జూన్‌లోని సేవాకూటాలు
జూన్ 7తో ప్రారంభమయ్యే వారం
పాట 45 (6)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు.
15 నిమి: “యెహోవా మనకు బోధిస్తున్నాడు.” ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కంటే తక్కువ సమయానికి పరిమితం చేయాలి. దైవ పరిపాలన పరిచర్య పాఠశాల, పయినీరు సేవా పాఠశాల, మన రాజ్య పరిచర్య పాఠశాల వంటి వాటి నుండి వారు పొందిన కొన్ని ప్రయోజనాలను తెల్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి. పరిచర్యలో మరింత ప్రతిఫలదాయకమైన సేవకులుగా తయారయ్యేలా యెహోవా ప్రజలకు, అవి ఎలా సహాయపడ్డాయో నొక్కి తెల్పండి.
20 నిమి: “మీ సమయాన్ని ప్రభావవంతంగా ఉపయోగించండి.” సంఘ పుస్తక పఠన నిర్వాహకునికీ, క్షేత్ర పరిచర్యలో సాధ్యమైనంత మేరకు పూర్తిగా పాల్గొనేందుకు తమ సమయాన్ని ఎలా అదుపులో ఉంచుకుంటున్నారో తెలియజేసే ఇద్దరు అనుభవజ్ఞులైన ప్రచారకులకూ మధ్య జరిగే చర్చ. వాళ్లు ఆచరణాత్మకమైన షెడ్యూలు ప్రాముఖ్యతను గురించి వివరించి, అలాంటి షెడ్యూల్ని కల్గివుండాల్సిన అవసరతను నొక్కి చెబుతారు. క్షేత్ర సేవను ఆలస్యంగా మొదలుపెట్టడం, సరియైన అడ్వాన్స్ ప్లానింగ్ లేకపోవడం లేక పరిచర్యలో ఎక్కువ సమయాన్ని ఇతరత్రా వాటిపై వెచ్చించడం వంటి వాటిని వారెలా విడనాడారన్న విషయాన్ని చెప్తారు. స్థానిక పరిస్థితులను పరిశీలించి, సమయాన్ని ప్రభావవంతంగా ఎలా ఉపయోగించవచ్చో అన్న విషయంపై ఆచరణాత్మక సలహాలను ఇవ్వండి.
పాట 48 (22), ముగింపు ప్రార్థన.
జూన్ 14తో ప్రారంభమయ్యే వారం
పాట 63 (18)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు.
15 నిమి: స్థానిక అవసరాలు.
20 నిమి: “మీరు మీ సహాయ హస్తాన్ని అందిస్తారా?” ప్రేక్షకులతో ఒక పెద్ద నిర్వహించే చర్చ. ఒంటరి తల్లులకు లేక తండ్రులకు సహాయపడేందుకు తేజరిల్లు! అక్టోబరు 8, 1995, 8-9 పేజీలలో ఇవ్వబడిన సలహాలను చర్చలో చేర్చండి. సంఘంలోని ఇతరులనుండి వారు పొందిన ప్రేమపూర్వక సహాయం విషయంలో తమ మెప్పుదలను వ్యక్తపర్చమని కొంతమందిని ఆహ్వానించండి.
పాట 53 (8), ముగింపు ప్రార్థన.
జూన్ 21తో ప్రారంభమయ్యే వారం
పాట 72 (22)
10 నిమి: స్థానిక ప్రకటనలు. యువత అడుగు ప్రశ్నలు (ఆంగ్లం) లేక యౌవనం (ఆంగ్లం) పుస్తక ప్రతులు సంఘమందు స్టాకులో ఉన్నట్లయితే, పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్నాయి కాబట్టి వాటిని ప్రభావవంతంగా పరిచర్యలో ఎలా ఉపయోగించాలో చూపించండి.
17 నిమి: వీడియో కేసెట్లను, డ్రామా ఆడియో కేసెట్లను బాగా ఉపయోగించండి. సంస్థ ద్వారా అందించబడిన 7 వీడియో క్యాసెట్లూ, 9 డ్రామా ఆడియో కేసెట్లూ బాగా ఉపయోగించబడుతున్నాయా? వాటిలో ప్రతి ఒక్కదాన్ని మీరూ, మీ కుటుంబ సభ్యులూ చూశారా, విన్నారా? వాటి పేర్లను పునఃసమీక్షించి, అవి ఎలా మన బైబిలు పఠనాన్ని మెరుగుపర్చుకునేలా చేసి, మన ఆధ్యాత్మికతను బలపరుస్తాయో, ఎలా సత్యాన్ని గూర్చి ఒక చక్కని సాక్ష్యాన్ని ఇస్తాయో సూచించండి. రెండు లేక మూడు ఆడియో కేసెట్లలో నుండి కొంత భాగాన్ని ప్లే చేయండి. సొంత కుటుంబాన్ని ప్రోత్సహించడంలోగానీ లేక క్రొత్త వారిని సంస్థలోనికి నడిపించడంలోగానీ తాము ప్రత్యేకంగా ప్రభావవంతంగా ఉన్నాయని కనుగొన్న వీడియో లేక ఆడియో డ్రామా క్యాసెట్లను గురించి వ్యాఖ్యానించమని ప్రేక్షకులను అడగండి. మంచి ఫలితాలు చూపిన కొన్ని అనుభవాలను జోడించండి. [1999 వార్షిక పుస్తకం (ఆంగ్లం), 51-2 పేజీలు చూడండి.] వీడియో క్యాసెట్లనూ, ఆడియో డ్రామా క్యాసెట్లనూ బాగా ఉపయోగించమని అందరినీ ప్రోత్సహించండి.
18 నిమి: “మీరు బాహ్యరూపాన్ని మాత్రమే చూస్తారా?” ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. మనం కలుసుకునే ప్రజలపై తొందరపాటుతో ఒక అభిప్రాయాన్ని మనం ఎందుకు పెంపొందించుకోకూడదనడానికి గల కారణాలను నొక్కి చెప్పండి. నీనెవె ప్రజలను అయోగ్యులైనవారిగా దృష్టించి తప్పుగా తీర్పుతీర్చిన యోనాకు యెహోవా నేర్పించిన పాఠాన్ని క్లుప్తంగా పునఃసమీక్షించండి. (కావలికోట ఆగస్టు 15, 1997 21-22 పేజీలు, 17-19 పేరాలను చూడండి.) సేవా ప్రాంతంలో తాము కలుసుకున్న రకరకాల ప్రజల పట్ల ప్రచారకులు ఎలా ఒక అనుకూలమైన దృక్పథాన్ని కాపాడుకుంటూ, తీర్పును యెహోవా చేతులకు అప్పగించారో చెబుతూ ఆ ప్రజలను గురించి వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.
పాట 77 (9), ముగింపు ప్రార్థన.
జూన్ 28తో ప్రారంభమయ్యే వారం
పాట 85 (11)
12 నిమి: స్థానిక ప్రకటనలు. జూన్ కొరకైన ప్రాంతీయ సేవా రిపోర్ట్‌లను ఇవ్వమని అందరికీ గుర్తుచేయండి. జూలై సాహిత్య ప్రతిపాదనలను పునఃసమీక్షించండి. స్థానికంగా లభ్యమౌతున్న బ్రోషూర్‌లను చూపించి, మనం మన అందింపుల్లో ఉన్నతపర్చే ఒకటి రెండు మాట్లాడే అంశాలను సూచించండి. బాగా సిద్ధపడిన ఒక ప్రదర్శనను చేర్చండి.
13 నిమి: తన ప్రజలు హింసించబడేలా యెహోవా ఎందుకు అనుమతిస్తున్నాడు? యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు (ఆంగ్లం) 676-7 పేజీల ఆధారంగా పెద్ద ఇచ్చే ప్రసంగం. యేసు ముందే చెప్పినట్లుగా, మనం ‘అందరిచేత ద్వేషించబడు’తున్నాము. (మత్త. 24:9) మనం పరిచర్యలో భాగంవహిస్తున్నప్పుడు, లౌకిక బంధువులతో సహవసిస్తున్నప్పుడు లేక పాఠశాలలోగానీ లేక ఉద్యోగ స్థలాల్లోగానీ సాక్షులు కాని వారితో వ్యవహరిస్తున్నప్పుడు బహుశా మనం వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు. యెహోవా ఎందుకు అలాంటి హింసను లేక వ్యతిరేకతను అనుమతిస్తున్నాడన్న విషయాన్నీ, మన సహనం ఎలా చివరికి ఆశీర్వాదాలు పొందేందుకు నడిపిస్తుందన్న విషయాన్నీ అనుకూలమైన రీతిలో ప్రసంగీకుడు వివరిస్తాడు.
20 నిమి: ప్రజలున్న చోటికి వెళ్ళండి! 1997 వార్షికపుస్తకము (ఆంగ్లం) 42-8 పేజీలపై ఆధారపడిన ప్రసంగం. ఇంటింట సాక్ష్యమివ్వడంలో క్రమంగా భాగం వహిస్తూ ఉన్నప్పటికీ, మనం ఏ సమయమైనా, ఎక్కడైనా సరే, అనియత సాక్ష్యం ఇచ్చేందుకు ఆతురతతో ఎదురుచూస్తుంటాము. బస్‌లో ప్రయాణిస్తుండగా, వీధుల్లో, బీచ్‌లో నడుస్తుండగా, పార్క్ చేసివున్న కార్లను సమీపిస్తున్నప్పుడు, ట్రక్కులు ఆగివుండే స్థలందగ్గరకు వెళ్తున్నప్పుడు, టెలిఫోన్‌ను ఉపయోగిస్తూ, ఉత్తరాలు వ్రాయడం ద్వారా అనియత సాక్ష్యమివ్వడంలో ఇతరులు ఎలా సఫలీకృతులయ్యారో చూపిస్తూ, వార్షిక పుస్తకము (ఆంగ్లం) నుండి అనుభవాలను తెలియజేయండి. సమయమనుమతిస్తే, వారి స్వంత అనుభవాలను తెలియజేయమని ప్రేక్షకులను ఆహ్వానించండి. ప్రజలు ఎక్కడుంటే అక్కడ సాక్ష్యమిచ్చేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోమని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించండి.
పాట 75 (6), ముగింపు ప్రార్థన.