కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/98 పేజీ 1
  • మీకు “శరీరములో ఒక ముల్లు” ఉందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీకు “శరీరములో ఒక ముల్లు” ఉందా?
  • మన రాజ్య పరిచర్య—1998
  • ఇలాంటి మరితర సమాచారం
  • “శరీరములో ఒక ముల్లు”వంటి సమస్యను అధిగమించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • మానవ బలహీనత యెహోవా శక్తిని ఘనపరుస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • పౌలు ‘శరీరంలో ముల్లు’
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • 2 కొరింథీయులు 12:9—“నా కృప నీకు చాలును”
    బైబిలు వచనాల వివరణ
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1998
km 5/98 పేజీ 1

మీకు “శరీరములో ఒక ముల్లు” ఉందా?

1 సువార్తను ప్రకటించే మన నియామకాన్ని మన శక్తిమేరకు నెరవేర్చాలని మనం ఎంతగానో కోరుకుంటాం. అయితే, మన ప్రియ సహోదర సహోదరీల్లో అనేకమంది సువార్తను ప్రకటించడంలో వాళ్లనుకొన్నంతమేరకు భాగం వహించలేకపోయేలా దీర్ఘకాలిక రుగ్మతలూ లేక అశక్తతలూ అడ్డుబండగా తయారైనందున, పూర్తిగా భాగం వహించడం కష్టంగా ఉంటుంది. నిరుత్సాహ భావాల్ని తాళుకోవడమనేది, విశేషంగా తమ చుట్టూవున్న ఇతరులు పరిచర్యలో ఎంతో చురుగ్గా ఉండడాన్ని చూసినప్పుడు కలిగే నిరుత్సాహ భావాల్ని తాళుకోవడమనేది వారికి ఒక సవాలుగా ఉండొచ్చు.—1 కొరిం. 9:16.

2 అనుకరించేందుకొక మాదిరి: అపొస్తలుడైన పౌలు “శరీరములో ఒక ముల్లు”తో పోరాడాల్సి వచ్చింది. తనను నలగగొడుతున్న “సాతానుయొక్క దూతగా” ఆయన వర్ణించిన కలతపర్చే ఆ ఆటంకాన్ని తొలగించమని ముమ్మారు ఆయన యెహోవాను వేడుకొన్నాడు. ఆ ఆటంకం ఉన్నప్పటికీ, పౌలు సహించుకొని, తన పరిచర్యలో ముందుకు సాగిపోయాడు. ఆయన తనపై తానే జాలి పడిపోలేదు, లేక అదే పనిగా ఫిర్యాదు చేసేవానిగా తయారు కాలేదు. తాను చేయగల్గినంత తాను చేశాడు. తాళుకోవడంలో ఆయన సఫలీకృతుడవ్వడానికి గల కీలకం, దేవుని నుండి వచ్చిన ఈ అభయమే: “నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్న[ది].” తానున్న స్థితి ఇక మారదని గ్రహించినప్పుడూ, సహించుకోవడం విషయంలో యెహోవాపైనా, పరిశుద్ధాత్మపైనా ఆధారపడడం నేర్చుకున్నప్పుడూ పౌలు బలహీనతే ఆయనకు బలమయ్యింది.—2 కొరిం. 12:7-10.

3 మీరెలా సహించవచ్చు: దేవునికి మీరు చేసే సేవపై మానవ బలహీనత పరిమితుల్ని విధిస్తుందా? అలా అయితే, పౌలు దృక్కోణాన్ని అనుకరించండి. ఈ విధానంలో మీ అనారోగ్యానికిగానీ లేక మీకున్న అశక్తతకిగానీ శాశ్వతమైన నివారణ లేకపోయినప్పటికీ, మీ అవసరాల్ని అర్థంచేసుకొని, ‘అసాధారణమైన శక్తినిచ్చే’ యెహోవాయందు మీరు పూర్తి నమ్మకాన్ని ఉంచవచ్చు. (2 కొరిం. 4:7, NW) సంఘంలో మీకు లభ్యమయ్యే సహాయాన్నుండి ప్రయోజనాన్ని పొందండి, మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకొని ఒంటరిగా ఉండకండి. (సామె. 18:1) ఇంటింటి పనిలో భాగం వహించడం కష్టంగా ఉన్నట్టు మీకనిపిస్తే, అనియత సాక్ష్యాన్నిగానీ లేక టెలిఫోన్‌ సాక్ష్యాన్నిగానీ ఇవ్వడానికి ఉన్న ఆచరణాత్మక మార్గాల్ని అన్వేషించండి.

4 పరిచర్యలో మీరు చేయగల్గేదాన్ని శరీరంలో ఉన్న ముల్లు బహుశా అదుపుచేసినా, పరిచర్యలో మీకు భాగం లేదన్నట్టుగా మీరు భావించనక్కర్లేదు. పౌలువలే, మీరూ మీ శక్తిమేరకు, మీ పరిస్థితులు అనుమతించినంత మేరకు చేస్తూ “దేవుని కృపాసువార్తనుగూర్చి సాక్ష్యమి”వ్వవచ్చు. (అపొ. 20:24) మీ పరిచర్యను నెరవేర్చడానికి మీరు కృషిచేస్తుండగా, యెహోవా ఎంతో సంతోషిస్తాడని గ్రహించండి.—హెబ్రీ. 6:10.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి