సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోవడమెలా
1 యెహోవా సేవలో సమృద్ధిగా చేయవలసి ఉండడం మనలను ఖాళీలేకుండా ఉంచుతుంది! (1 కొరిం. 15:58) వ్యక్తిగతంగాను కుటుంబంగాను పఠించవలసిన, ప్రతి రోజు బైబిలు చదవవలసిన, సంఘ కూటాల కొరకు సిద్ధపడవలసిన, హాజరు కావలసిన, ప్రాంతీయ పరిచర్యలో క్రమంగా పాల్గొనవలసిన అవసరతను మనం గుర్తిస్తాం. అధ్యక్షులకు మందను కాసే బాధ్యతలున్నాయి, వారు సంఘంలోని మిగతా బాధ్యతల ఎడల కూడా శ్రద్ధ వహిస్తారు. కొందరికి భారమైన కుటుంబ బాధ్యతలు లేదా ఇతరులకు విభిన్న బాధ్యతలున్నాయి. ప్రతిదీ సక్రమంగా జరిగేందుకు ప్రతి ఒక్కరికి సమతుల్యత మరియు మంచి వ్యక్తిగత సంస్థీకరణ అవసరం.
2 ప్రాముఖ్యమైనవాటిని తీర్మానించుకోండి: ‘మనం సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోవడంలోని’ సఫలత అనేది మన వివేచన మరియు మంచి తీర్మానంపై ఆధారపడి ఉంటుంది. (ఎఫె. 5:15, 16) మనం తప్పనిసరిగా “శ్రేష్ఠమైన కార్యము”లేవో తీర్మానించుకుని వాటిని మన ప్రాముఖ్యమైన వాటి పట్టికలో ప్రథమ స్థానాన ఉంచాలి. (ఫిలి. 1:10) ఒక దంపతులు తమ దైవపరిపాలనా గృహాన్ని ఈ విధంగా వర్ణించారు: “మేము మా జీవితాలను సత్యంతో నింపుకుంటాం . . . సత్యం మా జీవిత భాగం కాదు, అదే మా జీవితమై ఉంది. మరి వేరే ఏదైనా దానిపైనే కేంద్రీకరించబడి ఉంటుంది.” యెహోవా ఆరాధనను మరియు సేవను ఒకరి జీవితంలో మొదట ఉంచడం చాలా ప్రాముఖ్యం.
3 సమయాన్ని వృథా చేసే వాటిని గుర్తించండి: వారంలో 168 గంటలు ఉన్నాయి, మనకు లభించే సమయాన్ని మనం జ్ఞానపూర్వకంగా ఉపయోగించుకోవలసిన అవసరం ఉంది. దైవపరిపాలనా కార్యకలాపాలకు కావలసినంత సమయం ఉండేందుకు మనం సమయాన్ని వృథా చేసేవాటిని గుర్తించి, తగ్గించుకోవాలి. ఒక సర్వే బయల్పరచినదేమంటే అమెరికాలోని సగటు వయోజనుడు వారానికి 30 కన్నా ఎక్కువ గంటలు టి.వి. చూస్తూ గడుపుతాడు! ఇతరుల విషయానికొస్తే లౌకిక సాహిత్యాన్ని చదవడంలో ఎక్కువ సమయం ఉపయోగించబడుతుంది. తాము సమయాన్ని సామాజిక కార్యకలాపాలకు, అలవాట్లకు, వినోదానికి, లేదా ఏదో ఒక రకమైన కంప్యూటర్ కార్యకలాపాలకు పరిమితి లేకుండా వెచ్చిస్తున్నారని కొందరు కనుగొనవచ్చు. మనం మన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో చూసేందుకు మన దిన చర్యను మనం నిశితంగా పరిశీలించవలసిన అవసరం ఉండవచ్చు. ప్రాముఖ్యం కాని కార్యకలాపాలకు మనం అనుమతించే సమయానికి మనం హద్దులను పెట్టుకోవడం బుద్ధిపూర్వకమైన పని.
4 మంచి దినచర్యను వృద్ధిచేసుకోవడం: మన వ్యక్తిగత పరిస్థితులేవైనప్పటికీ, మనలో ప్రతి ఒక్కరం అత్మీయ అన్వేషణల కొరకు సమయాన్ని ఉపయోగించుకోగలుగుతాము. కొంత పెందలకడనే నిద్ర మేల్కోవడం మరింత సాధించేందుకు తోడ్పడుతుందని కొందరు కనుగొన్నారు. మనం ఉద్యోగం కొరకు రాకపోకలు జరిపేందుకు లేదా ఇతరుల కొరకు ఎదురు చూస్తూ ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నట్లయితే మనం దానిలో కొంత సమయాన్ని బైబిలును చదవడానికి కూటాల కొరకు సిద్ధపడడానికి లేదా సొసైటీ ఆడియో కాసెట్లలో ఇచ్చిన సమాచారాన్ని వినడానికి ఉపయోగించవచ్చు. కలిసి పఠించేందుకు క్రమంగా ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించడం ద్వారా కుటుంబాలు గొప్ప ప్రయోజనం పొందుతాయి. కుటుంబంలోని ప్రతి సభ్యుడు కుటుంబ అధ్యయనానికి వచ్చేటప్పుడు సమయాన్ని పాటించేటట్లయితే, అందరికి కొంత సమయం ఆదా అవుతుంది.
5 ఒక్కో రోజు గడుస్తున్న కొలది, “కాలము సంకుచితమై యున్నది” అని మరింత కచ్చితంగా మనం తెలుసుకోవాలి. (1 కొరిం. 7:29) మన జీవితాలు మిగిలి ఉన్న మన విలువైన సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటాం అనే దానిపై ఆధారపడి ఉన్నాయి. మనం రాజ్యాసక్తులను మొదట ఉంచగల్గేలా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మనం ఆశీర్వదించబడతాం!—మత్త. 6:33.