మీ ప్రాంతాన్ని చక్కగా పూర్తిగా చేయండి
1 నివాసములున్న ప్రదేశాల్లో మనకు అప్పుడప్పుడు చిన్న కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు, చిల్లర దుకాణాలు వంటి వ్యాపార స్థలాలు తారసపడుతుంటాయి. ఈ దుకాణాలను కూడా ఆ ప్రాంతంతో పాటు చేయాలంటే, ఇండ్లను సందర్శించినట్లే వాటిని కూడా మీరు సందర్శించాలి.
2 “మీకు తెలపాలని నేను ఇష్టపడుతున్న ఒక సమాచారం నా దగ్గర ఉంది” అని చెబుతూ మీరు సరళమైన, క్లుప్తమైన అందింపును ఉపయోగించవచ్చు. యజమాని ఆ క్షణంలో పనితొందరలో ఉన్నట్లు కనిపిస్తే, మీరు కేవలమొక కరపత్రాన్ని ప్రతిపాదించి, “మీరు కాస్త ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ వస్తాను. దీని గురించి మీరేమనుకుంటారో తెలుసుకోవాలని ఇష్టపడతాను” అని చెప్పవచ్చు.
3 ఈ పని చేయడానికి భయపడనవసరం లేదు. “ప్రతిస్పందన ప్రతికూలంగా ఉంటుందని అనుకున్నాను. అయితే, ఆశ్చర్యకరంగా రాజ్య వర్తమానం ఎడల ప్రతిక్రియ పూర్తి వ్యతిరేకంగా వచ్చింది. వాళ్ళు నిజంగా నమ్రతగలవారు, స్నేహభావం కలవారు, దాదాపు ప్రతిసారి పత్రికలను తీసుకునేవారు” అని ఒక ప్రచారకుడు నివేదిస్తున్నాడు.
4 ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో పని చేసే ఒక స్త్రీ సాక్షులను తన కార్యాలయంలోనికి ఆహ్వానించింది. ఆమె పత్రికలను స్వీకరించి, బైబిలు పఠనం చేయడంలో ఆసక్తిని కనబరచింది. ఆమెకు జ్ఞానము పుస్తకం చూపించి, ఆమె కార్యాలయంలోనే అప్పుడే పఠనం ఆరంభించబడింది!
5 మీ ప్రాంతంలో మీ నియామకాన్ని చక్కగా పూర్తిగా నెరవేర్చడంలో పొరుగు ప్రాంతాల్లో వ్యాపారం చేసే వ్యక్తులను సందర్శించడం కూడా ఇమిడి ఉంది. (అపొ. 10:42) స్వంత ఇండ్లవారిని సందర్శించినట్లే, వారిని కూడా సందర్శించేందుకు పథకం వేసుకోండి. అలా మీ ప్రాంతమంతటా పరిచర్య చేయడమే కాక, మీకు కొన్ని ఆహ్లాదకరమైన అనుభవాలు ప్రతిఫలంగా లభించవచ్చు కూడా!