“దినమంతా” యెహోవాను స్తుతించండి
1 రాజైన దావీదు యెహోవాకు చేసిన వాగ్దానం కీర్తన 145:2లో ఉంది: “అనుదినము [“దినమంతా,” NW] నేను నిన్ను స్తుతించెదను నిత్యము నీ నామమును స్తుతించెదను.” మన పరలోకపు తండ్రిని స్తుతించడానికి, సన్నుతించడానికి మనకు కూడా కారణముంది! “దినమంతా” యెహోవా సర్వాధిపత్యాన్ని ఉన్నతపర్చడంలో దావీదు ఉదాహరణను మనమెలా అనుకరించగలము?
2 యెహోవా ఎడల మెప్పుదలతో మన హృదయాలను నింపుకోవడం: దేవుని వాక్యాన్ని క్రమంగా పఠించడం యెహోవా మన కొరకు చేసిన, చేస్తున్న, ఇంకా చేయనైయున్నదాని ఎడల కృతజ్ఞతను అధికం చేస్తుంది. ఆయన అద్భుతమైన కార్యాల ఎడల మన మెప్పుదల పెరిగే కొలది, మనము ఆయన మంచితనం గురించి అంత ఎక్కువగా ప్రకటిస్తాము. (కీర్త. 145:7) ఉచితమైన ప్రతి సందర్భంలో మనం ఆతృతతో యెహోవాను స్తుతిస్తాము.
3 దైనందిన సంభాషణలో యెహోవాను స్తుతించండి: పొరుగువారితో, తోటి పాఠశాల విద్యార్థులతో, తోటి పనివారితో, మనం అనుదినం కలిసే మరితరులతో సంభాషించేటప్పుడు మన నిరీక్షణను వారితో పంచుకోవడానికి అవకాశాలను మనం కనుగొనవచ్చు. పొరుగు వ్యక్తి సమాజంలో నేరం గురించి చింతను వ్యక్తం చేయవచ్చు; ఒక తోటి పాఠశాల విద్యార్థి మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేక అనైతికత గురించి వ్యాకులపడుతుండవచ్చు; తోటి పనివాడు ఏదైనా రాజకీయ వివాదాంశం గురించి ఒక అభిప్రాయాన్ని తెల్పవచ్చు. ఇప్పుడు చేపట్టాల్సిన సరైన గమనం చూపిస్తూ, చివరికి ఈ సమస్యలకు పరిష్కారాన్ని చూపించే దేవుని వాక్యంలోని సూత్రాలను, వాగ్దానాలను మనం ఎత్తి చూపించవచ్చు. అటువంటి “సమయోచితమైన” మాటలు ఆశీర్వాదం కాగలవు!—సామె. 15:23.
4 యెహోవాను గూర్చి పూర్తి-కాలం మాట్లాడండి: యెహోవా ఎడల ప్రగాఢమైన మెప్పుదలగల వ్యక్తి వీలైనంతమందితో సువార్తను పంచుకోవాలని కోరుకుంటాడు. (కీర్త. 40:8-10) ఈ విషయంలో మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి, ‘నా పరిస్థితులు అనుమతించే దాన్నంతా నేను చేస్తున్నానా?’ కొన్ని సహేతుకమైన సర్దుబాట్లతో తాము క్రమ పయినీర్లు కాగలిగామని అనేకమంది కనుగొన్నారు. ఒకవేళ ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుమతించకపోతే, మనం సహాయ పయినీర్లుగా పేర్లు నమోదు చేసుకోగలమా?
5 యెహోవాను స్తుతించడంలో మనతో కలిసేలా క్రొత్తవారికి సహాయం చేయండి: యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణ యెహోవా ఎడల కృతజ్ఞత కలిగి ఉండడానికి, ఆయన నామాన్ని స్తుతించడానికిగల కారణాలను మనకు ఎల్లప్పుడు గుర్తు చేస్తుంది. యెహోవా రాచరికాన్ని గురించి బహిరంగంగా మాట్లాడడంలో మనతో కలవమని మన బైబిలు విద్యార్థులను ప్రోత్సహించేందుకు అది ప్రత్యేకంగా మంచి సమయం. నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకంలోని 173-5 పేజీలలో గల 7-9 పేరాలలో పేర్కొనబడినదానిపై ప్రార్థనాపూర్వకంగా నెమ్మదిగా ఆలోచించమని వారిని పురికొల్పండి. వారు అర్హులైతే, కేవలం అనుభవం లేనందువల్లే ప్రకటించకుండా ఉండడానికి వారికి ఏ కారణం లేదు. రాజ్య ప్రచార పని ఎలా చేయబడుతుందో వారికి చూపించడానికి సామర్థ్యంగల ప్రచారకులు అందుబాటులో ఉన్నారు. ఒకవేళ క్రొత్తవారు సువార్తను ప్రకటించడానికి ధైర్యాన్ని కూడగట్టుకుంటే, యెహోవా వారికి సహాయం చేస్తాడని వారు నమ్మకం కలిగి ఉండవచ్చు.—అపొ. 4:31; 1 థెస్స. 2:2.
6 దినమంతా యెహోవాను స్తుతించేందుకు ప్రయత్నించినప్పుడు మనం మన కొరకు, అలాగే ఇతరుల కొరకు నిత్య ప్రయోజనాలను తెస్తాము.