సంఘకూటాల్లో—పూర్తి భాగం వహించేందుకు కుటుంబసభ్యులు ఎలా సహకరిస్తారంటే
1 సంఘకూటాల్లో కూడుకొనవలెనన్న ఆజ్ఞను క్రైస్తవ కుటుంబాలు లక్ష్యపెట్టాలి. (హెబ్రీ. 10:24, 25) చక్కని సహకారముంటే, కూటాలకు సిద్ధపడడంలో, వాటికి హాజరవ్వడంలో, పాల్గొనడంలో అందరూ సఫలీకృతులవ్వగలరు. కుటుంబ కుటుంబానికీ పరిస్థితులు వేర్వేరుగా ఉన్నా, కుటుంబంలో పిల్లలు ఎంతమంది ఉన్నా, ఏ వయస్సులో ఉన్నా సరే ఆధ్యాత్మిక విషయాలలో కుటుంబమంతా పాల్గొనేలా తోడ్పడడానికి ఒక క్రైస్తవ భర్త, విశ్వాసియైన భార్య, లేక ఒంటరి తల్లి/తండ్రి చేయగల్గేవి కొన్ని ఉన్నాయి.—సామె. 1:8.
2 సిద్ధపడేందుకు సమయాన్ని తీసుకోండి: కుటుంబంలోని సభ్యులంతా సంఘకూటాలకు తగినరీతిలో సిద్ధపడ్డారో లేదో అని పర్యవేక్షించడానికి కుటుంబసభ్యులు సహకరిస్తారు. అనేకమంది, వారపు కావలికోట పఠన శీర్షికను కుటుంబ సమేతంగా పరిశీలిస్తారు. కొంతమంది కుటుంబ సమేతంగా సంఘపుస్తక పఠనం కోసం సిద్ధపడతారు, లేక వారపు బైబిలు పఠనం చేస్తారు. కూటానికి హాజరవ్వడానికి ముందు ముఖ్య విషయాలను మనసులో ఉంచుకోవాలన్నదే దాని ఉద్దేశం. ఆ విధంగా, విన్నదాన్నుండి అందరూ అధికంగా ప్రయోజనం పొందగలరు, అవకాశం వచ్చినప్పుడు భాగం వహించడానికి సంసిద్ధంగా ఉంటారు.—1 తిమో. 4:15.
3 భాగం వహించేందుకు పథకం వేసుకోవడం: కుటుంబంలోని ప్రతి సభ్యుడూ కూటాల్లో వ్యాఖ్యానించడం ద్వారా ఇతరుల ఎదుట తన నిరీక్షణను ప్రకటించే లక్ష్యాన్ని కల్గివుండాలి. (హెబ్రీ. 10:23) అలా చేయడానికి, కుటుంబ సభ్యుల్లో ఒకరికి సహాయంగానీ లేక ప్రోత్సాహంగానీ అవసరమా? దైవ పరిపాలనా పరిచర్య పాఠశాలలో అసైన్చేయబడిన ప్రసంగాల్ని సిద్ధపడేందుకు కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరికీ ఎలాంటి సహాయం అవసరమౌతుంది? తమ భర్తలు చొరవ చూపించి, తామివ్వబోయే ప్రసంగానికి తగ్గ ఒక దృష్టాంతాన్ని లేక ఆచరణాత్మకమైన సన్నివేశాన్ని ఎంపికచేసుకోవడంలో ఒక చక్కని ఐడియా ఇస్తే, దాన్ని భార్యలు మెచ్చుకుంటారు. తమ పిల్లల ప్రసంగాల్ని తామే సిద్ధం చేయాలని తల్లిదండ్రులు అనుకోకూడదు. అలా చేయడం, పిల్లల్లో ఉన్న చొరవ తీసుకునే శక్తిని అణచివేస్తుంది. కానీ తల్లిదండ్రులు తమ పిల్లలకు సహాయపడగలరు, వాళ్లు బిగ్గరగా రిహార్సుచేసుకుంటుండగా వినవచ్చు.—ఎఫె. 6:4.
4 హాజరవ్వడానికి సంస్థీకరించుకోవడం: కూటాలకు ఇంట్లోనుండి బయలుదేరడానికి ఫలానా టైమ్కల్లా డ్రస్సువేసుకొని రడీగా ఉండాలని పిల్లలకు చిన్నప్పటినుండీ బోధించాలి. కూటాలకు వెళ్లడానికి ఆలస్యంకాకుండా ఉండేలా ఇంటిపనుల్లో కుటుంబ సభ్యులు సహకరించాలి.—సలహాల కోసం కుటుంబ సంతోషం 112వ పేజీ, యువత అడిగే ప్రశ్నలు (ఆంగ్లం) 316-17 పేజీలు చూడండి.
5 “నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము” అని చెప్పిన ప్రాచీన కాలంనాటి యెహోషువ మాటలను తల్లిదండ్రులూ, పిల్లలూ ధ్యానించాలి. అప్పుడు, సంఘకూటాల్లో పూర్తి భాగం వహించేలా సహకరించాలని తీర్మానించుకోండి.—యెహో. 24:15.