1997 కొరకైన దైవపరిపాలన పరిచర్య పాఠశాల పట్టిక
ఉపదేశములు
1997లో దైవపరిపాలనా పరిచర్య పాఠశాలను నిర్వహించేటప్పుడు ఈ క్రింది ఏర్పాట్లుంటాయి.
పాఠ్యపుస్తకాలు: అసైన్మెంట్లు పరిశుద్ధ లేఖనముల నూతన లోక అనువాదము (ఆంగ్లం), అద్వితీయ సత్యదేవుని ఆరాధనలో ఐక్యమగుట (ఆంగ్లం), “ప్రతి లేఖనము దైవప్రేరేపితమును, ప్రయోజనకరమునై ఉన్నది” (ఆంగ్లం), (1990వ సంపుటి), నిత్యజీవానికి నడిపించే జ్ఞానము, లేఖనాల నుండి తర్కించుట (ఆంగ్లం) అనే పుస్తకాలపై ఆధారపడి ఉంటాయి.
పాట, ప్రార్థన మరియు ఆహ్వానపు మాటలతో పాఠశాల సరిగ్గా సమయానికి ప్రారంభమవ్వాలి, ఆ తర్వాత ఈ క్రింది విధంగా కొనసాగాలి:
అసైన్మెంట్ నెం. 1: 15 నిమిషాలు. దీనిని ఓ సంఘ పెద్ద లేదా పరిచర్య సేవకుడు నిర్వహించాలి, ఇది అద్వితీయ సత్యదేవుని ఆరాధనలో ఐక్యమగుట లేదా “ప్రతి లేఖనము దైవ ప్రేరేపితమును, ప్రయోజనకరమునై ఉన్నది” అనే పుస్తకాలపై ఆధారపడివుంటుంది. ఈ అసైన్మెంట్ 10 నుండి 12 నిమిషాల వరకు ఉండే ఉపదేశ ప్రసంగంగాను, ఆ తర్వాత ప్రచురణలోని ముద్రింపబడిన ప్రశ్నలను ఉపయోగిస్తూ 3 నుండి 5 నిమిషాలపాటు మౌఖిక పునఃసమీక్షగాను ఇవ్వబడాలి. దాని ఉద్దేశం కేవలం సమాచారాన్ని అందించడమేగాక, చర్చించబడే సమాచారం యొక్క ఆచరణాత్మకమైన విలువపై అవధానాన్ని నిల్పుతూ, సంఘానికి అత్యంత సహాయకరమైన విషయాల్ని ఉన్నతపర్చేదై ఉండాలి. చూపబడిన మూలాంశాన్నే ఉపయోగించాలి. అందరూ ముందుగానే జాగ్రత్తగా సిద్ధపడి రావాలని ప్రోత్సహించబడుతున్నారు, అలా ప్రేక్షకులు ఈ సమాచారం నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు.
ఈ ప్రసంగానికి నియమించబడిన సహోదరులు దీనిని నిర్ణీత సమయంలోనే ముగించడానికి జాగ్రత్తపడాలి. అవసరమైతే లేదా ప్రసంగీకుడు కోరినట్లైతే ఒంటరిగా ఉన్నప్పుడు సలహా ఇవ్వవచ్చు.
చదవవలసిన బైబిలు భాగంలోని ఉన్నతాంశాలు: 6 నిమిషాలు. సమాచారాన్ని ప్రాంతీయ అవసరతలకు తగినట్లు ఫలవంతముగా అన్వయించగల సంఘపెద్ద లేదా పరిచర్య సేవకుడు దీన్ని నిర్వహించాలి. ఇది కేవలం నియమిత అధ్యాయాల సంగ్రహ పునఃసమీక్షను కూడా ఇమిడ్చవచ్చు. అయితే, ఆ సమాచారం మనకు ఎందుకు, ఎలా విలువైనదో గుణగ్రహించేందుకు ప్రేక్షకులకు సహాయపడాలన్నదే దాని ముఖ్యోద్దేశం. ఆ తర్వాత పాఠశాల అధ్యక్షుడు విద్యార్థులను వారి వేర్వేరు తరగతి గదులకు పంపిస్తాడు.
అసైన్మెంట్ నెం. 2: 5 నిమిషాలు. చదవడానికి ఒక సహోదరునికి ఇవ్వవలసిన నియమిత బైబిలు భాగమిది. ముఖ్య పాఠశాలలోను అలాగే సహాయ గుంపుల్లోను ఇది వర్తిస్తుంది. విద్యార్థి ప్రారంభ, ముగింపు మాటల్లో క్లుప్త వివరణాత్మక సమాచారాన్ని అందించేందుకు వీలయ్యేలా చదవవలసిన ఈ నియమిత భాగాలు సాధారణంగా చిన్నవిగా ఉంటాయి. పూర్వ చరిత్రను ప్రవచనార్థక లేదా సిద్ధాంత సంబంధమైన భావాలను సూత్రాల అన్వయింపులను కూడా చేర్చవచ్చు. నియమిత వచనాలను అన్నింటిని ఆపకుండా చదవాలి. అయితే, చదవాల్సిన వచనాలు వరుసగా లేనప్పుడు, చదవడం మరలా ఎక్కడినుండి కొనసాగుతుందో విద్యార్థి పేర్కొనవచ్చు.
అసైన్మెంట్ నెం. 3: 5 నిమిషాలు. ఇది సహోదరికి నియమించబడుతుంది. ఈ అందింపు నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకంపై ఆధారపడి ఉంటుంది. నియమించబడే విద్యార్థినికి చదవడం వచ్చి ఉండాలి. ఈ సమాచారాన్ని అందించేటప్పుడు విద్యార్థిని కూర్చోవడమో, నిలబడడమో చేయవచ్చు. ఈ భాగం కొరకు నియమించబడిన సహోదరి పరిశీలించనున్న మూలాంశాన్ని, సమాచారాన్ని అచరణాత్మకమైన ఒక సన్నివేశంలోనికి మలచవలసిన అవసరం ఉంటుంది. ప్రాంతీయ పరిచర్య లేక అనియత సాక్ష్యం ఇమిడి ఉన్న సన్నివేశం ఉత్తమం. పాఠశాల అధ్యక్షుడు ఒక సహాయకురాలిని నియమిస్తాడు. అయితే మరొక సహాయకురాలిని కూడ తీసుకోవచ్చు. సన్నివేశానికి కాదుగాని సమాచారాన్ని ఫలవంతంగా ఉపయోగించేందుకే ప్రాముఖ్యతనివ్వాలి.
