పత్రికలు రాజ్యాన్ని ప్రకటిస్తున్నాయి
1 యెహోవాసాక్షులుగా, దేవుని రాజ్యాన్ని గూర్చిన మన ఆసక్తిదాయకమైన ప్రకటనాపనిని బట్టి మనం అందరికీ బాగా తెలుసు. మనం పంచిపెట్టే కావలికోట, తేజరిల్లు! పత్రికలు, దేవుని సంకల్పాల్ని గురించి తెలుసుకొనేందుకు లక్షలాదిమంది ప్రజలకు సహాయపడడంలో ఒక శక్తివంతమైన పాత్రను నిర్వహిస్తున్నాయి. వాటిలోని సందేశం నిశ్చయంగా సువార్తే, ఎందుకంటే ఆ సందేశం మానవజాతికున్న ఏకైక నిరీక్షణ దేవుని పరలోక రాజ్యమేనని ప్రకటిస్తోంది.
2 ఈ పత్రికలు ప్రజల నిజమైన అవసరాలతో అంటే భావోద్రేక, సామాజిక, ఆధ్యాత్మిక అవసరాలతో వ్యవహరిస్తున్నాయి. అన్నిచోట్లా నైతిక విలువలూ, కుటుంబ విలువలూ కుప్పకూలిపోతుండడంతో, బైబిలు సూత్రాల్ని ఎలా అన్వయించుకోవాలో ప్రజలకు చూపించడం ద్వారా, వారు తమ జీవితాల నాణ్యతను మెరుగుపర్చుకునేలా కావలికోట, తేజరిల్లు! పత్రికలు వారికి సహాయపడుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో ఈ పత్రికలకు చందాల్ని ప్రతిపాదించడం మనకు ఆనందాన్నిస్తుంది.
3 వాటికి నిజమైన ఆకర్షణ ఉంది: వలికోట, తేజరిల్లు! పత్రికలు ప్రపంచ జనాభాలో అత్యధికశాతం మాట్లాడే భాషల్లో లభ్యమౌతున్నాయి. దీన్నిబట్టే, మన పత్రికలు అందరికీ సుపరిచితమయ్యాయి. ప్రజలు వాటికి ఆకర్షితులవ్వడానికి గల కొన్ని కారణాలు ఇక్కడ ఉన్నాయి:
◼ యథార్థమైన, సత్యవంతమైన పత్రికలుగా, అవి మంచి చెడుల మధ్యనున్న వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.
◼ భూమిని తన పరిపాలన క్రిందకు తెస్తానని దేవుడు చేసిన వాగ్దానంపై ఆధారపడి, రానైవున్న నీతియుక్త పరదైసు నిరీక్షణను అవి ఇస్తున్నాయి.
◼ అన్ని నేపథ్యాలకూ, సంస్కృతులకూ చెందిన ప్రజలను ఆకట్టుకునే, సమయానుకూలమైన ఎంతో వైవిధ్యంగల విషయాంశాలు అందించబడుతున్నాయి.
◼ ఆ శీర్షికలు సంక్షిప్తమైనవీ, విద్యావంతమైనవీ, వాస్తవికమైనవీ, దురభిమానంలేనివీ, రాజీపడనివీ అయివున్నాయి.
◼ దృష్టిని ఆకర్షించే చిత్రాలు సత్వరమే ఆసక్తిని కల్గిస్తాయి, సరళమైన రచనా శైలి పత్రికలను సులభంగా చదివిస్తుంది.
4 వాటిని విస్తృతంగా పంచిపెట్టండి: పత్రికల్ని సమర్థవంతంగా పంచిపెట్టడమనేది ఎక్కువగా మన అందింపు అంశాల్ని సిద్ధపడడంలో గల ఆసక్తిపైనా, మన సమయాన్ని షెడ్యూల్ వేసుకోవడంపైనా, మన ప్రకటనా పనిని సంస్థీకరించుకోవడంపైనా ఆధారపడివుంటుంది. మన రాజ్య పరిచర్య జనవరి, అక్టోబరు 1996 సంచికల్లో అభ్యాససిద్ధమైన సలహాలు ఇవ్వబడ్డాయి. వాటిని పునఃసమీక్షించి, అన్వయించుకోవడం మంచిది.
5 పత్రికలతో పరిచయాన్ని కల్గివుండండి: ప్రతీ సంచికనూ మీరు చదువుతుండగా, ఆ ప్రతి మూలంగా ఎవరిలో ఆసక్తి రేకెత్తించగలరో వారిని గూర్చి ఆలోచించండి. మీ అందింపులో మీరు ఎత్తిచెప్పగల నిర్దిష్టమైన అంశాలకోసమో లేక లేఖనాల కోసమో చూడండి. సంభాషణను ప్రారంభించడానికీ, విషయాంశంపై ఆసక్తిని రేకెత్తించడానికీ మీరు అడుగగల ప్రశ్నను గూర్చి ఆలోచించండి.
6 వ్యక్తికి తగ్గరీతిలో అందింపును మలుచుకోండి: పురుషునికీ, స్త్రీకీ, వృద్ధునికీ లేక, యౌవనస్థునికీ అంటే వాళ్లు పరిచయస్థులైనా, అపరిచయస్థులైనా సరే, వాళ్లకు తగ్గ రీతిలో అన్వయించబడేలా మలుచుకోవడానికి వీలుండే సరళమైన అందింపును సిద్ధంచేసుకోండి.
7 కావలికోట, తేజరిల్లు! పత్రికలను అందించడానికి సంసిద్ధంగా ఉండండి: పత్రికలు బ్రీఫ్‌కేస్‌లో, హేండ్‌బేగ్‌లో లేక, కోటు జేబులో సహితం సులభంగా పట్టగలవు గనుక, మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడుగానీ లేక షాపింగ్ చేస్తున్నప్పుడుగానీ వాటిని మన దగ్గర ఉంచుకోవచ్చు. బంధువులతోనూ, ఇరుగుపొరుగు వారితోనూ సహోద్యోగులతోనూ, తోటి విద్యార్థులతోనూ లేక టీచర్లతోనూ మాట్లాడేటప్పుడు వాటిని అందించండి. ప్రతీవారం ఒక రోజును, ప్రత్యేకించి పత్రికా సాక్ష్యం కొరకు కేటాయించండి.
8 పత్రికల ఎడల మెప్పుదలను చూపించండి: అవి వాటి విలువను ఎన్నడూ కోల్పోవు. అవి కల్గివున్న సందేశపు ప్రాముఖ్యతను కాలగతి తక్కువ చేయదు. మనం తీసుకొన్న పత్రికలన్నింటినీ అందించడానికి మనం ఒక ప్రత్యేక ప్రయత్నాన్ని చేస్తే, పాత సంచికలు మన దగ్గర పేరుకుపోవు.
9 వీధి సాక్ష్యం ప్రభావవంతమైనది: ఎక్కువమంది ప్రజలకు పత్రికల్ని అందించడానికి ఇదొక శ్రేష్ఠమైన మార్గం. షాపులు తెరచి ఉండే రోజుల్లో కొంతమంది ప్రచారకులు బిజీగావున్న రోడ్లపై ఒక పద్ధతి చొప్పున అక్కడక్కడా నిల్చొని పనిచేస్తారు.
10 వ్యాపార ప్రాంతం ప్రతిఫలదాయకమైనది: షాపుషాపుకీ సాక్ష్యం ఇస్తున్నపుడు, తాళాలు-వేసివున్న-ఇళ్లు (నాట్-ఎట్-హోమ్స్) చాలా తక్కువగా తారసపడతాయి. వ్యాపారస్థుల్లో అనేకమంది మర్యాదస్థులు, మరి అనేకమంది పత్రికల్ని సంతోషంగా అంగీకరిస్తారు, చందాలు కడతారు. కలుసుకొన్న ఫలానా వ్యాపారస్థునికి ఏ శీర్షికలు తగినవో ఆ శీర్షికల్ని ఉన్నతపర్చి చూపించండి.
11 పత్రికా మార్గాలు ఫలవంతమైనవి: చందా చేయడానికి ఒక వ్యక్తి అంగీకరించకపోయినా పత్రికల విడి ప్రతుల్ని ఆసక్తితో అంగీకరిస్తే, తర్వాతి సంచికల్ని అందించేందుకు అతని దగ్గరకు మరలా వెళ్లడమనేది సముచితం. పత్రికల్ని అందించడానికి మాత్రమే కాదుగానీ బైబిలునందు ఆ వ్యక్తికున్న ఆసక్తిని పెంపొందించేందుకు కూడా మనం క్రమంగా పునర్దర్శనాల్ని చెయ్యాలి. పత్రికా మార్గాలు సంభవనీయమైన బైబిలు పఠనాలకు ఓ శ్రేష్ఠమైన మూలం.
12 ఏప్రిల్, మే నెలల్లో ఉన్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకోండి: కావలికోట, తేజరిల్లు! పత్రికలు లక్షలాదిమంది ప్రశంసాత్మక పాఠకుల విశ్వాసాన్ని చూరగొన్నాయి. రాజ్యాన్ని ప్రకటించడంలో అవి ఎంతో ప్రభావవంతమైనవి కాబట్టి, వాటిని మనం ఎక్కడికెళితే అక్కడకు మనతోపాటు తీసుకెళ్లి, ప్రతీ అవకాశమందూ వాటిని అందించాలని నిశ్చయించుకుందాం. ఏప్రిల్, మే నెలలు చందాల ప్రతిపాదన విషయంలోనూ, పత్రికలను పంచిపెట్టడం విషయంలోనూ విశిష్టమైన నెలలుగా ఉండగలవని ఆశిద్దాం!