ప్రశ్నా భాగం
◼ కూటాలు మరింత ప్రభావవంతమైనవిగా ఉండేలా చేయడానికి మనమెలా సహాయపడవచ్చు?
సంఘకూటాల్ని పెద్దలూ పరిచర్య సేవకులే నిర్వహించి, వాటిలో అనేక భాగాల్ని నిర్వహిస్తారు గనుక, వాటి సాఫల్యం విషయంలో పూర్తి బాధ్యత వారిదేనని కొంతమంది భావించడానికి మొగ్గు చూపించవచ్చు. కూటాలు ఆసక్తిదాయకంగానూ, లాభదాయకంగానూ ఉండేందుకు నిజానికి, మనమందరమూ దోహదపడవచ్చు. కూటాలు మరింత ప్రభావవంతంగా ఉండేలా చేయడానికి ఈ క్రింద ఇవ్వబడిన పది రీతుల్లో మనం సహాయపడవచ్చు:
ముందుగా సిద్ధపడండి. మనం బాగా సిద్ధపడినప్పుడు, కూటాలు మన ఆసక్తిని ఆకట్టుకుంటాయి. మనమంతా సిద్ధపడితే, కూటాలు సజీవంగానూ, మరింత క్షేమాభివృద్ధికరంగానూ ఉంటాయి. క్రమంగా హాజరవ్వండి. ఎక్కువమంది హాజరు కావడమనేది హాజరైన ప్రతి ఒక్కరికీ మరింత ప్రోత్సాహకరంగా ఉండి, హాజరవ్వడం యొక్క ప్రాముఖ్యత ఎడల ప్రశంసను బలపరుస్తుంది. సమయానికి రండి. కార్యక్రమ ప్రారంభానికి ముందే మనం వచ్చి కూర్చుంటే, ప్రారంభ పాటలోనూ, ప్రార్థనలోనూ మనం అందరితో కలవవచ్చు, మరి ఆ విధంగా కూటం నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందుతాం. పూర్తి సంసిద్ధంగా రండి. బైబిల్నీ, కూటం జరుగుతుండగా ఉపయోగించే ప్రచురణ(లనూ)నీ తీసుకు రావడం ద్వారా, చర్చించబడుతున్న దాన్ని మనం అనుసరిస్తూ, దాన్ని బాగా గ్రహించవచ్చు. ఏకాగ్రత భంగంకాకుండా చూసుకోవడం. మనం ముందు సీట్లలో కూర్చుంటే బాగా వినవచ్చు. గుసగుసలాడ్డమూ, మరుగుదొడ్లకు తరచూ వెళ్లడమూ అనేవి మనమూ, ఇతరులూ ఏకాగ్రతను కోల్పోయేలా చేయవచ్చు. పాల్గొనేవారిగా ఉండండి. మనలో అనేకులం మన చేతుల్ని ఎత్తి, వ్యాఖ్యానించినప్పుడు, విశ్వాస అభివ్యక్తీకరణల ద్వారా అనేకమంది ప్రోత్సహించబడి, బలపర్చబడ్తారు. క్లుప్తమైన వ్యాఖ్యానాల్ని చేయండి. ఇది వీలైనంతమంది పాల్గొనడానికి అవకాశాన్ని కలుగజేస్తుంది. మనం చేసే క్లుప్తమైన వ్యాఖ్యానాల్ని, పఠించబడుతున్న సమాచార పరిధిలోనే ఉంచాలి. అసైన్‌మెంట్లను నెరవేర్చండి. దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలోని విద్యార్థులుగా లేక సేవా కూటంలో భాగాల్ని నిర్వహించేవారిగా బాగా సిద్ధపడండి, ముందుగానే రిహార్సుచేసి చూసుకోండి, మీ అసైన్‌మెంట్లను నెరవేర్చడానికి కృషి చేయండి. పాల్గొన్న వారిని మెచ్చుకోండి. వారి ప్రయత్నాలు ఎంతగా మెచ్చుకోబడ్డాయో ఇతరులకు చెప్పండి. ఇది వారు భవిష్యత్తులో మరింత బాగా చేసేలా వారిని బలపర్చి, ప్రేరేపిస్తుంది. ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. కూటాలకు ముందూ, కూటాలు అయిపోయిన తర్వాతా ఒకరికొకరు అభివాదాలు చేసుకోవడమూ, క్షేమాభివృద్ధికరమైన రీతిలో సంభాషించుకోవడమూ మనం కూటాలకు హాజరవ్వడం ద్వారా పొందే ఆనందాన్నీ, ప్రయోజనాల్నీ ఇనుమడింపచేస్తాయి.