నుండి వచ్చిన 359 రాజ్యమందిర ఋణ అభ్యర్థనలకు సొసైటీ ఆమోదాన్నిచ్చింది. విరాళంగా ఇవ్వబడిన నిధులు క్రొత్త రాజ్యమందిరాన్ని నిర్మించేందుకు భూమిని కొనడానికీ, కావల్సిన వస్తువులు కొనేందుకూ, ఇప్పటికే ఉన్న వసతుల్ని మళ్లీ తీర్చిదిద్దడంలో సంఘాలకు సహాయపడేందుకూ ఉపయోగించబడుతున్నాయి. అమెరికాలోనూ, ఇతర దేశాల్లోనూ ఉన్న సొసైటీ రాజ్య మందిర నిధికి ఇచ్చే విరాళాలు, తూర్పు ఐరోపాలోని మన సహోదరులకు ఎలా ప్రయోజనం చేకూర్చాయో తెలుసుకునేందుకు ఇక్కడ ఇవ్వబడిన చిత్రాలు సహాయం చేస్తాయి.

4 బల్గేరియా 1998లో 12 శాతం అభివృద్ధిని సాధించింది, ఆ సంవత్సరం ఏప్రిల్‌లో వారి మొదటి రాజ్యమందిరం సమర్పించబడినప్పుడు అక్కడున్న సహోదరులకెంతో ఆనందాన్ని కలుగజేసింది. క్రోయేషియా 4 శాతం అభివృద్ధిని సాధించింది, ప్రస్తుతం అక్కడున్న సహోదరులు సత్యారాధనను అభివృద్ధి పర్చేందుకు మరిన్ని రాజ్యమందిరాలను నిర్మిస్తున్నారు. హంగేరీలో 80 రాజ్యమందిరాలను 144 సంఘాలు ఉపయోగిస్తున్నాయి. ఆ దేశంలోని 235 సంఘాల్లో, 61 శాతం సంఘాలకు తాము ఆరాధించుకునేందుకు సొంత ఆరాధనా స్థలముందని దీని అర్థం. మాసిదోనియాలో, రాజ్యమందిర నిర్మాణ కార్యక్రమం రెండు క్రొత్త మందిరాల నిర్మాణాన్ని పూర్తిచేసింది, ఇంకా అనేకం నిర్మాణంలో ఉన్నాయి. 1999 వేసవిలో, స్కోప్యే రాజధానిలో జంట రాజ్యమందిరం ఒకటి పూర్తి అయింది. ఈ మందిరం కనీసం 6 సంఘాలు ఉపయోగించుకునే సామర్థ్యాన్ని కల్గివుంది.

5 రష్యాలో 1998 సేవా సంవత్సరంలో ప్రతివారం సగటున 260 మంది వ్యక్తులు బాప్తిస్మం తీసుకున్నారు! ఇతర దేశాల్లోని మాదిరిని అనుసరిస్తూ, రష్యా బ్రాంచి సువిశాలమైన తమ ప్రాంతమంతటిలో భవిష్యత్‌ రాజ్యమందిర నిర్మాణ ప్రాజెక్టులకు మద్దతునిచ్చేందుకు ఇప్పుడు 12 రీజనల్‌ బిల్డింగ్‌ కమిటీలను సంస్థీకరించింది. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌కు ఉత్తరప్రాంతంలో, ఆ దేశంలో మొదటి సమావేశ మందిర నిర్మాణపని జరుగుతూ ఉంది, అందులో 1,600 మంది కూర్చోవచ్చు. అక్కడ 200 మంది కూర్చొనగలిగే ఐదు రాజ్యమందిరాలు కూడా ఉన్నాయి. యుక్రేయిన్‌లోని మన సహోదరుల, అలాగే ఆసక్తి చూపిస్తున్న అనేకుల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చేందుకు, 84 రాజ్యమందిరాలు పూర్తయ్యాయి, 80 రాజ్యమందిరాలు నిర్మాణంలో ఉన్నాయి.

6 తూర్పు ఐరోపాలోని ఈ అభివృద్ధి మన హృదయాలకు ఆనందాన్ని కల్గించడం లేదా? మనమెక్కడ నివసిస్తున్నా, ఈ సత్యారాధనా అభివృద్ధి దేవుడు పక్షపాతి కాడనీ, ఆయన దీర్ఘశాంతము “గొప్పసమూహము”నకు రక్షణ తీసుకురావడమనీ మనకు గుర్తుచేస్తుంది. (ప్రక. 7:9; 2 పేతు. 3:9) ఇతరుల ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడటంలో కొంత భాగం కల్గివుండటం మనకు ఎంతటి ఆధిక్యత! “బీదలకిచ్చువానికి లేమి కలుగదు” అని సామెతలు 28:27 మనకు అభయాన్నిస్తుంది. ఆ నిర్మాణ వ్యయాల్ని భర్తీచేయడానికి సహాయపడేందుకు మనం చూపించే సుముఖత వస్తుపరమైన ‘సమానత్వాన్ని’ తీసుకొచ్చి, ఇవ్వడం మూలంగా వచ్చే సంతోషాన్నీ, ప్రపంచవ్యాప్తంగా సత్యారాధన విస్తరించబడటాన్ని చూడటం మూలంగా కలిగే ఆనందాన్నీ అందరూ చవిచూసేలా చేస్తుంది.—2 కొరిం. 8:14, 15, NW; అపొ. 20:35.

[3వ పేజీలోని చిత్రం]

సాసిలీ, రుమేనియా

[3వ పేజీలోని చిత్రం]

మార్డు, ఎస్టోనియా

[3వ పేజీలోని చిత్రం]

సేవ్‌నికా, స్లొవేనియా

[3వ పేజీలోని చిత్రం]

టిస్‌జవస్వారి, హంగేరీ

[4వ పేజీలోని చిత్రం]

జూర్మలా, లాట్వియా

[4వ పేజీలోని చిత్రం]

టాల్లిన్‌, ఎస్టోనియా

[4, 5వ పేజీలోని చిత్రం]

టారేజ్‌, లిథువేనియా

[4, 5వ పేజీలోని చిత్రం]

బెల్‌గ్రేడ్‌, యుగోస్లేవియా

[5వ పేజీలోని చిత్రం]

ప్రీవిడ్జా, స్లొవేకియా

[5వ పేజీలోని చిత్రం]

మటేస్‌జల్కా, హంగేరీ

[6వ పేజీలోని చిత్రాలు]

రూమా, యుగోస్లేవియా

[6వ పేజీలోని చిత్రాలు]

వ్రానవ్‌ నాడ్‌ టాప్లూ, స్లోవేకియా

[6వ పేజీలోని చిత్రాలు]

టోర్నకాల్న్స్‌, లాట్వియా

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి