ఒక సలహా
సెప్టెంబరు నెలలో జ్ఞానము పుస్తకాన్ని అందిస్తున్నాం, దీనితో ఆ పుస్తకాన్ని మనం ఏడవసారి అందిస్తున్నట్టౌతుంది. ఈ ప్రభావవంతమైన బైబిలు పఠన సహాయక పుస్తకంపై అవధానాన్ని నిలిపేంచేందుకు మనకు మంచి కారణాలు ఉన్నప్పటికీ, జ్ఞానము పుస్తకంలో సంక్షిప్తంగా చర్చించబడిన అనేక విషయాంశాలపై వివరణాత్మకమైన సమాచారాన్ని సొసైటీ ప్రచురించిన ఇతర ప్రచురణల్లో ఉన్నాయనే విషయాన్ని మనస్సులో ఉంచుకోండి. మీ సంఘంలో లభ్యమౌతున్న అన్ని ప్రచురణలతో బాగా పరిచయం కల్గివుండి, వాటిని బైబిలు విద్యార్థులకూ, ఒకానొక విషయాంశంపై ఆసక్తిని చూపించే ఇతరులకూ సిఫారసు చేయడానికి సిద్ధంగా ఉండడం ద్వారా మీ పరిచర్యను మెరుగుపర్చుకోవచ్చు.