దైవపరిపాలనా వార్తలు
◼ అర్మేనియా: 4,741 మంది ప్రచారకులలో ప్రతి ఒక్కరూ సరాసరి 16 గంటలు చొప్పున పరిచర్యలో గడిపారని డిసెంబరు నివేదిక చూపిస్తోంది. ప్రచారకుల ఈ క్రొత్త శిఖరాగ్ర సంఖ్య, గత సంవత్సరపు సగటు సంఖ్యకన్నా 17 శాతం అభివృద్ధి.
◼ చిలీ: పయినీర్లు పూర్తి చేయవలసిన గంటల్లో వచ్చిన మార్పును ఎంతో ఉత్సాహంతో ఆహ్వానించడం జరిగింది. అది, జనవరిలో 4,341 మంది క్రమ పయనీర్లు శిఖరాగ్ర స్థాయిలో రిపోర్టు చేయడంతో రుజువుపర్చబడింది. అంతేగాక, సహాయ పయినీర్లుగా 5,175 మంది రిపోర్టు చేశారు. ఇంతవరకూ ఈ సేవా సంవత్సరంలో రిపోర్టు చేయబడిన సంఖ్యలో అదే ఎక్కువ.
◼ యుక్రేయిన్: జనవరిలో రిపోర్ట్ చేసిన 1,00,129 ప్రచారకులలో 12 శాతం మంది ప్రచారకులు ఏదో ఒక విధమైన పూర్తికాల పరిచర్యలో సేవచేస్తున్న వారే. యుక్రేయిన్, 5,516 మంది క్రమ పయినీర్ల సంఖ్యకు చేరుకుంది. అది వరుసగా సాధించిన 27వ శిఖరాగ్ర సంఖ్య. దానితోపాటు 6,468 ప్రచారకులు సహాయ పయినీర్లుగా రిపోర్ట్ చేశారు.