కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/96 పేజీ 2
  • అక్టోబరులోని సేవా కూటాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అక్టోబరులోని సేవా కూటాలు
  • మన రాజ్య పరిచర్య—1996
  • ఉపశీర్షికలు
  • అక్టోబరు 7తో ప్రారంభమయ్యే వారం
  • అక్టోబరు 14తో ప్రారంభమయ్యే వారం
  • అక్టోబరు 21తో ప్రారంభమయ్యే వారం
  • అక్టోబరు 28తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—1996
km 10/96 పేజీ 2

అక్టోబరులోని సేవా కూటాలు

అక్టోబరు 7తో ప్రారంభమయ్యే వారం

పాట 47 (21)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. జూన్‌ నెల ప్రాంతీయ పరిచర్యను గూర్చిన దేశ నివేదికపై, స్థానిక సంఘ నివేదికపై వ్యాఖ్యానించండి.

15 నిమి: ప్రశ్నాభాగం. సేవాధ్యక్షుడు లేదా మరో యోగ్యత గల పెద్ద ప్రేక్షకులతో సమాచారాన్ని చర్చిస్తాడు.

20 నిమి: “మీ సొంత పత్రికా అందింపులను సిద్ధం చేసుకోండి.” (1-7 పేరాలు) 1-4 పేరాల నుండి ప్రశ్నలను అడగండి, చందాలను ప్రతిపాదించేందుకు క్రొత్త పత్రికలను ఎలా ఉపయోగించవచ్చో చూపించేందుకు 5-7 పేరాలలోని సలహాలను ఉపయోగిస్తూ రెండో మూడో క్లుప్త ప్రదర్శనలను చూపించండి. మార్చి 1, 1987 కావలికోట (ఆంగ్లం) 17 వ పేజీ 8-9 పేరాలలోని వ్యాఖ్యానాలను ఇమడ్చండి.

పాట 222 (29 sb29-TU) మరియు ముగింపు ప్రార్థన.

అక్టోబరు 14తో ప్రారంభమయ్యే వారం

పాట 39 (16)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్‌ నివేదిక.

10 నిమి: “మేలైన ఒక సువార్తను ప్రచురించడం.” ప్రశ్నా జవాబులు. కావలికోటలో కనిపించిన కొన్ని ముఖ్యమైన శీర్షికలను చూపించండి.—కావలికోట మార్చి 1, 1987 (ఆంగ్లం) పేజీ 13 చూడండి.

20 నిమి: “మీ సొంత పత్రికా అందింపులను సిద్ధం చేసుకోండి.” (8-11 పేరాలు) ప్రశ్నా జవాబులు. జనవరి 1, 1994 కావలికోట (ఆంగ్లం), 24-5 పేజీల్లోని 18-21 పేరాల్లో ఉన్న నాలుగు సలహాలపై వ్యాఖ్యానాలను ఇమడ్చండి. పత్రికల అక్టోబరు సంచికలను ఉపయోగిస్తూ అందింపును ఎలా సిద్ధపడాలో చూపించండి: (1) మీ ప్రాంతంలో ఆసక్తిని రేకెత్తించగల ఒక శీర్షికను ఎంపిక చేసుకోండి, (2) విశేషంగా చూపేందుకు ఒక ఆసక్తికరమైన విషయం కొరకు చూడండి, (3) ఆ విషయం వైపుకు శ్రద్ధను మళ్ళించగల ఒక ప్రశ్న కొరకు ఆలోచించుకోండి, (4) అవకాశమిస్తే, చదవడానికి ఒక లేఖనాన్ని తీసుకోండి, (5) మీ ప్రారంభ మాటలను అలాగే, గృహస్థుడు చందా కట్టడానికి అంగీకరించేలా ప్రోత్సహించేందుకు పత్రికను గూర్చి మీరు ఏమి చెప్పాలనే దానిని సిద్ధం చేసుకోండి. ఇద్దరో ముగ్గురో సామర్థ్యంగల ప్రచారకులు ఒక్కొక్కరు ఒక్కో అందింపును ప్రదర్శించాలి. కేవలం ఒక పత్రికను ప్రతిపాదించడాన్ని ప్రదర్శించేందుకు ఒక యౌవనస్థున్ని కూడా ఇమడ్చండి. చందా కట్టడానికి నిరాకరిస్తే, పత్రికల విడి ప్రతులను ప్రతిపాదించాలని నిశ్చయం చేసుకోండి.

పాట 82 (10 sb29-TU) మరియు ముగింపు ప్రార్థన.

