నిత్యజీవానికి నడిపించే జ్ఞానాన్ని వ్యాప్తి చేయుట
1 “మనుష్యులకు తెలివి (“జ్ఞానము,” NW) నేర్పువాడు” యెహోవాయే. (కీర్త. 94:10) ఆయనను అంగీకారయుక్తంగా సేవచేయడం ఎలాగో ఎరగని వారికి ఆయన గురించిన జీవరక్షక జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి మనలను ఉపయోగించుకుంటాడు. చక్కని బోధనా ఉపకరణమైన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకం ద్వారా యథార్థహృదయులు ఆయన లిఖిత వాక్యమగు బైబిలు నుండి దేవుని గురించిన కచ్చితమైన అవగాహనను పొందగలరు. (1 తిమో. 2:3, 4) జ్ఞానము పుస్తకం సత్యాన్ని స్పష్టంగా, తర్కబద్ధంగా విశదపరచడమన్నది యెహోవా ప్రజలకు ఏమి బోధించాలని కోరుకుంటున్నాడో దాన్ని గ్రహించడానికి వారికి సహాయం చేస్తుంది. అందువలన, మనం పరిచర్యలో పాల్గొనేటప్పుడు ఈ పుస్తకం ప్రతులు అనేక భాషల్లో మన దగ్గర ఉండాలి. ఈ పుస్తకాన్ని చదవాలని కోరుకునేలా చేసే సంభాషణలలో ప్రజలను ఇమడ్చాలని ఈ నెల మనం కోరుకుంటాము. ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి. వీటిని కంఠస్థం చేయడానికి ప్రయత్నం చేసే బదులు, మీ స్వంత మాటలలో, సహజంగా సంభాషించే పద్ధతిలో ముఖ్యాంశాలను వ్యక్తం చేయడానికి ప్రయత్నించండి.
2 అనేకమంది తమ ప్రియమైన వారిని మరణంలో కోల్పోయారు గనుక, మీరు మొదట ఇలా చెప్పడం ద్వారా పునరుత్థాన నిరీక్షణను సంభాషణలోకి చొప్పించవచ్చు:
◼ “మనలో అనేకమంది మన ప్రియమైన వారిలో ఒకరిని మరణంలో కోల్పోయాము. అటువంటి వారిని మరలా చూడగలమా లేదాయని మీరెప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి.] మానవుని ఎడల దేవునికిగల తొలి సంకల్పంలో మరణం ఒక భాగం కాదు. మన ప్రియమైన వారు మరణం నుండి తప్పించబడగలరని యేసు రుజువు చేశాడు. [యోహా. 11:11, 25, 44 చదవండి.] ఇది శతాబ్దాల క్రితం జరిగినప్పటికీ, దేవుడు మనకొరకు ఏమి చేస్తానని వాగ్దానం చేశాడో దాన్ని అది ప్రదర్శిస్తుంది. [జ్ఞానము పుస్తకాన్ని 85వ పేజీలోని చిత్రానికి త్రిప్పి, క్యాప్షన్‌ను చదవండి. తరువాత 86వ పేజీలోని చిత్రాన్ని చూపించి, దానిపై వ్యాఖ్యానించండి.] పునరుత్థానాన్ని గూర్చిన ఈ ఓదార్పుకరమైన నిరీక్షణ గురించి మీరు మరెక్కువ చదవాలనుకుంటే, నేను ఈ పుస్తకాన్ని మీకిచ్చి వెళ్లడానికి సంతోషిస్తాను.”
3 పునరుత్థాన నిరీక్షణ గూర్చిన తొలి చర్చ తరువాత, మీరు అదే వ్యక్తితో తరువాతి సంభాషణను ఇలా అంటూ ప్రారంభించవచ్చు:
◼ “మానవుని ఎడల దేవునికిగల తొలి సంకల్పంలో మరణం ఒక భాగం కాదు అని నేను చెప్పడం మీకు గుర్తుండే ఉంటుంది. ఒకవేళ అదే సత్యమైతే, మనము ఎందుకు వృద్ధులమై చనిపోతున్నాము? కొన్ని తాబేళ్లు 100 సంవత్సరాలకు పైగా జీవిస్తాయి, అంతేగాక వేలాది సంవత్సరాలుగా జీవిస్తున్న కొన్ని వృక్షాలు ఉన్నాయి. మానవులు 70 లేక 80 సంవత్సరాలు మాత్రమే ఎందుకు జీవిస్తారు? [ప్రతిస్పందించనివ్వండి.] మొదటి మానవజత దేవునికి అవిధేయులయ్యారు గనుకనే మనం చనిపోతున్నాము.” రోమీయులు 5:12 చదవండి. జ్ఞానము పుస్తకంలో 53వ పేజీకి త్రిప్పి, అధ్యాయం పేరు చదవండి. ముద్రిత ప్రశ్నలకు జవాబులను చూపిస్తూ మొదటి మూడు పేరాలు పరిశీలించండి. మిగతా అధ్యాయాన్ని చర్చించడానికి తరువాత తిరిగి వెళ్లడానికి ఏర్పాటు చేసుకోండి. ఈలోగా అధ్యాయాన్ని పూర్తిగా చదవమని ఆ వ్యక్తిని ప్రోత్సహించండి.
4 దైవభక్తి ఉన్నట్లుగా కనిపించిన వ్యక్తితో మాట్లాడినప్పుడు, మీరిలా అనవచ్చు:
◼ “అక్షరార్థంగా నేడు వందలకొలది విభిన్న మతాలున్నాయి. అవి అన్ని రకాల విరుద్ధమైన విశ్వాసాలను బోధిస్తాయి. కొంతమంది అన్ని మతాలు మంచివే, మనమేమి విశ్వసిస్తామనేది అంత ప్రాముఖ్యం కాదు అని అంటారు. మీ అభిప్రాయమేమిటి? [ప్రతిస్పందించనివ్వండి.] ఒకే ఒక్క సత్యమైన మతం ఉందని యేసు చెప్పాడు, అనేక రకాల ఆరాధన దేవునికి అనంగీకృతమని ఆయన చూపించాడు. [మత్తయి 7:21-23 చదవండి.] మనం దేవున్ని ప్రీతిపర్చాలనుకుంటే, ఆయన చిత్తానికి అనుగుణ్యంగా మనమాయనను ఆరాధించాలి.” జ్ఞానము పుస్తకాన్ని 5వ అధ్యాయానికి తెరిచి శీర్షికను, కొన్ని ఉపశీర్షికలను చదవండి. దేవున్ని ప్రీతిపర్చడమెలాగో నేర్చుకోవడానికి ఈ సమాచారం సహాయం చేస్తుందని వివరించండి. రూ. 15 చందాకు పుస్తకాన్ని అందించండి.
5 మీ పునర్దర్శనంలో, అన్ని మతాలున్నందుకు గందరగోళంలో పడిపోయే ప్రజలు ఈ ప్రశ్నకు ఇచ్చే జవాబు ఎడల మెప్పుదలను కనుపర్చవచ్చు:
◼ “నేడు అన్ని రకాల మతాలు ఉనికిలో ఉన్నందున, సరైనది ఏదో మనమెలా చెప్పగలము? మీరు దేని కొరకు చూస్తారు? [ప్రతిస్పందించనివ్వండి.] తన నిజమైన అనుచరులను ఎలా గుర్తించాలో యేసు మనకు చెప్పాడు.” యోహాను 13:35 చదవండి. జ్ఞానము పుస్తకంలో 5వ అధ్యాయంలోని 18, 19 పేరాలను పరిశీలించండి. ఈ లేఖనాధార నిర్దేశక సూత్రాలను ఉపయోగించడం ద్వారా, కొన్నింటిని తొలగించడం ద్వారా ఒక వ్యక్తి సత్య మతాన్ని గుర్తించగలడు. యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛమైన ప్రేమకు, అత్యున్నత నైతిక ప్రమాణాలకు ఎలా పేరెన్నికగన్నారో వివరించండి. జ్ఞానము పుస్తకాన్ని ఉపయోగిస్తూ చేసే బైబిలు పఠనం దేవుడు అంగీకరించే విధమైన ఆరాధనను స్పష్టంగా ఎలా గుర్తిస్తుందో వివరించండి.
