కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/98 పేజీ 1
  • యెహోవా ఆత్మ మనకు తోడుగా ఉన్నది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా ఆత్మ మనకు తోడుగా ఉన్నది
  • మన రాజ్య పరిచర్య—1998
  • ఇలాంటి మరితర సమాచారం
  • మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు, నేటి క్రైస్తవులకు పరిశుద్ధాత్మ నడిపింపు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • ఆత్మానుసారంగా నడుచుకుంటూ మీ సమర్పణకు తగ్గట్టు జీవించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • దేవుని ఆత్మ ఈనాడు ఎలా పనిచేస్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • మనకు పరిశుద్ధాత్మ నడిపింపు ఎందుకు అవసరం?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1998
km 5/98 పేజీ 1

యెహోవా ఆత్మ మనకు తోడుగా ఉన్నది

1 యెహోవాసాక్షులముగా, మన ముందు చేయాల్సిన పని ఎంతో ఉంది. యేసు ఇలా అన్నాడు: “సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను.” (మార్కు 13:10) మానవ దృక్కోణం నుండి చూస్తే, అది అసాధ్యంగా కన్పించినా, సుసాధ్యమైనదే. విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన శక్తి అంటే దేవుని ఆత్మ మనకు తోడుగా ఉంది.—మత్త. 19:26.

2 మొదటి శతాబ్దపు రుజువు: యిషయా ప్రవచనాన్ని తనకు అన్వయించుకొంటూ, యేసు ఇలా అన్నాడు: ‘సువార్త ప్రకటించుటకై . . . యెహోవా ఆత్మ నామీద ఉన్నది.’ (లూకా 4:17, 18, NW) తన అపొస్తలులు “భూదిగంతముల వరకు” సాక్ష్యమిచ్చేలా వారిని కూడా పరిశుద్ధాత్మ అలాగే శక్తిమంతుల్ని చేస్తుందని ఆయన పరలోకానికి ఆరోహణంకాక మునుపు వారికి చెప్పాడు. అటు తర్వాత, ఐతియోపీయుడైన న్యాయస్థాన అధికారికి ప్రకటించేందుకు ఫిలిప్పును పరిశుద్ధాత్మ నడిపించింది. రోమా పటాలం అధిపతి దగ్గరకు పేతుర్ని ఆత్మ పంపించింది. అది అన్యజనాంగాలకు ప్రకటించేందుకు పౌలు బర్నబాలను పంపించింది. ఇలాంటి పూర్వ చరిత్రలుగల ప్రజలు సత్యానికి ప్రతిస్పందిస్తారని ఎవరు మాత్రం తలంచి ఉంటారు? కానీ వాళ్లు ప్రతిస్పందించారు.—అపొ. 1:8; 8:29-38; 10:19, 20, 44-48; 13:2-4, 46-48.

3 ఆధునికకాల రుజువు: “ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; . . . ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము” అని చెప్పడం ద్వారా నేటి ప్రకటనా పనిలో పరిశుద్ధాత్మ చేరివుండడాన్ని గురించి ప్రకటన గ్రంథం నొక్కి చెబుతోంది. (ప్రక. 22:17) సర్వమానవాళికీ సువార్తను ప్రకటించేందుకు క్రీస్తు పెండ్లికుమార్తె తరగతినీ, వారి సహవాసులైన ‘వేరే గొఱ్ఱెల్నీ’ ఆత్మ ప్రేరేపించింది. (యోహా. 10:16) అన్ని రకాల నేపథ్యాలకూ చెందిన ప్రజల్ని సమీపించడానికి ఎన్నడూ వెనుకాడకుండా, దేవుని ఆత్మ మనకు సహాయపడుతుందని ఎల్లప్పుడూ కృతనిశ్చయాన్ని కల్గివుంటూ, మన ప్రకటనాపనిలో మనం ధైర్యంగా ఉండాలి. దేవుని ఆత్మ ఆయన సేవకులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని ఒప్పింపచేసే రుజువును 1998 వార్షిక పుస్తకం ఇస్తోంది. ప్రతిస్పందనను చూడండి! గత రెండు సేవా సంవత్సరాల కాలంలో, ప్రతీ రోజూ సగటున 1,000కన్నా ఎక్కువమంది బాప్తిస్మం తీసుకొన్నారు.

4 యెహోవా కోరుకొన్నంత మేరకు రాజ్య సందేశాన్ని మనం ప్రకటిస్తుండగా, దేవుని ఆత్మ మనకు తోడుగా నిలిచి ఉంటుందనే దృఢమైన నమ్మకాన్ని కల్గివుందాము. అత్యంత ప్రాముఖ్యమైన రాజ్యపనిలో తీవ్రంగా కృషి చేయడంలో కొనసాగేలా ఆ జ్ఞానం మనల్ని ప్రోత్సహించి, ప్రేరేపించాలి.—1 తిమో. 4:10.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి