సత్యాన్ని గూర్చి మాట్లాడుతూనే ఉండండి
1 “మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని” అపొస్తలులు ప్రకటించారు. (అపొ. 4:20) నేడు మనం కూడా సత్యాన్ని మాట్లాడుతూ ఉండాలి. వినేవారిని కనుగొనేందుకు కావలికోటను, తేజరిల్లు!ను అందించడం ఒక మార్గమైనప్పటికీ, ఆసక్తిగలవారికి మరి ఎక్కువగా బోధించాలంటే మనం తప్పనిసరిగా తిరిగి వెళ్ళాలి.
2 “యుద్ధాలు ఇక ఎన్నడూ లేనప్పుడు” అనే అంశం గల ప్రత్యేక మే “తేజరిల్లు!”ను అందించిన చోటకు తిరిగి వెళ్ళినప్పుడు, ఈ విధంగా అడుగుతూ మీరు బైబిలు పఠనాన్ని ఆరంభించవచ్చు:
◼ “క్రితం వచ్చినప్పుడు దేశాల మధ్య జరిగే యుద్ధాలను, వాటిలో మతం పాత్రను గూర్చి మనం మాట్లాడాం. బైబిలు పిలుస్తున్న అంత్యదినాల్లో మనం జీవిస్తున్నామని అలాంటి సంఘటనలు స్పష్టంగా రుజువు చేస్తున్నాయని మీరు గుర్తించారా? [జ్ఞానము అనే పుస్తకాన్ని చూపించండి. 11వ అధ్యాయంలోని మొదటి పేరాను చదివి, 102వ పేజీలోని బాక్సును ఉన్నతపరచండి.] విషయసూచికలో ఇవ్వబడిన మిగతా 18 విషయాలతోపాటు ఈ విషయాన్ని కూడా ఈ పుస్తకం వివరిస్తుంది. [3వ పేజీని చూపించండి.] మీరనుమతిస్తే, ఈ ప్రాముఖ్యమైన బైబిలు విషయాలను గూర్చిన అవగాహనను పొందేందుకు మీకు ఈ పుస్తకం ఎలా సహాయపడుతుందో చూపిస్తాను.” అనుమతిస్తే, 6వ పేజీలో పఠనాన్ని ఆరంభించండి.
3 తిరిగి వచ్చి, భద్రతగల జీవితాన్ని ఇప్పుడే అనుభవించడం ఎలా సాధ్యమో వివరిస్తానని మీరు మాటిచ్చినట్లయితే మీరు ఈ విధంగా చెప్పవచ్చు:
◼ “మనం మొదట కలిసినప్పుడు, మానవ భవిష్యత్తును గూర్చి ఆశావాదాన్ని కలిగి ఉండేందుకు కారణాలనిచ్చే ఒక భాగాన్ని బైబిలు నుండి మీకు చూపించాను. ఇప్పుడే మనకు భద్రతా భావాన్నివ్వగల వారెవరనే విషయాన్ని ఈరోజు మీ దృష్టికి తేవాలని ఇష్టపడుతున్నాను.” కీర్తన 4:8 చదవండి. జ్ఞానము పుస్తకంలోని 168వ పేజీని తీసి 19వ పేరాను చదవండి. “మీ జీవితంలో మీరు కూడా ఈ రకమైన భద్రతను ఎలా కనుగొనవచ్చో స్పష్టంగా చూపించే ఉచిత బైబిలు పఠనాన్ని కలిగి ఉండడంలో ఆనందిస్తారా?” అని అడగండి. జవాబు అవును అయినట్లయితే, 1వ అధ్యాయానికి వెళ్ళండి.
4 పనిస్థలంలో నిజాయితీ అవసరతను గూర్చి మొదట చర్చించినట్లయితే, పునర్దర్శనంలో మీరు ఈ విధంగా ప్రయత్నించవచ్చు:
◼ “పనిస్థలంలో నిజాయితీ ప్రాముఖ్యతను గూర్చి మనం మాట్లాడామని మీకు గుర్తుండవచ్చు. లూకా 16:10 నందు యేసు చెప్పిన మాటలు కూడా ఉద్యోగ విపణిలో ఒకరి భవిష్యత్తును ప్రభావితం చేయగలవు. [లేఖనంపై వ్యాఖ్యానం చెయ్యండి.] మత్తయి 4:4 నందు కనిపించే యేసు మాటలతో సహా ఆధునిక మనిషి కొరకు మరింత ఆచరణాత్మకమైన సలహా బైబిలులో ఉంది.” ఆ వచనాన్ని చదవండి. బైబిలును క్రమంగా పఠించవలసిన ప్రాముఖ్యతను చూపించండి. మొదటి దర్శనంలో చందా కట్టకపోతే, ఇప్పుడు చందాను లేదా జ్ఞానము పుస్తకంలో గృహ బైబిలు పఠనాన్ని ప్రతిపాదించండి.
5 మీరు ఈ విధంగా చెబుతూ పునర్దర్శనంలో నేరుగా ఒక పఠనాన్ని ప్రతిపాదించండి:
◼ “బైబిలు బోధిస్తున్న దానిని గూర్చి అన్నిచోట్ల ఉన్న ప్రజలకు తెలియజేసేందుకు మేము మా పత్రికలను ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్నాం. వ్యక్తులు తాము నేర్చుకునేవాటి విలువను గ్రహిస్తే, మేము ఒక ఉచిత గృహ బైబిలు పఠనాన్ని ప్రతిపాదిస్తున్నాము. [కావలికోట చివరి పేజీలోవున్న ‘మిమ్మల్ని సందర్శించడానికి ఇష్టపడతారా?’ అనే బాక్సును చూపించండి.] నిత్య జీవానికి నడిపించే జ్ఞానము అనే ఈ పుస్తకాన్ని మార్గదర్శిగా ఉపయోగిస్తాము. పఠనమెలా నిర్వహించబడుతుందో మీకు క్లుప్తంగా చూపిస్తాను.”
6 మనం సత్యాన్ని గూర్చి మాట్లాడుతూనే ఉన్నట్లయితే, విని అనుకూలంగా ప్రతిస్పందించే కొందరుంటారని మనం నమ్మకం కలిగి ఉండవచ్చు.—మార్కు 4:20.