అసైన్మెంట్ నెం. 4: 5 నిమిషాలు. ఇదొక సహోదరునికి లేదా సహోదరికి నియమించబడుతుంది. ఇది లేఖనముల నుండి తర్కించుట లేదా పరిశుద్ధ లేఖనముల నూతన లోక అనువాదమునందున్న “చర్చనీయ బైబిలు అంశములు”పై ఆధారపడివుంటుంది. ఇది సహోదరునికి నియమించబడినప్పుడు, ప్రేక్షకులందరినీ ఉద్దేశించి చేసే ప్రసంగమై ఉండాలి. రాజ్యమందిర ప్రేక్షకులను మనస్సులో పెట్టుకుని ఆయన తన ప్రసంగాన్ని సిద్ధపడడం ఉత్తమం, అప్పుడు దానిని వాస్తవంగా వినేవారికి అది నిజంగా జ్ఞానానందించేదిగాను, ప్రయోజనకరమైనదిగాను ఉంటుంది. ఈ భాగం ఒక సహోదరికి నియమించబడినప్పుడు, అసైన్మెంట్ నెం. 3 కొరకు సంక్షిప్తం చేయబడిన దాని ప్రకారమే సమాచారం అందించబడాలి.
సలహా మరియు గుర్తించిన విషయాలు: ప్రతి విద్యార్థి అందింపు తర్వాత, పాఠశాల అధ్యక్షుడు ప్రత్యేక సలహా ఇస్తాడు. ప్రసంగ సలహా పత్రంలో అందివ్వబడిన వరుసక్రమాన్నే ఆయన అనుసరించనవసరం లేదు. బదులుగా, విద్యార్థి అభివృద్ధి సాధించవలసిన విషయాల్లో ఆయన శ్రద్ధచూపాలి. ప్రసంగించే విద్యార్థి ఏ ప్రసంగ లక్షణం దగ్గర కూడా “I” లేదా “W” అనే గుర్తును పొందకుండా “G” గుర్తు మాత్రమే పొందినట్లైతే, ఉపదేశకుడు ఆ విద్యార్థి ఈసారి కృషి చేయాల్సిన ప్రసంగ లక్షణం దగ్గర, అంటే సాధారణంగా “G,” “I,” లేదా “W” గుర్తుపెట్టాల్సిన బాక్సు చుట్టూ గుండ్రంగా గీతగీయాలి. ఆ సాయంకాలమే ఆయన విద్యార్థికి ఆ విషయంపై సలహా ఇవ్వడమే కాకుండా ఆ ప్రసంగ లక్షణాన్ని విద్యార్థి యొక్క తర్వాతి దైవపరిపాలనా పరిచర్య పాఠశాల అసైన్మెంట్ పత్రంపై (S-89) వ్రాయాలి. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు హాలులోని ముందు వరుసలో కూర్చోవాలి. దీనివల్ల సమయం ఆదా అవుతుంది, పాఠశాల అధ్యక్షుడు ప్రతి విద్యార్థికి నేరుగా సలహా ఇవ్వగలుగుతాడు కూడా. అవసరమైన మౌఖిక సలహా ఇచ్చిన తర్వాత సమయం అనుమతించేదానినిబట్టి, విద్యార్థులు వివరించని విలువైన, ఆచరణాత్మమైన అంశాలపై ఉపదేశకుడు వ్యాఖ్యానించవచ్చు. పాఠశాల అధ్యక్షుడు ప్రతి విద్యార్థి అందింపు తర్వాత ఇచ్చే సలహాకు లేదా తాను చెప్పే క్లుప్త వ్యాఖ్యానాలకు మొత్తం మీద రెండు నిమిషాలకన్నా ఎక్కువ సమయం తీసుకోకుండా జాగ్రత్తపడాలి. బైబిలు ఉన్నతాంశముల అసైన్మెంట్ను నిర్వహిస్తున్న సహోదరునికి సలహా అవసరమైతే, ఒంటరిగా ఉన్నప్పుడు సలహా ఇవ్వవచ్చు.
అసైన్మెంట్లకు సిద్ధపడడం: విద్యార్థి నియమిత భాగానికి సిద్ధపడే ముందు పాఠశాల నిర్దేశక పుస్తకం నుండి తాను కృషి చేయాల్సిన ప్రసంగ లక్షణాన్ని వివరించే సమాచారాన్ని జాగ్రత్తగా చదవాలి. రెండవ అసైన్మెంట్ కొరకు నియమించబడిన విద్యార్థులు చదవవలసిన బైబిలు భాగానికి తగిన మూలాంశాన్ని విషయాన్ని ఎన్నుకోవచ్చు. ముద్రిత పట్టికలో చూపబడిన విషయానికి అనుగుణంగానే మిగిలిన అసైన్మెంట్లు నిర్వహించబడతాయి.
సమయం: ఎవరూ సమయాన్ని మించిపోకూడదు, ఉపదేశకుని సలహానైనా ఆయన గుర్తించిన విషయాలను చెప్పడమైనా సమయాన్ని మించిపోకూడదు. ఉపదేశకుని సలహానైనా ఆయన గుర్తించిన విషయాలను చెప్పడమైనా సమయాన్ని మించిపోకూడదు. రెండు నుండి నాలుగువరకున్న అసైన్మెంట్లు సమయం మించిపోతున్నట్లైతే వాటిని యుక్తిగా ఆపుజేయాలి. ఆపుజేయాలని సూచించడానికి నియమించబడిన వ్యక్తి సత్వరంగా ఆ పనిచేయాలి. అసైన్మెంట్ నెం. 1ని మరియు బైబిలు ఉన్నతాంశాలను నిర్వహించే సహోదరులు ఎక్కువ సమయం తీసుకుంటే వారు ఒంటరిగా ఉన్నప్పుడు సలహా ఇవ్వాలి. పాట, ప్రార్థన కాకుండ మొత్తం కార్యక్రమం 45 నిమిషాలు.
వ్రాతపూర్వక పునఃసమీక్ష: నియమిత కాలంలో వ్రాతపూర్వక పునఃసమీక్ష ఇవ్వబడుతుంది. దాని సిద్ధపాటుగా నియమిత సమాచారాన్ని పునఃసమీక్షించండి, చదివేందుకు పట్టికవేయబడిన బైబిలు భాగాన్ని పూర్తి చేయండి. ఈ 25 నిమిషాల పునఃసమీక్షలో బైబిలును మాత్రమే ఉపయోగించుకోవచ్చు. మిగిలిన సమయం ప్రశ్నాజవాబుల చర్చకు ఉపయోగించబడుతుంది. ప్రతి విద్యార్థి తన జవాబు పత్రాన్ని చూసుకుంటాడు. పాఠశాల అధ్యక్షుడు ఆ జవాబుల్ని అందరూ స్పష్టంగా గ్రహించేందుకు సహాయపడుతూ పునఃసమీక్ష జవాబుల్ని ప్రేక్షకులతో చర్చించి, క్లిష్టమైన ప్రశ్నలకు అవధానమిస్తాడు. ప్రాంతీయ పరిస్థితులనుబట్టి తప్పనిసరైతే, పట్టికలో చూపబడినట్లుగా కాకుండా ఆ మరుసటి వారమైనా ఆ పునఃసమీక్షను జరుపవచ్చు. పెద్దసంఘాలు: పాఠశాలలో భాగము వహించడానికి 50 లేక అంతకంటే ఎక్కువమంది విద్యార్థులున్న సంఘాలు ఇతర ఉపదేశకులముందు పట్టికలో వేయబడిన భాగాలను నిర్వహించడానికి అదనపు గుంపుల్ని ఏర్పాటుచేసుకోవాలని కోరుకోవచ్చు. అయితే క్రైస్తవ సూత్రాలకు అనుగుణంగా తమ జీవితాల్ని మలచుకున్న బాప్తిస్మం పొందని వ్యక్తులు కూడ పాఠశాలలో చేరి ప్రసంగాలు ఇవ్వవచ్చు. హాజరుకానివారు: ప్రతివారం కార్యక్రమానికి హాజరుకావడానికి కృషిచేయడం ద్వారా, తమ అసైన్మెంట్లకు సిద్ధపడడం ద్వారా, అలాగే ప్రశ్నాభాగంలో పాల్గొనడం ద్వారా సంఘమందలి వారందరూ ఈ పాఠశాలయెడల తమ మెప్పును చూపగలరు. విద్యార్థులందరూ తమ అసైన్మెంట్లను మనస్సాక్షిపూర్వకంగా దృష్టిస్తారని ఆశించబడుతుంది. ఒక విద్యార్థి తనకు అసైన్మెంట్ ఉన్నరోజు హాజరుకానట్లైతే, ఎవరైనా ఆ స్వల్పకాల వ్యవధిలో యుక్తమని తాను తలంచిన అన్వయింపుతో ఆ అసైన్మెంటును స్వచ్ఛందంగా నిర్వహించవచ్చు. లేదా పాఠశాల అధ్యక్షుడు ప్రేక్షకులతో తగినరీతిలో చర్చిస్తూ ఆ సమాచారాన్ని అందించవచ్చు.
పట్టిక
*td నూతనలోక అనువాదములో కనుగొనబడే “చర్చనీయ బైబిలు అంశములు”
జన. 6 చదవవలసిన బైబిలు భాగం: జెకర్యా 1 నుండి 5
పాట నెం. 85 (44)
నెం. 1: జెకర్యా పుస్తకానికి ఉపోద్ఘాతం (si పే. 168-9 పేరాలు 1-7)
నెం. 2: జెకర్యా 2:1-13
నెం. 3: మానవుడు మరణించడానికి చేయబడలేదు (kl పే. 53 పేరాలు 1-3)
నెం. 4: లోకాత్మ అంటే ఏమిటి, మరి అది ఎందుకు ప్రమాదకరం? (rs పే. 389 పేరా 5 నుండి పే. 390 పేరా 4)
జన. 13 చదవవలసిన బైబిలు భాగం: జెకర్యా 6 నుండి 9
పాట నెం. 215 (117)
నెం. 1: మరణంయొక్క మరియు హేడిస్యొక్క తాళపుచెవులను యేసు కలిగియున్నాడు (uw పే. 73-7 పేరాలు 8-15)
నెం. 2: జెకర్యా 7:1-14
నెం. 3: ఒక దుష్టమైన కుట్ర (kl పే. 55-6 పేరాలు 4-7)
నెం. 4: గర్వం మరియు తిరుగుబాటుతనం లోకాత్మను వ్యక్తపరుస్తాయి (rs పే. 391 పేరాలు 1-2)
జనవరి 20 చదవవలసిన బైబిలు భాగం: జెకర్యా 10 నుండి 14
పాట నెం. 98 (91)
నెం. 1: జెకర్యా—ఎందుకు ప్రయోజనకరమైనది (si పే. 171-2 పేరాలు 23-7)
నెం. 2: జెకర్యా 12:1-14
నెం. 3: ఎలా సాతాను తన కుట్రను నెరవేర్చాడు (kl పే. 56-8 పేరాలు 8-12)
నెం. 4: లోకాత్మ శరీర కోరికలను వృద్ధిచేస్తుంది (rs పే. 391 పేరా 3)
జన. 27 చదవవలసిన బైబిలు భాగం: మలాకీ 1 నుండి 4
పాట నెం. 118 (99)
నెం. 1: మలాకీ పుస్తకానికి ఉపోద్ఘాతం మరియు అది ఎందుకు ప్రయోజనకరమైనది (si పే. 172-3 పేరాలు 1-6; పే. 174-5 పేరాలు 13-17)
నెం. 2: మలాకీ 1:6-14
నెం. 3: పాపమరణాలెలా వ్యాపించాయి (kl పే. 58-9 పేరాలు 13-15)
నెం. 4: లోకాత్మ ఐశ్వర్యాసక్తిని వృద్ధిచేస్తుంది (rs పే. 392 పేరాలు 1-2)
ఫిబ్ర. 3 చదవవలసిన బైబిలు భాగం: మత్తయి 1 నుండి 4
పాట నెం. 132 (70)
నెం. 1: మత్తయి పుస్తకానికి ఉపోద్ఘాతం (si పే. 175-7 పేరాలు 1-10)
నెం. 2: మత్తయి 2:1-15
నెం. 3: సాతాను కుతంత్రాలను గూర్చి జాగ్రత్తగా ఉండండి (kl పే. 59-60 పేరాలు 16-18)
నెం. 4: శరీర కార్యాలకు వ్యతిరేకంగా గట్టి పోరాటాన్ని చేయండి (rs పే. 392 పేరా 3)
ఫిబ్ర. 10 చదవవలసిన బైబిలు భాగం: మత్తయి 4 మరియు 5
పాట నెం. 36 (14)
నెం. 1: కలకాలముండే దేవుని రాజ్యాన్ని ప్రశంసించండి (uw పే. 78-81 పేరాలు 1-9)
నెం. 2: మత్తయి 4:1-17
నెం. 3: విశ్వాసం కలిగివుండి, వ్యతిరేకతకు సిద్ధపడండి (kl పే. 60-1 పేరాలు 19-21)
నెం. 4: మానవ పరిపాలకులపై కాకుండా, యెహోవాయందు నమ్మకముంచండి (rs పే. 392 పేరా 4 నుండి పే. 393 పేరా 1)
ఫిబ్ర. 17 చదవవలసిన బైబిలు భాగం: మత్తయి 6 మరియు 7
పాట నెం. 222 (29, sb29-TU)
నెం. 1: దేవుని రాజ్యం ఏమి నెరవేరుస్తుంది (uw పే. 81-2 పేరాలు 10-12)
నెం. 2: మత్తయి 7:1-14
నెం. 3: మానవజాతిని రక్షించడానికైన దేవుని మాధ్యమం (kl పే. 62-3 పేరాలు 10-12)
నెం. 4: మానవుల బాధలకు ఎవరు నిందార్హులు? (rs పే. 393 పేరా 2 నుండి పే. 394 పేరా 1)
ఫిబ్ర. 24 చదవవలసిన బైబిలు భాగం: మత్తయి 8 మరియు 9
పాట నెం. 162 (18, sb29-TU)
నెం. 1: ఆ రాజ్యం ఇప్పటికే ఏమి నెరవేర్చింది (uw పే. 83-6 పేరాలు 13-15)
నెం. 2: మత్తయి 8:1-17
నెం. 3: మెస్సీయ ఎందుకు మరణించాలి (kl పే. 63-5 పేరాలు 6-11)
నెం. 4: మానవ బాధలు ఎలా ప్రారంభమయ్యాయి? (rs పే. 394 పేరాలు 2-3)
మార్చి 3 చదవవలసిన బైబిలు భాగం: మత్తయి 10 మరియు 11
పాట నెం. 172 (92)
నెం. 1: మనమెలా రాజ్యాన్ని మొదట వెదుకుతాం (uw పే. 87-9 పేరాలు 1-6)
నెం. 2: మత్తయి 11:1-15
నెం. 3: విమోచన క్రయధనం ఎలా చెల్లించబడింది (kl పే. 65-8 పేరాలు 12-16)
నెం. 4: బాధలననుభవిస్తున్న మానవజాతికి సహాయం చేయడానికి దేవుడు ఏమి చేశాడు (rs పే. 395 పేరాలు 1-2)
మార్చి 10 చదవవలసిన బైబిలు భాగం: మత్తయి 12 మరియు 13
పాట నెం. 133 (68)
నెం. 1: తొలిశిష్యుల మాదిరిని అనుసరించండి (uw పే. 91-4 పేరాలు 10-15)
నెం. 2: మత్తయి 12:22-37
నెం. 3: క్రీస్తు విమోచన క్రయధనం మరియు మీరు (kl పే. 68-9 పేరాలు 17-20)
నెం. 4: బాధలు కొనసాగడానికి దేవుడెందుకు అనుమతించాడు? (rs పే. 395 పేరా 4 నుండి పే. 397 పేరా 1)
మార్చి 17 చదవవలసిన బైబిలు భాగం: మత్తయి 14 మరియు 15
పాట నెం. 129 (66)
నెం. 1: మీ జీవితంలో రాజ్యాన్ని మొదట ఉంచండి (uw పే. 91-4 పేరాలు 10-15)
నెం. 2: మత్తయి 14:1-22
నెం. 3: మానవ బాధలకు దేవుడు బాధ్యుడా? (kl పే. 70-1 పేరాలు 10-15)
నెం. 4: పుట్టుకతో వచ్చే లోపాలను గూర్చి మనం ఏమి తెలుసుకోవాలి (rs పే. 397 పేరాలు 2-5)
మార్చి 24 చదవవలసిన బైబిలు భాగం: మత్తయి 16 మరియు 17
పాట నెం. 151 (25)
నెం. 1: యోహాను ఇచ్చిన బాప్తిస్మాన్నిగూర్చి లేఖనాలు ఏమని చెబుతున్నాయి (uw పే. 95-6 పేరాలు 1-5)
నెం. 2: మత్తయి 17:14-27
నెం. 3: ఒక పరిపూర్ణ ఆరంభం మరియు ఒక ద్వేషపూరితమైన సవాలు (kl పే. 72-3 పేరాలు 1-3)
నెం. 4: “ప్రకృతి వైపరీత్యాలను” దేవుడెందుకు అనుమతిస్తాడు? (rs పే. 398 పేరాలు 1-3)
మార్చి 31 చదవవలసిన బైబిలు భాగం: మత్తయి 18 మరియు 19
పాట నెం. 97 (50)
నెం. 1: మరణములోనికి బాప్తిస్మమంటే ఏమిటి? (uw పే. 97-8 పేరాలు 6-8)
నెం. 2: మత్తయి 19:16-30
నెం. 3: వాస్తవమైన వివాదంశాలు మరియు వాటిని యెహోవా పరిష్కరించే పద్ధతి (kl పే. 74-6 పేరాలు 11-15)
నెం. 4: దుర్దశకు గురౌతున్న ప్రజలు దేవునిచే శిక్షించబడుతున్నారని భావమా? (rs పే. 398 పేరా 4 నుండి పే. 399 పేరా 3)
ఏప్రి. 7 చదవవలసిన బైబిలు భాగం: మత్తయి 20 మరియు 21
పాట నెం. 107 (57)
నెం. 1: “తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి” బాప్తిస్మమంటే అర్థమేమిటి? (uw పే. 98 పేరా 9)
నెం. 2: మత్తయి 20:1-16
నెం. 3: దేవుడు దుష్టత్వాన్ని అనుమతించడం దేన్ని నిరూపించింది (kl పే. 76-7 పేరాలు 16-19)
