మేలైన ఒక సువార్తను ప్రచురించడం
1 కావలికోట 117 సంవత్సరాలుగా బైబిలు సత్యాన్ని సమర్థించేదిగా పని చేసింది. ప్రస్తుతం ప్రతి సంచిక 125 భాషల్లో 1,89,50,000 ప్రతులు ముద్రించబడుతున్నాయి. తేజరిల్లు! కూడా దేవుని వాక్యాన్ని చాలా కాలంగా బోధిస్తోంది, అది ఇప్పుడు 80 భాషల్లో ప్రచురించబడి 1,57,30,000 ప్రతులు పంపిణీ చేయబడుతున్నాయి.—కొలొస్సయులు 1:23 పోల్చండి.
2 పత్రికలు ఆత్మీయ అవసరతను తీరుస్తున్నాయి: కావలికోట, తేజరిల్లు!లు లక్షలాది మంది యథార్థ హృదయులైన ప్రజల ఆత్మీయ అవసరతను తీర్చేందుకు సహాయపడుతూ వారికి ప్రయోజనాన్ని చేకూర్చాయి. విశ్వాసాన్ని బలపరచే శీర్షికలు ప్రచురించబడ్డాయి. ఉదాహరణకు ఫిబ్రవరి 1, 1996 కావలికోటలో యెహోవాయందు ఆయన వాక్యమందు నమ్మకముంచవలసిన అవసరతను గూర్చిన విషయాన్ని మనం పఠించాం. మార్చి 1, 1996 సంచిక కావలికోట సంచిక యెహోవా సేవలో ఖాళీ లేకుండా ఉండాలని, ఆయన యందు నిరీక్షణ ఉంచుకోవాలని మనలను ప్రోత్సహించింది. జెఫన్యా ప్రవచనాన్ని గూర్చిన విశదమైన చర్చ ఎంత ప్రేరణాత్మకంగా ఉండిందో! తర్వాత మార్చి 15, 1996 కావలికోటలో క్రైస్తవ యథార్థతను గూర్చిన విశ్వాసాన్ని బలపరచే చర్చ ఉండింది. మే 15, 1996 సంచిక క్రమంగా దేవుని వాక్యాన్ని చదవవలసిన పఠించవలసిన దాని విలువను నొక్కి చెప్పింది. ఈ శీర్షికలు దేవుని వాక్యాన్ని గూర్చి మనం లోతైన అవగాహనను పొందేందుకు సహాయపడ్డాయి, ఆయన రాజ్యము ఎడలగల మన మెప్పుదల అధికమైంది.
3 అంతేకాక, దైవిక ప్రవర్తన, క్రైస్తవ నైతికతలు, మరియు అత్యంత ప్రాముఖ్యమైన ఇతర అంశాలపై కాలోచితమైన, ప్రయోగాత్మకమైన శీర్షికలు ఈ పత్రికల్లో ఉన్నాయి. అవి మన జీవితాలను ప్రభావితం చేసే నిజమైన వివాదాంశాలను గంభీరంగా చర్చిస్తాయి. దాని ఫలితంగా, భవిష్యత్తులో ఇంకా శ్రేష్ఠమైన దేవుని వాగ్దానాల నెరవేర్పు కొరకు ఎదురు చూస్తుండగానే శ్రేష్ఠమైన జీవితాన్ని మనమిప్పుడే ఆస్వాదిస్తున్నాం.—యెష. 48:17; 1 తిమో. 6:19.
4 తేజరిల్లు! ప్రతి సంచికలోని 4వ పేజీలో చెప్పబడిన దానిని క్లుప్తంగా పునఃసమీక్షించడం అన్నిచోట్ల ఉన్న ప్రజలకు యౌవనులకు వృద్ధులకు ఒకేలా చదివేందుకు చక్కని సమాచారంగా ఈ పత్రికను సిఫారసు చేయడానికి మనకు మంచి కారణాన్నిస్తుంది. అది ఇలా చెబుతుంది: “తేజరిల్లు! కుటుంబమంతటికీ జ్ఞానోదయం కల్గించేందుకే. నేటి సమస్యలను ఎలా ఎదుర్కోవచ్చో ఇది చూపిస్తుంది. వార్తలను నివేదిస్తుంది, అనేక దేశాల్లోని ప్రజల గురించి చెబుతుంది, మతాన్ని విజ్ఞానశాస్త్రాన్ని పరిశీలిస్తుంది. కానీ ఇది అంతకన్నా ఎక్కువే చేస్తుంది. ఇది విషయాలను లోతుగా పరిశీలించి, ప్రస్తుత సంఘటనల వెనుకనున్న అసలు భావాన్ని సూచిస్తుంది. అయినా, ఇది రాజకీయంగా ఎల్లప్పుడూ తటస్థంగా ఉంటూ, ఒక జాతిని మరో జాతికంటే ఎక్కువగా ఘనపర్చదు. అతి ప్రాముఖ్యంగా, ఈ పత్రిక ప్రస్తుత దుష్ట అరాచక విధానం స్థానంలో రానున్న శాంతిభద్రతలతో కూడిన ఒక నూతనలోకాన్ని గూర్చిన సృష్టికర్త వాగ్దానమందు నమ్మకాన్ని దృఢపరుస్తుంది.”
5 ఇతరులతో పత్రికలను పంచుకోండి: కావలికోట, తేజరిల్లు!లను పంపకం చేసే అవకాశాలను గూర్చి అప్రమత్తంగా ఉండండి. (1 తిమోతి 6:18 పోల్చండి.) మీరు కలిసే ప్రతి ఒక్కరికి ప్రతిపాదించేగల్గేలా లభ్యమయ్యే ప్రతులను దగ్గర ఉంచుకోండి. (ప్రసం. 11:6) యౌవనులైన మరియు క్రొత్తవారైన ప్రచారకులతో సహా మనమందరం ఈ నెలలో ప్రస్తుత సంచికల్లో ఇవ్వబడిన కాలోచిత శీర్షికల ఆధారితమైన క్లుప్త అందింపులను ఉపయోగిస్తూ పత్రికలను పంపకం చేయడంలోను, చందాలను ప్రతిపాదించడంలోను పూర్తి భాగాన్ని కలిగి ఉండగలం. వాటిలో ఉన్న విషయాలను గూర్చి బాగా పరిచయాన్ని పొంది, వాటిని యథార్థంగాను, నమ్మకంతోను ప్రతిపాదించండి.
6 కావలికోట, తేజరిల్లు!లలో ప్రతి వ్యక్తికి అవసరమైన సమాచారం ఉంది. త్వరలోనే మేలైనది రానున్నదన్న మంచి వార్తను తెలుసుకోవడానికి ఇతరులకు మనం సహాయపడగల మార్గాల్లో ఒకటి వాటిని పంపకం చేయడమే!