అక్టోబరు 21తో ప్రారంభమయ్యే వారం

పాట 169 (28)

15 నిమి: స్థానిక ప్రకటనలు. ఒక వ్యక్తి పత్రికలను పొందడానికి ఆసక్తిని చూపించి, చందా కట్టడానికి నిరాకరిస్తే పత్రికా మార్గాన్ని ఎలా ఆరంభించాలో వివరించండి: (1) అందించిన పత్రికను, విశేషంగా చూపించిన శీర్షికను వ్రాసుకోండి, (2) తరువాతి సంచికలతో తిరిగి వెళ్ళడానికి ఏర్పాటు చేసుకోండి, (3) ఈ పునర్దర్శనాలను చేయడానికి మీ వార పరిచర్య పట్టికలో నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోండి. ప్రతి పత్రికామార్గ సందర్శనను ఒక్కో పునర్దర్శనంగా నివేదించాలని గుర్తుంచుకోండి.

15 నిమి: “మీ ప్రాంతాన్ని చక్కగా పూర్తిగా చేయండి.” శీర్షికను, వ్యాపార స్థలాల్లో పరిచర్య చేసే స్థానిక ఏర్పాట్లను చర్చించండి. తమ ప్రాంతంలో ఉన్న దుకాణాల్లో పరిచర్య చేసినప్పుడు తాము ఆనందించిన ప్రోత్సాహకరమైన అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

15 నిమి: స్థానిక అవసరతలు. లేదా మే 1, 1996 కావలికోట 21-4 పేజీల్లోని “అంతము వరకూ మీ విశ్వాసాన్ని దృఢంగా కాపాడుకోండి” అనే శీర్షికపై ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం.

పాట 12 (52) మరియు ముగింపు ప్రార్థన.

అక్టోబరు 28తో ప్రారంభమయ్యే వారం

పాట 27 (7)

10 నిమి: స్థానిక ప్రకటనలు. డిశంబరులో లౌకిక సెలవు దినాలు సమీపమౌతుండగా ఒకవేళ లౌకిక ఉద్యోగ సెలవులను, లేదా పాఠశాల సెలవులను ఉపయోగించుకుని సహాయ పయినీర్లుగా పేరు నమోదు చేసుకునే అవకాశాన్ని గూర్చి ఆలోచించమని అందరినీ ప్రోత్సహించండి. అక్టోబరు ప్రాంతీయ పరిచర్య నివేదికలను ఈ వారాంతంలో ఇవ్వమని అందరికీ ఉద్బోధించండి.

20 నిమి: “సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోవడమెలా.” ప్రశ్నా జవాబులు. డిశంబరు 1, 1989 కావలికోట (ఆంగ్లం) 16-17 పేజీల్లోని 7-11 పేరాల్లోని వ్యాఖ్యానాలను చేర్చండి.

15 నిమి: నవంబరులోని సాహిత్య ప్రతిపాదనను పునఃసమీక్షించండి. జ్ఞానము పుస్తకం ప్రతిపాదించబడుతుంది, వాటిని అందించిన ప్రతిచోట గృహ బైబిలు పఠనాలను ఆరంభించాలనే దృష్టితో తిరిగి వెళ్ళేందుకు ప్రత్యేక ప్రయత్నం జరుగుతుంది. ఇద్దరో ముగ్గురో సామర్థ్యం గల ప్రచారకులు ఆ పుస్తకపు విలువను, దానిని ఎలా ఉపయోగించవచ్చు అనే విషయాన్ని చర్చిస్తారు. అందులో ఉన్న సమాచారం అన్ని రకాల ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది. క్రొత్తవాళ్ళు బాప్తిస్మం పొందే ముందు అర్థం చేసుకోవలసిన ప్రాథమిక బైబిలు అంశాలను సూత్రాలను అది చర్చిస్తుంది. మనం నిర్వహించే పఠనం మంచి వేగం పుంజుకున్నట్లయితే విద్యార్థి త్వరగా అభివృద్ధిని సాధించగలడు. ఈ సూటైన పద్ధతిని ఉపయోగించడం ద్వారా పఠనాన్ని ఎలా ఆరంభించాలో చర్చించి ప్రదర్శించండి: 4-5 పేజీల్లోని చిత్రాన్ని, క్యాప్షన్‌ను పునఃసమీక్షించండి; మన పఠన పద్ధతిని వివరించండి; 1వ అధ్యాయంలోని మొదటి ఐదు పేరాలను క్లుప్తంగా చర్చించండి; తరువాత తిరిగి వెళ్ళి, నిత్య జీవము కేవలమొక స్వప్నమేనా అనే ప్రశ్నకు జవాబిచ్చి, చర్చను కొనసాగించేందుకు అనుమతి తీసుకోండి. గృహ బైబిలు పఠనాన్ని నిర్వహించే ఆధిక్యత వల్ల వచ్చే ఆనందాన్ని నొక్కిచెప్పండి.

పాట 162 (18 sb29-TU) మరియు ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి