కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/00 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2000
మన రాజ్య పరిచర్య—2000
km 1/00 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు జనవరిలో: సంఘంలో స్టాకు ఉన్న 192 పేజీల పాత పుస్తకం ఏదైనా సరే. అలాంటి పుస్తకాలు అందుబాటులో లేని సంఘాలు లైఫ్‌—హౌ డిడ్‌ ఇట్‌ గెట్‌ హియర్‌? బై ఎవల్యూషన్‌? ఆర్‌ బై క్రియేషన్‌? లేదా మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు వంటివాటిని అందజేయవచ్చు. ఫిబ్రవరిలో: కుటుంబ సంతోషానికిగల రహస్యము. మార్చిలో: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. గృహ బైబిలు పఠనాలు ప్రారంభించడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేయాలి. ఏప్రిల్‌లో: కావలికోట, తేజరిల్లు! విడిపత్రికలు. ఆసక్తిగల ప్రజల కోసం దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్‌ను అందుబాటులో ఉంచుకోండి, బైబిలు పఠనాలు ప్రారంభించేందుకు కృషి చేయండి.

◼ జనవరి 10తో ప్రారంభమయ్యే వారంలో జరిగే సేవా కూటానికి హాజరయ్యే, బాప్తిస్మం పొందిన ప్రచారకులందరూ అడ్వాన్స్‌ మెడికల్‌ డైరెక్టివ్‌/రిలీజ్‌ కార్డులను, తమ పిల్లలకోసం ఐడెంటిటీ కార్డులను పొందవచ్చు.

◼ ఫిబ్రవరి ప్రారంభానికల్లా ప్రాంతీయ పైవిచారణకర్తలు “నిజమైన అర్మగిద్దోను—ఎందుకు? ఎప్పుడు?” అన్న బహిరంగ ప్రసంగాన్ని ఇవ్వడం ప్రారంభిస్తారు. ఆ ప్రసంగాన్ని ఇవ్వడం కనీసం మార్చి 5 కల్లా ప్రారంభించాలి.

◼ ఈ సంవత్సరం ఏప్రిల్‌ 19 బుధవారం సూర్యాస్తమయం తర్వాత జ్ఞాపకార్థ దినాన్ని జరుపుకునేందుకు సంఘాలు తగిన ఏర్పాట్లను చేసుకోవాలి. ప్రసంగం ముందే ప్రారంభమైనప్పటికీ జ్ఞాపకార్థదిన చిహ్నాలను సూర్యాస్తమయం అయ్యేంతవరకు అందించకూడదు. మీ ప్రాంతంలో ఎప్పుడు సూర్యాస్తమయమౌతుందో స్థానికాధికారులను అడిగి తెలుసుకోండి. ప్రతి సంఘమూ జ్ఞాపకార్థదినాన్ని తమకు తాముగా జరుపుకోవడం మంచిదైనప్పటికీ అన్నివేళలా ఇది సాధ్యంకాకపోవచ్చు. సాధారణంగా అనేక సంఘాలు ఒకే రాజ్యమందిరాన్ని ఉపయోగించుకుంటున్న ప్రాంతాల్లో, ఒకటి లేక అంతకన్నా ఎక్కువ సంఘాలు ఆ సాయంత్రానికి మరో స్థలాన్ని సిద్ధం చేసుకోవచ్చు. సాధ్యమైన చోట, సందర్శకులను పరామర్శించడానికి, ఆసక్తిగల క్రొత్త వారిని ప్రోత్సహించడానికి, మరి ఆ ఆచరణ నుండి పూర్తి ప్రయోజనం పొందేందుకు కూటానికి కూటానికి మధ్య కనీసం 40 నిమిషాల వ్యవధి ఉండాలని మేము సూచిస్తున్నాము. హాజరయ్యే వారిని తీసుకొని వెళ్లి, తీసుకొని వచ్చే దానితోసహా ట్రాఫిక్‌, పార్కింగ్‌ సమస్యలకు కూడా అవధానం ఇవ్వాలి. స్థానికంగా ఏ ఏర్పాట్లు ప్రయోజనకరంగా ఉంటాయో పెద్దల సభ నిర్ణయించాలి.

◼ 2000 జ్ఞాపకార్థ ఆచరణ కాలంలోని ప్రత్యేక బహిరంగ ప్రసంగం ఆదివారం ఏప్రిల్‌ 16న ఇవ్వబడుతుంది. ఆ ప్రసంగ అంశం “మానవజాతికి విమోచన క్రయధనం ఎందుకు అవసరం.” దాని ఔట్‌లైన్‌ ఇవ్వబడుతుంది. ఆ వారంలో ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శనంగానీ, ప్రాంతీయ సమావేశంగానీ, ప్రత్యేకదిన సమావేశంగానీ జరుగుతున్న సంఘాల్లో ఆ తర్వాతి వారంలో ప్రత్యేక ప్రసంగం ఇవ్వబడుతుంది. 2000, ఏప్రిల్‌ 16కి ముందు ఏ సంఘంలోనూ ఆ ప్రత్యేక ప్రసంగాన్ని ఇవ్వకూడదు.

◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:

వాచ్‌ టవర్‌ పబ్లికేషన్‌ ఇండెక్స్‌ 1998

◼ మరలా లభ్యమయ్యే ప్రచురణలు:

బ్రోషూర్‌లు: జీవిత సంకల్పమేమిటి?—కన్నడ, మరాఠీ, మలయాళం

◼ ఆడియో కాంపాక్ట్‌ డిస్క్‌లు:

సంగీతం—పాటలు: సింగింగ్‌ కింగ్‌డమ్‌ సాంగ్స్‌ (సింగిల్‌ డిస్క్‌)

ఆర్కెస్ట్రా మ్యూజిక్‌: కింగ్‌డమ్‌ మెలొడీస్‌ నెం. 1 నుండి 8 (8 డిస్క్‌ల సెట్‌) (డిస్క్‌ సంఖ్య తెలియజేసి, విడి డిస్క్‌లను కూడా ఆర్డర్‌ చేయవచ్చు)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి