సేవా కూటాల పట్టిక
జనవరి 10తో ప్రారంభమయ్యే వారం
పాట 107 (4)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.
15 నిమి: “భూమ్యందంతటా యెహోవా నామాన్ని తెలియజేయడం.” ప్రశ్నా జవాబుల చర్చ. మన పరిచర్య పుస్తకం 93-4 పేజీల్లో నుండి అనియత సాక్ష్యాన్ని గురించిన వ్యాఖ్యలను కూడా చేర్చండి.
20 నిమి: రక్తరహిత వైద్యచికిత్స కోసం చట్టబద్ధమైన ఎంపిక చేసుకోవడం. (అపొ. 15:28, 29) అర్హుడైన ఒక పెద్ద, అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్/రిలీజ్ కార్డులోని విషయాలను చర్చించి, ఎల్లవేళలా దాన్ని తమ వద్ద ఉంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్తారు. ఈ కూటం తర్వాత, బాప్తిస్మం తీసుకున్న సాక్షులు అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్/రిలీజ్ కార్డును పొందవచ్చు, బాప్తిస్మం తీసుకోని మైనరు పిల్లలుగలవారు ప్రతి బిడ్డకూ ఒక్కొక్క ఐడెంటిటీ కార్డును పొందవచ్చు. ఆ కార్డులను ఈ రాత్రికే పూరించకూడదు. వాటిని జాగ్రత్తగా ఇంటివద్ద పూరించాలి, కార్డు హోల్డరు ఇద్దరు సాక్షుల సమక్షంలోనే, వారు చూస్తుండగానే సంతకం చేయాలి. ఏవిధమైన సహాయమైనా అవసరమైనట్లయితే, కార్డు హోల్డరు తమ సంఘ పుస్తక పఠన నిర్వాహకుడ్ని సమీపించాలి. సంతకం చేసేముందు, కార్డులు పూర్తిగా నింపబడ్డాయని నిశ్చయపర్చుకోండి. సాక్షులుగా సంతకం చేసేవారు, కార్డు హోల్డరు దానిపై సంతకం చేయడాన్ని వాస్తవంగా చూడాలి. బాప్తిస్మం తీసుకోని ప్రచారకులు, ఈ కార్డులోని పరిభాషను ఉపయోగించుకుని, తమ పరిస్థితులకూ నమ్మకాలకూ తగినట్లుగా తమ కోసం తమ పిల్లల కోసం తమ స్వంత డైరెక్టివ్‌ను వ్రాసుకోవచ్చు. పుస్తక పఠన నిర్వాహకులు తమ గుంపులోవున్న వారందరికీ అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్/రిలీజ్ కార్డును నింపడానికి కావలసిన సహాయం అందేలా చూడాలి.
పాట 155 (23), ముగింపు ప్రార్థన.
జనవరి 17తో ప్రారంభమయ్యే వారం
పాట 12 (9)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్ రిపోర్ట్.
15 నిమి: స్థానిక అవసరాలు.
20 నిమి: “ఒక ముస్లిమ్‌తో మీరేమని చెప్తారు?” ప్రశ్నా జవాబులు. ఇతర సంస్కృతుల ప్రజలతో సంభాషిస్తున్నప్పుడు వివేచనను ఉపయోగించవలసిన అవసరాన్ని ఉన్నతపర్చండి. బాగా సిద్ధపడిన అందింపును ప్రదర్శించండి. ఇస్లామ్ మతంపై మరింత సమాచారం కోసం, ఫిబ్రవరి 1998 మన రాజ్య పరిచర్య ఇన్‌సర్ట్‌నూ, తర్కించుట (ఆంగ్లం) పుస్తకంలోని 23-4 పేజీలనూ, దేవుని కోసం మానవజాతి అన్వేషణ (ఆంగ్లం) 12వ అధ్యాయాన్నీ చూడండి.
పాట 57 (26), ముగింపు ప్రార్థన.
జనవరి 24తో ప్రారంభమయ్యే వారం
పాట 110 (23)
10 నిమి: స్థానిక ప్రకటనలు. క్షేత్రసేవ అనుభవాలు.
15 నిమి: “ప్రతిదినము యెహోవా వాక్యాన్ని పరిశీలించండి !” ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. ప్రతిదినము లేఖనములను పరిశీలించుట—2000 పుస్తకాన్ని బాగా ఉపయోగించమని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించండి. 3-4 పేజీల్లో ఇవ్వబడిన ముందుమాట నుండి వ్యాఖ్యానాలను ఇమడ్చండి. ప్రతిరోజూ లేఖనాన్ని, వ్యాఖ్యానాన్ని పరిశీలించేందుకు ఎలా ప్రత్యేక ప్రయత్నాలను చేసుకుంటున్నారో తెలియజేయమని ప్రచారకులను అడగండి.
20 నిమి: “దేవుని ప్రవచన వాక్యము అంతా నెరవేరుతుంది !” ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కంటే తక్కువకు పరిమితం చేయాలి, తర్వాత, ప్రశ్నా జవాబుల చర్చను చేయండి. మన కాలాల ప్రాముఖ్యాన్ని ఉన్నతపరచే క్రొత్త పుస్తకంలోని కొన్ని వివరణలను నొక్కితెల్పండి.
పాట 157 (27), ముగింపు ప్రార్థన.
జనవరి 31తో ప్రారంభమయ్యే వారం
పాట 16 (22)
12 నిమి: స్థానిక ప్రకటనలు. జనవరి కొరకైన క్షేత్రసేవా రిపోర్టులను ఇవ్వాలని ప్రచారకులకు గుర్తుచేయండి. ఫిబ్రవరి కొరకైన సాహిత్య అందింపు కుటుంబ సంతోషము పుస్తకం అని ప్రస్తావించండి. ఎవరితోనైనా సంభాషించడానికి, ఆ పుస్తకంలోని 12వ పేజీలో ఉన్న బాక్స్‌లోని మూడు ప్రశ్నలు ఎలా ఉపయోగించవచ్చో ప్రదర్శించండి.
15 నిమి: ‘కనిపెట్టి’ ఉండటం గురించిన ప్రశ్నకు సమాధానం. జూలై 15, 1999 కావలికోట 29-31 పేజీల ఆధారంగా పెద్ద ఇచ్చే ప్రసంగం.
18 నిమి: నిజమైన మతాన్ని గుర్తించేందుకు ఇతరులకు ఎలా సహాయపడవచ్చు. ప్రజలు యెహోవాసాక్షుల పట్ల మంచి అభిప్రాయం కల్గి ఉన్నప్పటికీ, ఇతర మతాలకు మన మతానికి మధ్య ఉన్న తేడాను స్పష్టంగా అర్థం చేసుకోలేకపోవడాన్ని గురించి అర్హతగల పరిచర్య సేవకుడు, ఇద్దరు లేక ముగ్గురు సమర్థులైన ప్రచారకుల మధ్య జరిగే చర్చ. మే 8, 1995 తేజరిల్లు! 20వ పేజీలో ఉన్న 10 విషయాలను పునఃసమీక్షించండి. ఈ అంశాలను తెలుసుకోవడం, సత్యారాధనకు అబద్ధ ఆరాధనకు మధ్య ఉన్న తేడాను, యెహోవా ప్రజల నుండి తెలుసుకొని మనతో సహవసించవలసిన అవసరాన్ని గ్రహించేందుకు యథార్థ హృదయంగల వ్యక్తికి ఎలా సహాయపడగలదో వివరించండి.
పాట 60 (17), ముగింపు ప్రార్థన.
ఫిబ్రవరి 7తో ప్రారంభమయ్యే వారం
పాట 113 (12)
8 నిమి: స్థానిక ప్రకటనలు.
17 నిమి: “తూర్పు ఐరోపాలో విస్తరిస్తున్న సత్యారాధన.” ప్రశ్నాజవాబుల కార్యక్రమాన్ని పెద్ద నిర్వహిస్తారు. ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాల అనుభవాలనుగానీ లేక వాటిలో పెరుగుదలకు సంబంధించిన రుజువులనుగానీ ఇటీవలి వార్షికపుస్తకాలు (ఆంగ్లం) నుండి తీసి చెప్పండి.
20 నిమి: వారు సరైన ఎంపిక చేసుకున్నారు. అక్టోబరు 15, 1997, కావలికోట 19-21 పేజీలు, 3-16 పేరాల ఆధారంగా ప్రసంగం. తాము తమ జీవితాలను ఎంతో ప్రతిఫలదాయకమైన విధంగా, ప్రయోజనకరమైన విధంగా గడిపామని వారు ఎందుకు భావిస్తున్నారో చూపించే, పయినీర్లు చేసిన వ్యాఖ్యానాలను తెలియజేయండి. పయినీరింగ్ చేసేందుకు తమకున్న అవకాశాలను పరిశీలించుకొనమని ప్రేక్షకుల్లోని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించండి.
పాట 182 (24), ముగింపు ప్రార్థన.