6 తల్లినిగాని, తండ్రినిగాని కలిసినప్పుడు మీరు వారిని సమీపించి ఈ విధంగా చెప్పడం ప్రభావవంతంగా ఉండవచ్చు:
◼ “నైతిక విలువలంటూ ఏమాత్రం లేవన్నట్టుగా ఉండే అనేకమంది యౌవనుల అవిధేయ ప్రవర్తనను గురించిన నివేదికలను మనం ప్రతిదినం వింటుంటాము. పిల్లలకు మంచీ చెడుల మధ్య వ్యత్యాసాన్ని బోధించనందుకు పాఠశాల వ్యవస్థను నిందించాలని కొంతమంది పెద్దవారు అనుకుంటారు. ఈ శిక్షణను ఎవరు అందించాలని మీరు అనుకుంటారు? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ ప్రశ్నపై బైబిలు ఏమి చెబుతుందో వినండి. [ఎఫెసీయులు 6:4 చదవండి.] నైతిక విలువలను పిల్లల మనస్సులలో నాటవలసిన బాధ్యత తలిదండ్రులది అని అది మనకు చెబుతుంది.” జ్ఞానము పుస్తకాన్ని 145వ పేజీకి త్రిప్పి, 16వ పేరాను చదివి, 147వ పేజీలోని చిత్రాలపై వ్యాఖ్యానించండి. ఆ పుస్తకం కుటుంబమంతా పఠించడానికి రూపొందించబడిందని వివరించండి. 146వ పేజీలోని 17, 18 పేరాలను ఉపయోగిస్తూ, కుటుంబాలతో అటువంటి పఠనాన్ని మనం ఎలా నిర్వహిస్తామో మీరు ప్రదర్శిస్తారని ప్రతిపాదించండి.
7 ఆందోళన చెందుతున్న తల్లి లేక తండ్రితో తొలి సందర్శనంలో మీరు పఠనాన్ని ప్రారంభిస్తే, పునర్దర్శనంలో ఇలా చెబుతూ దాన్ని కొనసాగించవచ్చు:
◼ “నేటి లోకం మన యౌవనుల ముందు అనేకమైన ప్రలోభాలను పెడుతుంది. వారు పెరుగుతున్నకొద్దీ దైవభయంగల వారిగా తయారవ్వడం వారికి కష్టమౌతుంది. మనం క్రితంసారి జరిపిన చర్చలో రెండు సూత్రాలను ప్రత్యేకపరిచామని బహుశ మీకు గుర్తుండే ఉంటుంది. దైవిక తలిదండ్రులుగా మనం మన పిల్లలకు మంచి మాదిరినుంచాలి, వారికొరకైన మన ప్రేమను తరచూ వ్యక్తం చేయాలి. తమ తలిదండ్రుల నుండి పిల్లలకు అవసరమైన ఇంకొక విషయాన్ని గురించి బైబిలు చెబుతుంది.” సామెతలు 1:8 చదవండి. జ్ఞానము పుస్తకాన్ని 148వ పేజీకి త్రిప్పి 19-23 పేరాలలో పఠనాన్ని కొనసాగించండి. మీరు తిరిగి వచ్చి కుటుంబమంతటితో ఒకటవ అధ్యాయం నుండి పఠనం మొదలుపెడతారని సూచించండి.