మేలోని సేవా కూటాలు
మే 4తో ప్రారంభమయ్యే వారం
పాట 10 (21)
8 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.
15 నిమి: “యెహోవా ఆత్మ మనకు తోడుగా ఉన్నది.” ప్రశ్నాజవాబులు. 3వ పేరాను కవర్ చేస్తున్నప్పుడు, 1998 వార్షిక పుస్తకములో నుండి సముచితమైన ఉదాహరిత భాగాల్ని చేర్చండి.
22 నిమి: “ప్రజల ప్రత్యేక ఆసక్తులను ఆకట్టుకొనే శీర్షికల్ని ఎంపికచేసుకోండి.” శీర్షికలోని ప్రధానాంశాల్ని పునఃసమీక్షించండి. ఇంకా మంచి స్థితిలోనే ఉన్న పాత సంచికలను కూడా ఈ విధంగా అందించవచ్చని వివరించండి. సత్ఫలితాలతో ఏ శీర్షికల్ని వాళ్లు ఉన్నతపర్చారో తెలియజేయమని ప్రచారకుల్ని ఆహ్వానించండి. 7వ పేరాలో ఉన్న అందింపును ప్రదర్శించండి.
పాట 212 (26), ముగింపు ప్రార్థన.
మే 11తో ప్రారంభమయ్యే వారం
పాట 197 (6)
8 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు.
12 నిమి: “వేసవికాలం కొరకు మీ పథకాలు ఏమిటి?” వేసవికాల నెలల కొరకైన వారి పథకాల్ని గురించి ఇద్దరు ముగ్గురు ప్రచారకులతో ఒక పెద్ద చర్చిస్తాడు. వాళ్లు తమ ప్రాంతీయ సేవా పనిని విస్తృత పర్చుకొనేందుకూ, సెలవుల విషయంలో, స్నేహితుల్నీ బంధువుల్నీ చూడడానికి వెళ్లడం విషయంలో, సంవత్సరంలో అటు తర్వాత రానైవున్న జిల్లా సమావేశానికి హాజరవ్వడం విషయంలో గల ఏర్పాట్లను పునఃసమీక్షిస్తారు. తమ వ్యక్తిగత పఠనాన్నీ, కూటాల్నీ, లేక ప్రాంతీయ సేవనూ అలక్ష్యం చేయకూడదని అందరూ ఏకీభవించి, వాళ్లు ఒక మంచి దైవపరిపాలనా దినచర్యను కల్గివుండేందుకు ఎలా ప్రణాళిక వేసుకుంటారో వివరిస్తారు.
25 నిమి: “కావలెను—మరిన్ని బైబిలు పఠనాలు.” సేవా పైవిచారణకర్త ఇచ్చే ప్రసంగం. ప్రేక్షకులతో చర్చ. స్థానికంగా నిర్వహించబడుతున్న బైబిలు పఠనాల పనిని పునఃసమీక్షించండి. పఠనాల్ని నిర్వహించే విధానంలో ఎక్కడెక్కడైతే సంఘం బాగా పనిచేసిందో ఆ విషయమై సంఘాన్ని మెచ్చుకోండి. కుటుంబ పఠనాలతో సహా బైబిలు పఠనాల్ని ప్రారంభించి, నిర్వహిస్తూ ఉండడం విషయంలో ఇంకా ఏమి చేయవచ్చో సూచించండి. కుటుంబ పఠనాన్ని క్రమంగా నిర్వహించే ఒక తండ్రిని/తల్లిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా 5వ పేరాను ఉదహరించండి. 8వ పేరాను చదివి, ఇవ్వబడిన ఎనిమిది అంశాల్ని నొక్కి చెప్పండి. అనవసరమైన జాప్యంలేకుండా సమాచారాన్ని చర్చించడం ఎలా సాధ్యమౌతుందో తెలియజేయడానికి, పఠనాల్ని నిర్వహించడంలో సమర్థుడైన ఒక ప్రచారకుడ్ని ఆహ్వానించడం ద్వారా 13వ పేరాను వివరించండి. స్థానికంగా సత్ఫలితాలు ఎలా సాధించబడ్డాయో చూపించే తగిన అనుభవాన్ని చేర్చండి.
పాట 48 (22), ముగింపు ప్రార్థన.
మే 18తో ప్రారంభమయ్యే వారం
పాట 141 (17)
8 నిమి: స్థానిక ప్రకటనలు.
22 నిమి: “మీకు ‘శరీరములో ఒక ముల్లు’ ఉందా?” ప్రశ్నాజవాబులు. కావలికోట (ఆంగ్లం) నవంబరు 15, 1987 నందలి 29వ పేజీలో ఉన్న “పాఠకుల ప్రశ్న[ల]”పై ఆధారపడిన వ్యాఖ్యానం.
15 నిమి: ప్రశ్నాభాగం. మొదటి ప్రశ్నకు జవాబును స్థానికంగా అన్వయించండి. ఫలానా టెరిటరీలు సులభంగా నొప్పించబడే ప్రజలతో కూడుకొన్నవని రుజువైతే వివేచనా యుక్తిల కొరకైన అవసరతను చర్చించండి. రెండవ ప్రశ్నను చర్చించేటప్పుడు, విషాదకరమైన సంఘటనల్ని ఎదుర్కొంటున్న ప్రపంచవ్యాప్త సహోదరత్వమందున్న వారి ఎడల శ్రద్ధను ప్రోత్సహించేందుకు సొసైటీ ప్రచురణలలో నుండి అనుభవాల్ని ఉపయోగించండి.
పాట 139 (16), ముగింపు ప్రార్థన.
మే 25తో ప్రారంభమయ్యే వారం
పాట 137 (11)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: స్థానిక అవసరతలు.
20 నిమి: సంఘ కూటాల్ని నేనెందుకు విలువైనవిగా ఎంచుతాను. సంఘకూటాలకు క్రమంగా హాజరయ్యే విభిన్న వయస్సులకు చెందిన వారికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తుల గుంపుతో అంటే, బహుశా వివాహిత దంపతులూ, ఓ వృద్ధు(డు)రాలూ, టీనేజరూ చేరివున్న గుంపుతో పెద్ద చర్చను నిర్వహిస్తాడు. వాళ్లు ఎందుకు ఎల్లప్పుడూ హాజరౌతారనే విషయంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు: అనుదిన సమస్యల్ని తాళుకొనేలా, ఆధ్యాత్మికంగా బలంగా ఉంచేలా తమకు సహాయపడుతున్న మంచి సహవాసమూ, దైవిక ఉపదేశమూ, మంచి సలహా. కూటాలకు క్రమంగా హాజరవ్వడం మూలంగా మనమంతా ఎలా ఆశీర్వదించబడ్డామో వ్యాఖ్యానాలు నొక్కి చెబుతాయి.
పాట 222 (29), ముగింపు ప్రార్థన.