నెం. 4: ఒక వ్యక్తి భాషలు మాట్లాడడం ఆ వ్యక్తి పరిశుద్ధాత్మను కలిగియున్నాడని రుజువు చేస్తుందా? (rs పే. 400 పేరా 3 నుండి పే. 401 పేరా 2)
ఏప్రి. 14 చదవవలసిన బైబిలు భాగం: మత్తయి 22 మరియు 23
పాట నెం. 56 (33)
నెం. 1: మన బాప్తిస్మం యొక్క అర్థానికి తగినట్లు జీవించడం (uw పే. 99-102 పేరాలు 10-14)
నెం. 2: మత్తయి 23:1-15
నెం. 3: మీరు ఎవరి పక్షం వహిస్తారు? (kl పే. 78-9 పేరాలు 20-3)
నెం. 4: మొదటి శతాబ్దపు క్రైస్తవులు కొందరు ఎందుకు భాషలు మాట్లాడారు? (rs పే. 401 పేరా 3 నుండి పే. 402 పేరా 1)
ఏప్రి. 21 చదవవలసిన బైబిలు భాగం: మత్తయి 24 మరియు 25
పాట నెం. 193 (103)
నెం. 1: గొప్ప సమూహాన్ని గుర్తించడం (uw పే. 103-4 పేరాలు 1-4)
నెం. 2: మత్తయి 24:32-44
నెం. 3: మరణించిన మన ప్రియమైనవారికి ఏమి సంభవిస్తుంది? (kl పే. 80-1 పేరాలు 1-6)
నెం. 4: దేవుని ఆత్మగలవారిని మనం ఏ విధంగా గుర్తించగలం? (rs పే. 402 పేరాలు 3-6)
ఏప్రి. 28 వ్రాతపూర్వక పునఃసమీక్ష. పూర్తిగా జెకర్యా 1 నుండి మత్తయి 25
పాట నెం. 6 (4)
మే 5 చదవవలసిన బైబిలు భాగం: మత్తయి 26
పాట నెం. 14 (6)
నెం. 1: మహాశ్రమలను తప్పించుకోవడానికి ఏమి అవసరమైవుంది? (uw పే. 105 పేరా 5)
నెం. 2: మత్తయి 26:31-35, 69-75
నెం. 3: మంటికి తిరిగి చేరడమంటే నిజానికి దాని భావమేమి (kl పే. 82-3 పేరాలు 7-10)
నెం. 4: నేడు నిజక్రైస్తవులు ఏ విధంగా గుర్తించబడుతున్నారు (rs పే. 403 పేరాలు 1-3)
మే 12 చదవవలసిన బైబిలు భాగం: మత్తయి 27 మరియు 28
పాట నెం. 102 (53)
నెం. 1: మత్తయి—ఎందుకు ప్రయోజనకరమైనది (si పే. 180-1 పేరాలు 29-33)
నెం. 2: మత్తయి 27:11-26
నెం. 3: మరణించినవారి స్థితి ఏమిటి? (kl పే. 83-4 పేరాలు 11-14)
నెం. 4: భాషలు మాట్లాడే వరం ఎంతకాలం కొనసాగవలసి ఉండింది? (rs పే. 403 పేరా 4 నుండి పే. 404 పేరా 3)
మే 19 చదవవలసిన బైబిలు భాగం: మార్కు 1 మరియు 2
పాట నెం. 180 (100)
నెం. 1: మార్కు పుస్తకానికి ఉపోద్ఘాతం (si పే. 181-3 పేరాలు 1-11)
నెం. 2: మార్కు 1:12-28
నెం. 3: యెహోవా జ్ఞాపకంలోనున్న వారందరు పునరుత్థానం చేయబడతారు (kl పే. 85-7 పేరాలు 15-18)
నెం. 4: త్రిత్వ సిద్ధాంతం ఏమిటి, దానికి మూలమేమిటి? (rs పే. 405 పేరా 1 నుండి పే. 406 పేరా 3)
మే 26 చదవవలసిన బైబిలు భాగం: మార్కు 3 మరియు 4
పాట నెం. 46 (5, sb29-TU)
నెం. 1: గొప్ప సమూహము మహాశ్రమలను ఎందుకు తప్పించుకుంటుంది (uw పే. 106-7 పేరాలు 6-8)
నెం. 2: మార్కు 3:1-15
నెం. 3: ఎక్కడికి పునరుత్థానం చేయబడుతారు? (kl పే. 88-9 పేరాలు 19-22)
నెం. 4: పరిశుద్ధాత్మ ఒక వ్యక్తా? (rs పే. 406 పేరా 4-పే. 407 పేరా 3)
జూన్ 2 చదవవలసిన బైబిలు భాగం: మార్కు 5 మరియు 6
పాట నెం. 220 (19)
నెం. 1: మన ఆత్మీయ పరదైసును మనమెందుకు విలువైనదిగా ఎంచుతాం (uw పే. 107-9 పేరాలు 9-13)
నెం. 2: మార్కు 5:21-24, 35-43
నెం. 3: దేవుని రాజ్యం మరియు దాని సంకల్పం (kl పే. 90-1 పేరాలు 1-5)
నెం. 4: యేసు మరియు యెహోవా ఒకే వ్యక్తా? (rs పే. 407 పేరా 4 నుండి పే. 409 పేరా 2)
జూన్ 9 చదవవలసిన బైబిలు భాగం: మార్కు 7 మరియు 8
పాట నెం. 207 (112)
నెం. 1: నేడు రాజ్య వారసులు భూమిపై ఎందుకు అంత తక్కువమంది ఉన్నారు? (uw పే. 110-12 పేరాలు 1-7)
నెం. 2: మార్కు 7:24-37
నెం. 3: దేవుని రాజ్యం ఒక ప్రభుత్వమైయుంది (kl పే. 91-2 పేరాలు 6-7)
నెం. 4: యెహోవా, యేసు, పరిశుద్ధాత్మ అనబడే వారందరూ సమానులేనని బైబిలు బోధిస్తుందా? (rs పే. 409 పేరా 3 నుండి పే. 411 పేరా 1)
జూన్ 16 చదవవలసిన బైబిలు భాగం: మార్కు 9 మరియు 10
పాట నెం. 11 (12)
నెం. 1: ఆత్మీయ కుమారులని వారికెలా తెలుస్తుంది? (uw పే. 112-13 పేరాలు 8-10)
నెం. 2: మార్కు 9:14-29
నెం. 3: దేవుని రాజ్యం వాస్తవికమైనదని మనం ఎలా తెలుసుకోగలము (kl పే. 92-3 పేరాలు 8-11)
నెం. 4: త్రిత్వంలో భాగమని చెప్పబడిన ప్రతి ఒక్కరు దేవుడేనని బైబిలు బోధిస్తుందా? (rs పే. 411 పేరా 2 నుండి పే. 412 పేరా 1)
జూన్ 23 చదవవలసిన బైబిలు భాగం: మార్కు 11 మరియు 12
పాట నెం. 87 (47)
నెం. 1: జ్ఞాపకార్థ దిన ఆచరణ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? (uw పే. 114-16 పేరాలు 11-14)
నెం. 2: మార్కు 11:12-25
నెం. 3: ఎందుకు దేవుని రాజ్యం మానవజాతికి ఏకైక నిరీక్షణ (kl పే. 94-5 పేరాలు 12-13)
నెం. 4: త్రిత్వవాదులు లేఖనాలను ఎలా తప్పుగా అన్వయిస్తారు (rs పే. 412 నుండి పే. 414 పేరా 1)
జూన్ 30 చదవవలసిన బైబిలు భాగం: మార్కు 13 మరియు 14
పాట నెం. 38 (65)
నెం. 1: యెహోవా దృశ్య సంస్థను గుర్తించడం (uw పే. 117-18 పేరాలు 1-3)
నెం. 2: మార్కు 14:12-26
నెం. 3: యేసు పరలోకానికి ఆరోహణమైన వెంటనే పరిపాలనను ఎందుకు ఆరంభించలేదు (kl పే. 95-6 పేరాలు 14-15)
నెం. 4: కొన్ని లేఖనాలు యెహోవాను గురించి చెబుతున్నప్పటికి అవి యేసుకు కూడా ఎలా అన్వయించబడగలవు (rs పే. 414 పేరాలు 2-3)
జూలై 7 చదవవలసిన బైబిలు భాగం: మార్కు 15 మరియు 16
పాట నెం. 187 (17, sb29-TU)
నెం. 1: మార్కు—ఎందుకు ప్రయోజనకరమైనది (si పే. 186 పేరాలు 31-3)
నెం. 2: మార్కు 15:16-32
నెం. 3: అన్యజనముల కాలములు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎప్పుడు ముగిశాయి? (kl పే. 96-7 పేరాలు 16-18)
నెం. 4: త్రిత్వవాదులు తప్పుగా ఉపయోగించిన లేఖనాలు (rs పే. 414 పేరా 4 నుండి పే. 415 పేరా 5)
జూలై 14 చదవవలసిన బైబిలు భాగం: లూకా 1
పాట నెం. 212 (26, sb29-TU)
నెం. 1: లూకా పుస్తకానికి ఉపోద్ఘాతం (si పే. 187-8 పేరాలు 1-9)
నెం. 2: లూకా 1:5-17
నెం. 3: ఇవి అంత్యదినాలు (kl పే. 98-9 పేరాలు 1-4)
నెం. 4: యోహాను 1:1 మరియు 8:58 త్రిత్వానికి ఎందుకు మద్దతునివ్వవు (rs పే. 416 పేరా 1 నుండి పే. 418 పేరా 2)
జూలై 21 చదవవలసిన బైబిలు భాగం: లూకా 2 మరియు 3
పాట నెం. 89 (49)
నెం. 1: దేవుని సంస్థ దైవపరిపాలనయైయుంది (uw పే. 118-20 పేరాలు 4-7)
నెం. 2: లూకా 2:1-14
నెం. 3: అంత్యదినాలను గూర్చిన కొన్ని అంశాలు ఏవి? (kl పే. 99-103 పేరాలు 5-7)
నెం. 4: లేఖనాలయొక్క సందర్భాన్ని పరిశీలించడం ఎందుకు ప్రాముఖ్యం (rs పే. 418 పేరా 4 నుండి పే. 423 పేరా 1)
జూలై 28 చదవవలసిన బైబిలు భాగం: లూకా 4 మరియు 5
పాట నెం. 92 (51)
నెం. 1: సంఘంలో నాయకత్వం వహించే వారి లేఖనాధారమైన పాత్ర (uw పే. 120-2 పేరాలు 8-12)
నెం. 2: లూకా 4:31-44
నెం. 3: అంత్యదినాలలోని నీచమైన మానవ ప్రవర్తన గూర్చి ముందే చెప్పబడింది (kl పే. 103-4 పేరాలు 8-12)
నెం. 4: యేసుక్రీస్తు, యెహోవా వేర్వేరు మరియు విభిన్న వ్యక్తులు (rs పే. 421 పేరా 2 నుండి పే. 423 పేరా 1)
ఆగ. 4 చదవవలసిన బైబిలు భాగం: లూకా 6 మరియు 7
పాట నెం. 92 (51)
నెం. 1: దేవుని సంస్థకొరకైన మన ప్రశంసను విశ్లేషించుట (uw పే. 123-4 పేరాలు 13-14)
నెం. 2: లూకా 6:37-49
నెం. 3: అంత్యదినాలయొక్క రెండు విశిష్టమైన సూచనలు (kl పే. 105 పేరాలు 13-14)
నెం. 4: యేసు తనను తానే మృతులలోనుండి లేపుకోలేదు, ఆయన ఎన్నడూ దేవునికి సమానునిగా చెప్పుకోలేదు (rs పే. 423 పేరా 3 నుండి పే. 424 పేరా 2)
ఆగ. 11 చదవవలసిన బైబిలు భాగం: లూకా 8 మరియు 9
పాట నెం. 67 (38)
నెం. 1: సలహాను ఎందుకు వినాలి? (uw పే. 125-7 పేరాలు 1-4)
నెం. 2: లూకా 9:23-36
నెం. 3: ఇవి అంత్యదినాలనే నిదర్శనానికి స్పందించండి (kl పే. 106-7 పేరాలు 15-17)
నెం. 4: త్రిత్వమందలి విశ్వాసానికి అంటిపెట్టుకొని ఉండడం ఎందుకు ప్రమాదకరం (rs పే. 424 పేరా 3 నుండి పే. 425 పేరా 2)
ఆగ. 18 చదవవలసిన బైబిలు భాగం: లూకా 10 మరియు 11
పాట నెం. 34 (8)
నెం. 1: సలహాను అంగీకరించిన వారి చక్కని మాదిరులు (uw పే. 127-8 పేరాలు 5-6)
నెం. 2: లూకా 11:37-51
నెం. 3: దుష్టాత్మాలు ఉనికిలో ఉన్నాయి! (kl పే. 108 పేరాలు 1-3)
నెం. 4: దుష్టత్వం ఇంత అధికంగా ఎందుకు ఉంది? (rs పే. 427 పేరాలు 1-5)
ఆగ. 25 వ్రాతపూర్వక పునఃసమీక్ష. పూర్తిగా మత్తయి 26 నుండి లూకా 11
పాట నెం. 160 (88)
సెప్టెం. 1 చదవవలసిన బైబిలు భాగం: లూకా 12 మరియు 13
పాట నెం. 163 (94)
నెం. 1: అమూల్యమైన లక్షణాలను పెంచుకోండి (uw పే. 128-30 పేరాలు 7-11)
నెం. 2: లూకా 13:1-17
నెం. 3: దుష్టులైన దేవదూతలు సాతాను పక్షం వహించారు (kl పే. 109 పేరాలు 4-5)
నెం. 4: దేవుడెందుకు దుష్టత్వాన్ని అనుమతించాడు? (rs పే. 428 పేరా 1 నుండి పే. 429 పేరా 1)
సెప్టెం. 8 చదవవలసిన బైబిలు భాగం: లూకా 14 నుండి 16
పాట నెం. 124 (13, sb29-TU)
నెం. 1: యెహోవాయిచ్చే శిక్షణను తిరస్కరించకండి (uw పే. 130-1 పేరాలు 12-14)
నెం. 2: లూకా 14:1-14
నెం. 3: అన్ని విధాల అభిచారాన్ని తిరస్కరించకండి (kl పే. 111 పేరాలు 6-8)
నెం. 4: దేవుడు దుష్టత్వాన్ని అనుమతించడం నుండి మనం ఎలా ప్రయోజనం పొందాము (rs పే. 429 పేరాలు 2-3)
సెప్టెం. 15 చదవవలసిన బైబిలు భాగం: లూకా 17 మరియు 18
పాట నెం. 200 (23, sb29-TU)
నెం. 1: ప్రేమ నిజ క్రైస్తవులను గుర్తింపజేస్తుంది (uw పే. 132-3 పేరాలు 1-5)
నెం. 2: లూకా 17:22-37
నెం. 3: ఎందుకు అభిచారాన్ని బైబిలు ఖండిస్తుంది (kl పే. 112-13 పేరాలు 9-11)
నెం. 4: బైబిలు స్త్రీలను ఎలా దృష్టిస్తుంది (rs పే. 431 పేరాలు 2-4)
సెప్టెం. 22 చదవవలసిన బైబిలు భాగం: లూకా 19 మరియు 18
పాట నెం. 145 (115)
నెం. 1: సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఏమిచేయాలి (uw పే. 134 పేరాలు 6-9)
నెం. 2: లూకా 19:11-27
నెం. 3: దుష్టాత్మలు ఎలా పనిచేస్తాయో బైబిలు వెల్లడిస్తుంది (kl పే. 113-14 పేరాలు 12-13)
నెం. 4: పురుషులకు శిరస్సత్వాన్ని ఆపాదించడమంటే స్త్రీలను కించపర్చినట్లా? (rs పే. 432 పేరాలు 1-3)
సెప్టెం. 29 చదవవలసిన బైబిలు భాగం: లూకా 21 మరియు 22
పాట నెం. 86 (45)
నెం. 1: సమస్యలను లేఖనాధారంగా పరిష్కరించుకోండి (uw పే. 134 పేరాలు 1-5)
నెం. 2: లూకా 22:24-38
నెం. 3: దుష్టాత్మలు ఎలా పనిచేస్తాయో బైబిలు వెల్లడిస్తుంది (kl పే. 114-15 పేరాలు 14-15)
నెం. 4: స్త్రీలు పరిచారకులుగా ఉండాలా? (rs పే. 432 పేరా 4 నుండి పే. 433 పేరా 1)
అక్టో. 6 చదవవలసిన బైబిలు భాగం: లూకా 23 మరియు 24
పాట నెం. 88 (42)
నెం. 1: లూకా—ప్రయోజనకరమైనది (si పే. 192-3 పేరాలు 30-5)
నెం. 2: లూకా 23:32-49
నెం. 3: మీ విశ్వాసాన్ని బలపర్చుకోవడం ఎలా (kl పే. 115-16 పేరాలు 16-17)
నెం. 4: కొన్ని సందర్భాలలో ఎందుకు స్త్రీలు తలపై ముసుగు వేసుకుంటారు? (rs పే. 433 పేరా 2 నుండి పే. 434-పేరా 1)
అక్టో. 13 చదవవలసిన బైబిలు భాగం: యోహాను 1 నుండి 3
పాట నెం. 31 (10)
నెం. 1: యోహాను పుస్తకానికి ఉపోద్ఘాతం (si పే. 193-5 పేరాలు 1-9)
నెం. 2: యోహాను 1:19-34
నెం. 3: దుష్టాత్మలకు వ్యతిరేకంగా మీరు చేసే పోరాటాన్ని కొనసాగించండి (kl పే. 116-17 పేరాలు 18-20)
నెం. 4: స్త్రీలు కాస్మొటిక్లను లేక నగలను ధరించడం సరియైనదేనా? (rs పే. 435 పేరాలు 1-3)
అక్టో. 20 చదవవలసిన బైబిలు భాగం: యోహాను 4 మరియు 5
పాట నెం. 35 (15)
నెం. 1: ప్రేమలో ‘విశాలపరచుకొనే’ మార్గాలను వెదకండి (uw పే. 137-8 పేరాలు 14-17)
నెం. 2: యోహాను 4:39-54
నెం. 3: దైవభక్తిగల జీవితాన్ని గడపడం సంతోషాన్ని తెస్తుంది (kl పే. 118-19 పేరాలు 1-4)
నెం. 4: లోకమునకు మరియు దాని పరిపాలకునికి ఉన్న భవిష్యత్తు ఏమిటి? (rs పే. 436 పేరా 1 నుండి పే. 437 పేరా 2)
అక్టో. 27 చదవవలసిన బైబిలు భాగం: యోహాను 6 మరియు 7
పాట నెం. 150 (83)
నెం. 1: గృహమందే దైవభక్తిని అభ్యసించాలి (uw పే. 139 పేరాలు 1-2)
నెం. 2: యోహాను 6:52-71
నెం. 3: నిజాయితీ సంతోషాన్ని తెస్తుంది (kl పే. 119-20 పేరాలు 5-6)
నెం. 4: నిజ క్రైస్తవులు లోకమును ఎలా దృష్టించాలి? (rs పే. 437 పేరా 3 నుండి పే. 438 పేరా 4)
నవం. 3 చదవవలసిన బైబిలు భాగం: యోహాను 8 మరియు 9
పాట నెం. 48 (28)
నెం. 1: వివాహం, విడాకులు మరియు వేరుకావడాన్ని గూర్చి బైబిలు ఏమి చెబుతుంది (uw పే. 140 పేరాలు 3)
నెం. 2: యోహాను 9:18-34
నెం. 3: ఉదారత సంతోషాన్ని తెస్తుంది (kl పే. 120 పేరాలు 7-8)
నెం. 4: *td 15ఎ కేవలము 1,44,000 మంది మాత్రమే పరలోకానికి వెళ్తారు
నవం. 10 చదవవలసిన బైబిలు భాగం: యోహాను 10 మరియు 11
పాట నెం. 117 (14, sb29-TU)
నెం. 1: విజయవంతమైన వివాహానికి కీలకాంశాలు (uw పే. 140-1 పేరాలు 4-5)
నెం. 2: యోహాను 10:22-39
నెం. 3: మీ ఆలోచనా సామర్థ్యాలను కాపాడుకొంటూ, చెడు విషయాలను విసర్జించండి (kl పే. 121 పేరాలు 9-10)
నెం. 4: *td 16బి అగ్ని నిర్మూలమునకు సూచనయైయున్నది
నవం. 17 చదవవలసిన బైబిలు భాగం: యోహాను 12 మరియు 13
పాట నెం. 158 (85)
నెం. 1: దేవుని యొక్క కుటుంబ ఏర్పాటునందు మీ పాత్రను నెరవేర్చండి (uw పే. 142-3 పేరాలు 6-10)
నెం. 2: యోహాను 12:1-16
నెం. 3: వివాహజత ఎడల నమ్మకంగా ఉండడం వివాహంలో సంతోషాన్ని తీసుకురాగలదు (kl పే. 122-3 పేరాలు 11-13)
నెం. 4: *td 17ఎ వార్షిక అచారాలు మరియు యెహోవా యొక్క నిజ సేవకులు
నవం. 24 చదవవలసిన బైబిలు భాగం: యోహాను 14 నుండి 16
పాట నెం. 63 (32)
నెం. 1: మీరు బైబిలును సలహాలను మూలంగా ఎంచండి (uw పే. 144 పేరాలు 11-13)
నెం. 2: యోహాను 16:1-16
నెం. 3: లోకసంబంధులు కాకుడి (kl పే. 123-5 పేరాలు 14-15)
నెం. 4: *td 18బి విగ్రహారాధన ఇశ్రాయేలు జనాంగానికి ఒక ఉరిగా ఉండింది
డిశం. 1 చదవవలసిన బైబిలు భాగం: యోహాను 17 మరియు 18
పాట నెం. 114 (61)
నెం. 1: ధర్మశాస్త్రము మనకు ఎందుకు ఆసక్తికరమైనదైవుండాలి (uw పే. 146-7 పేరాలు 1-4)
నెం. 2: యోహాను 18:1-14
నెం. 3: నిజ క్రైస్తవులు క్రిస్టమస్ను లేక జన్మదిన వేడుకలను ఎందుకు జరుపుకోరు (kl పే. 126 పేరాలు 16-17)
నెం. 4: *td 19ఎ కేవలము ఒకే ఒక్క సత్య మతము ఉంది
డిశం. 8 చదవవలసిన బైబిలు భాగం: యోహాను 19 నుండి 21
పాట నెం. 138 (71)
నెం. 1: యోహాను—ఎందుకు ప్రయోజనకరమైనది (si పే. 198-9 పేరాలు 30-5)
నెం. 2: యోహాను 19:25-37
నెం. 3: ప్రభురాత్రి భోజనాన్ని ఆచరిస్తూ ఉండండి (kl పే. 127 పేరా 18)
నెం. 4: *td 20ఎ దేవుని నామాన్ని తెలియజేయండి
డిశం. 15 చదవవలసిన బైబిలు భాగం: అపొస్తలుల కార్యములు 1 నుండి 3
పాట నెం. 41 (22)
నెం. 1: అపొస్తలుల కార్యముల పుస్తకానికి ఉపోద్ఘాతం (si పే. 199-200 పేరాలు 1-8)
నెం. 2: అపొస్తలుల కార్యములు 1:1-14
నెం. 3: బైబిలు సూత్రాలు ఉద్యోగం, వినోదాల విషయంలో ఎలా వర్తిస్తాయి (kl పే. 127-8 పేరాలు 19-20)
నెం. 4: *td 20సి దేవుని ప్రధాన లక్షణాలేవి?
డిశం. 22 చదవవలసిన బైబిలు భాగం: అపొస్తలుల కార్యములు 4 నుండి 6
పాట నెం. 113 (12, sb29-TU)
నెం. 1: మనం మోషే ధర్మశాస్త్రం క్రింద లేమని చెప్పడానికి లేఖనాధార కారణాలు (uw పే. 147-8 పేరాలు 5-6)
నెం. 2: అపొస్తలుల కార్యములు 5:27-42
నెం. 3: జీవం మరియు రక్తం ఎడల గౌరవాన్ని చూపండి (kl పే. 128-9 పేరాలు 21-3)
నెం. 4: *td 21ఎ యెహోవాసాక్షుల ఆరంభం ఏమిటి?
డిశం. 29 వ్రాతపూర్వక పునఃసమీక్ష. పూర్తిగా లూకా 12 నుండి అపొస్తలుల కార్యములు 6
పాట నెం. 114 (78)