పైవిచారణకర్తలు నేతృత్వం వహిస్తారు—సేవా పైవిచారణకర్త
1 సేవా పైవిచారణకర్త సంఘానికి నియమించబడిన మొత్తం టెరిటరీలో జరిగే సువార్త ప్రకటనా పని అభివృద్ధికి సంబంధించిన ప్రతి విషయంలో పూర్తిగా ఆసక్తి కలిగివుంటాడు. ఆ విధంగా, సువార్తను ప్రకటించాలనే మన బాధ్యతను నిర్వర్తించడంలో మనకు సహాయపడడంలో ఆయన ఒక కీలకమైన పాత్రను వహిస్తాడు. ఒక ఉత్సాహవంతమైన సువార్తికునిగా ఆయన అన్ని సేవాసంబంధిత విషయాలనూ సంస్థీకరించడంలో నేతృత్వం వహిస్తాడు. సమర్థుడైన బోధకునిగా ఆయన ప్రతి ప్రచారకుడూ తన తన పరిచర్యలో ప్రతిభను మెరుగుపర్చుకోవడంలో సహాయం చేస్తాడు.—ఎఫె. 4:11, 12.
2 లిటరేచర్, మ్యాగజైన్స్, టెరిటరీలను హ్యాండిల్ చేయడానికి నియమించబడిన పరిచర్య సేవకుల పనులపై ఈ పెద్ద తానుగా అధ్యక్షత వహిస్తాడు. సరిపడినంతగా లిటరేచర్, మ్యాగజైన్లు, సర్వీస్ ఫారాలు మన ఉపయోగార్థం ప్రతినెలా సరిపడినంతగా ఉన్నాయో లేదో అని రూఢిపర్చుకునే బాధ్యత ఆయనదే. సంవత్సరానికి ఒక్కసారి ఆయన, మనల్ని సందర్శించవద్దని చెప్పిన వారందరి అడ్రస్ల కోసం టెరిటరీ ఫైలును పరీక్షించి, ఆ ఇండ్లను దర్శించడానికి అర్హులైన సహోదరులను నియమిస్తాడు.
3 సేవా పైవిచారణకర్తకు వ్యాపారస్థలాల్లో సాక్ష్యం ఇవ్వడం, వీధిసాక్ష్యం, టెలిఫోన్ సాక్ష్యం వంటివాటితో సహా ప్రకటనా పనిలోని వివిధ రంగాలను పర్యవేక్షించే బాధ్యత ఉంది. సెలవుదినాలతోపాటు వారంలోని అన్ని దినాల్లోనూ క్షేత్ర సేవ జరిగేందుకు ఆచరణయోగ్యమైన ఏర్పాట్లను చేయడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. బైబిలు పఠన కార్యకలాపాల్లో నిజమైన ఆసక్తిని కనబరుస్తాడు. పరిచర్యలో ఇర్రెగ్యులర్ అయిన లేదా ఇనాక్టివ్ అయిన వారికి ఆధ్యాత్మిక సహాయం చేయడానికి ఆయన మార్గాలను వెదుకుతూ ఉంటాడు. ఆయన పయినీర్లు చేసే పని గురించి పూర్తి శ్రద్ధను కలిగివుంటాడు, అంతేగాక పయినీర్లు ఇతరులకు సహాయపడతారు అనే కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షిస్తాడు.
4 సంఘ సేవా కమిటీలో ఒక సభ్యునిగా, సేవా పైవిచారణకర్త సంఘ పుస్తక పఠన గ్రూపులలో ఏమైనా అవసరమైన సర్దుబాట్లను సూచిస్తాడు. ఆయన మీ గ్రూపును సందర్శించినప్పుడు మీరు అక్కడ ఉండి ఆయనతోపాటు క్షేత్ర సేవలో పాల్గొనండి.
5 సేవా పైవిచారణకర్త ఇచ్చే నిర్దేశకాలకు సంఘంలోని వారందరూ ఇష్టపూర్వకమైన సహకారాన్ని ఇవ్వాలి. ఇది, మనం శిష్యుల్ని చేసే పనిలో మరింత ప్రభావవంతంగా ఉండేందుకూ, మన పరిచర్యలో మరింత ఆనందాన్ని అనుభవించేందుకూ సహాయపడుతుంది.