ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు ఏప్రిల్, మే: కావలికోట, తేజరిల్లు!ల కొరకు చందాలు. పక్షపత్రికలకు ఒక సంవత్సర చందా రూ. 90.00. మాస పత్రికల వార్షిక చందా, పక్షపత్రికల ఆరు నెలల చందా రూ. 45.00. మాస పత్రికలకు ఆరు నెలల చందా లేదు. చందా కట్టడానికి నిరాకరించినట్లైతే, విడిపత్రికలను ఒక్కొక్క దానినీ రూ. 4.00లకు ప్రతిపాదించాలి.
కావలికోట పత్రిక పంజాబీ, ఉర్దూ భాషల్లో (ఈ భాషల్లో ఇది మాసపత్రిక) మినహా మిగిలిన అన్ని భారతీయ భాషల్లోనూ నేపాలీ భాషలోనూ పక్షపత్రిక అనే విషయాన్ని చందాలు కట్టిస్తున్నప్పుడు దయచేసి గుర్తుంచుకోండి.
తేజరిల్లు! పత్రిక మలయాళం, తమిళ భాషల్లో పక్షపత్రిక, కానీ కన్నడ, గుజరాతీ, తెలుగు, నేపాలీ, మరాఠీ, హిందీ భాషల్లో మాసపత్రిక. పంపిణీ దారుల త్రైమాసిక తేజరిల్లు! ప్రతులు ఉర్దూ, పంజాబీ, బెంగాలీ భాషల్లో సంఘాలకు లభ్యమౌతాయి, కానీ ఈ మూడు భాషల్లోనూ విడి చందాలు స్వీకరించబడవు.
జూన్: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకాన్ని రూ. 20.00 చందాకు ప్రతిపాదించండి. (పయినీర్లకు రూ. 15.00.) ప్రత్యామ్నాయంగా, 192 పేజీల ప్రత్యేక ధర పుస్తకాల లిస్టులో లేక సగం ధర పుస్తకాల లిస్టులో ఉన్న ఏ పాత పుస్తకాన్నైనా ప్రతిపాదించవచ్చు. జూలై, ఆగస్టు: 32-పేజీల బ్రోషూర్లలో దేన్నైనా రూ. 6.00 చందాకు అందించవచ్చు.
◼ మే నెలలో ఐదు వారాంతాలు ఉన్నాయి గనుక అది అనేకులకు సహాయ పయినీరు సేవ చేయడానికి అనుకూలమైన నెలైవుంది.
◼ అందుబాటులో ఉన్న క్రొత్త ప్రచురణలు:
కృంగిన వారికి ఓదార్పు, కరపత్రం సంఖ్య 20—ఒరియా
◼ మరలా అందుబాటులో ఉన్న ప్రచురణలు:
దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?—ఉర్దూ
పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము—ఉర్దూ
వాచ్‌టవర్ బౌండ్ వాల్యూమ్, 1994—ఆంగ్లం
వాచ్‌టవర్ బౌండ్ వాల్యూమ్, 1995—ఆంగ్లం
◼ అందుబాటులో ఉన్న క్రొత్త వీడియో క్యాసెట్లు:
బైబిలు—మీ జీవితంలో దాని శక్తి(వాల్యూమ్ III)—ఆంగ్లం