ప్రకటనలు
◼ సెప్టెంబరు నెల కోసం సాహిత్య ప్రతిపాదనలు: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. ప్రత్యామ్నాయంగా, సృష్టి పుస్తకాన్నిగానీ లేదా నిరంతర జీవితము పుస్తకాన్నిగానీ ప్రతిపాదించవచ్చు. అక్టోబరు: కావలికోట, తేజరిల్లు! కోసం చందాలు. చందా కట్టనట్లైతే, కావలికోట, తేజరిల్లు! విడిప్రతుల్ని ప్రతిపాదించవచ్చు. నవంబరు: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. డిసెంబరు: నూతన లోక అనువాదముతో పాటుగా నిత్యజీవానికి నడిపించే జ్ఞానము.
◼ సంఘ పైవిచారణకర్త లేక ఆయనచే నియమించబడిన వేరొకరు, సంఘ లెక్కలను సెప్టెంబరు 1న లేక ఆ తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆడిట్ చేయాలి. ఆడిట్ అయిన తర్వాత సంఘానికి ప్రకటించండి.
◼ బహిష్కరించబడి లేదా సహవాసాన్ని మానుకొన్న వాళ్లలో ఎవరైనా సరే, తిరిగి రావడానికి ఇష్టపడుతుంటే అటువంటి వారిని గూర్చి ఏప్రిల్ 15, 1991 కావలికోట (ఆంగ్లం) 21-3 పేజీల్లో ఇవ్వబడిన ఉపదేశాలను పరిశీలించాలని పెద్దలకు గుర్తు చేయబడుతుంది.
◼ సంఘంతో సహవసించే వారు కావలికోట, తేజరిల్లు! పత్రికలకు తమ వ్యక్తిగత చందాలతో సహా కొత్త చందాలనూ, రిన్యూవల్ పత్రిక చందాలనూ సంఘం ద్వారానే పంపించాలి.
◼ సాహిత్యాల్ని పంపించమని ప్రచారకులు వ్యక్తిగతంగా చేసుకొన్న రిక్వెస్ట్‌లను సంస్థ స్వీకరించదు. సాహిత్యాల కోసం సంఘంచేసే నెలసరి రిక్వెస్ట్‌లను సొసైటీకి పంపించడానికి ముందు ప్రతి నెలా దాన్ని గురించి సంఘంలో ప్రకటన చేసేలా సంఘ పైవిచారణకర్త ఏర్పాటు చేయాలి. ఆ విధంగా, వ్యక్తిగతంగా కావాల్సిన సాహిత్యాల్ని రప్పించుకోవాలని ఇష్టపడుతున్న వారందరూ సాహిత్యాల్ని పర్యవేక్షిస్తున్న సహోదరునికి తెలియజేయవచ్చు. సాహిత్యాల్లో ఏవి స్పెషల్ రిక్వెస్ట్ సాహిత్యాలో దయచేసి గుర్తుంచుకోండి.
◼ ఈ సంవత్సరం తమిళనాడులో మరో రెండు జిల్లాసమావేశాలు ఏర్పాటైనాయి. ఆ సమావేశాలు జరిగే స్థలాలూ, తారీఖులూ, అలాగే ప్రధాన కార్యాలయాలూ ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
కోయంబత్తూర్: నవంబరు 27-29 —D. P. Chellapa, 105, Sanganoor Main Road, Ganapathy, Coimbatore, TN - 641 006
మధురై: డిసెంబరు 25-27 —K. P. Samuel, 123, Lake View Garden, 1st Street, K.K. Nagar, Madurai, TN - 625 020
◼ చెన్నై (తమిళం) జిల్లా సమావేశం జరగబోయే తారీఖులు అక్టోబరు 9-11, 1998కి మార్చబడ్డాయి.
◼ ప్రతీ సంఘంలోనూ ఉన్న సెక్రటరీ జిల్లాసమావేశానికి సంబంధించిన విషయాల్ని పర్యవేక్షిస్తాడు.
◼ లభ్యమౌతున్న క్రొత్త ప్రచురణ:
మీ మాట్లాడే సామర్థ్యాన్నీ, బోధనా సామర్థ్యాన్నీ మెరుగు పర్చుకునే విధానము (పాఠశాల నిర్దేశక పుస్తకములో [ఆంగ్లం] నుండి 20-38 అధ్యాయాలు)—హిందీ