దినదినము మన ప్రమాణమును నెరవేర్చుట
1 “దినదినము నా మ్రొక్కుబడు [ప్రమాణము]లను నేను చెల్లించునట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను” అని కీర్తనల గ్రంథకర్తయైన దావీదు యెహోవాకు ప్రకటించడానికి కదిలింపబడ్డాడు. (కీర్త. 61:8) ప్రమాణాన్ని చేయడం పూర్తిగా ఒక స్వచ్ఛందమైన విషయమని దావీదుకు తెలుసు. అయితే, తానొక ప్రమాణం చేసి ఉంటే దానిని నెరవేర్చేందుకు తాను బద్ధుడై ఉన్నాడన్నదానిని కూడా ఆయన గుణగ్రహించాడు. అయినా, దినదినము ప్రమాణాలను నెరవేర్చేందుకు తనకుగల అవకాశాన్నిబట్టి ఆయన యెహోవాను స్తుతించాడు.
2 మనల్ని మనం యెహోవాకు సమర్పించుకున్నప్పుడు, ఆయన చిత్తాన్ని చేస్తామని ఇష్టపూర్వకంగా ప్రమాణము చేశాము. మనలను మనం ఉపేక్షించుకుని, యెహోవాకు సేవ చేయడాన్ని మన జీవితంలోని ప్రాథమిక లక్ష్యంగా మనం చేసుకున్నాము. (లూకా 9:23) కనుక, మనం కూడా మన ప్రమాణాన్ని దినదినం తప్పక నెరవేర్చాలి. (ప్రసం. 5:4-6) “మనుష్యుడు . . . రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును” అని మనకు తెలుసు కనుక, నీటి బాప్తిస్మం సమయంలో మనం చేసిన బహిరంగ ప్రకటన మన జీవన రీతియంతటిలో స్పష్టమవ్వాలి. (రోమా. 10:10) ఇందులో సువార్తను ప్రకటించడం ఇమిడి ఉంది. (హెబ్రీ. 13:15) వ్యక్తిగత పరిస్థితులు చాలా వేరుగా ఉంటాయి, కానీ దినదినము ఇతరులతో సువార్తను పంచుకోవాల్సిన ప్రాముఖ్యతపై మనమందరం అవధానాన్ని కేంద్రీకరించగలము.
3 ప్రతిదినము ప్రకటించే అవకాశాలను కలుగజేసుకోండి: మరొకరితో సువార్తను పంచుకోవడం ఒక ఆనందభరితమైన అనుభవం. దీన్ని ప్రతిదినం చేయడానికి, పరిస్థితులు అనుమతించినప్పుడల్లా ప్రకటించే అవకాశాలను మనం కలుగజేసుకోవాలి. పనిస్థలంలోని లేక పాఠశాలలోని వ్యక్తులకు, పొరుగువారికి లేక ప్రతిదినం కలిసే ఇతరులకు అనియతంగా సాక్ష్యమిచ్చేందుకు చొరవ తీసుకున్నవారు అనేక సంతోషకరమైన అనుభవాలను పొందారు. ఉత్తరాలు వ్రాయడం లేక టెలిఫోను ఉపయోగించడం కూడా ఇతరులకు సాక్ష్యమివ్వడానికి ఒక మార్గం కాగలదు. ఈ మార్గాలన్నింటి నుండి, అలాగే ఇంటింటి సాక్ష్యమివ్వడానికి, పునర్దర్శనాలు చేయడానికి సమయాన్ని క్రమంగా వేరుగా పెట్టడం వంటివాటి నుండి ప్రయోజనం పొందడం ఒక గృహ బైబిలు పఠనం నిర్వహించడంవల్ల వచ్చే ప్రత్యేక సంతోషానికి నడపగలదు. అవును, ప్రతిదినం ప్రకటించడానికి మనం అవకాశాలను సృష్టించుకోవడం సాధ్యం కావచ్చు.
4 ఒక సహోదరి తన పని విరామ సమయంలో ప్రతిదినము లేఖనములను పరిశీలించుట అనే పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టింది. తనతోపాటు దిన వచనాన్ని చదవమని ఒక సహోద్యోగిని ఆమె ఆహ్వానించింది, మరి అది త్వరలోనే ఆ స్త్రీతో బైబిలు పఠనం చేయడానికి నడిపింది. వారు ప్రతిరోజు అరగంట చొప్పున, వారానికి ఐదు రోజులు పఠించారు. ఇంకొక సహోద్యోగి వారి దైనందిన పఠనాన్ని గమనించాడు. చివరికి ఆయన తనను తాను ఒక నిష్క్రియుడైన సహోదరుడని తెలుపుకున్నాడు. సహోదరి పట్టుదలనుబట్టి కదిలింపబడి, ఆయన తిరిగి క్రియాశీలునిగా అయ్యేందుకు ఒక పెద్దను సంప్రదించాడు. దినదినం తన ప్రమాణాన్ని నెరవేర్చడంలో కొనసాగినందుకు ఈ సహోదరి వేరే ఇద్దరి జీవితాలను సకారాత్మక రీతిలో ప్రభావితం చేసింది.
5 యెహోవా మన కొరకు చేసిన మంచి విషయాలన్నింటి ఎడల మెప్పుదలతో ఉప్పొంగే హృదయంచే మనం పురికొల్పబడినప్పుడు, ప్రతిదినం మనకు వీలైనంత శ్రేష్ఠమైన రీతిలో మన సమర్పణ ప్రమాణాన్ని నెరవేర్చడం మనకు సంతోషాన్ని, సంతృప్తిని తెస్తుంది. “[ఓ యెహోవా] నా పూర్ణహృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామమును నిత్యము మహిమపరచెదను” అని కీర్తనల గ్రంథకర్త వలె మనం ప్రకటించగలము.—కీర్త. 86:12.