కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/96 పేజీ 2
  • జూన్‌లోని సేవా కూటాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూన్‌లోని సేవా కూటాలు
  • మన రాజ్య పరిచర్య—1996
  • ఉపశీర్షికలు
  • జూన్‌ 3తో ప్రారంభమయ్యే వారం
  • జూన్‌ 10తో ప్రారంభమయ్యే వారం
  • జూన్‌ 17తో ప్రారంభమయ్యే వారం
  • జూన్‌ 24తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—1996
km 6/96 పేజీ 2

జూన్‌లోని సేవా కూటాలు

జూన్‌ 3తో ప్రారంభమయ్యే వారం

పాట 181 (105)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేసిన ప్రకటనలు. దేశంలోని, స్థానిక సంఘంలోని ప్రాంతీయ పరిచర్య నెలసరి నివేదికపై వ్యాఖ్యానించండి.

15 నిమి: “వారి విశ్వాసాన్ని అనుకరించండి.” ప్రశ్నా జవాబులు. సెప్టెంబరు 15, 1991 కావలికోట, (ఆంగ్లం) నందలి 13వ పేజీలోని బాక్సులో చర్చించబడిన విశ్వాసానికి గల సాక్ష్యాలను సమీక్షించండి. అనేక సంవత్సరాలు తమ రాజ్య పనిని క్రమంగా కొనసాగించేందుకు వారికి ఏమి సహాయపడిందో తెలుసుకునేందుకు ఒకరిద్దరు ప్రచారకులను ఇంటర్వ్యూ చేయండి.

20 నిమి: “నిత్యజీవానికి నడిపించే జ్ఞానాన్ని వ్యాప్తి చేయుట.” (1-3 పేరాలు) 1వ పేరాను చర్చించండి. (జనవరి 15, 1996 కావలికోట నందలి 12-13 పేజీలు, 11-12 పేరాల నుండి వ్యాఖ్యానాలను చేర్చండి.) మన రాజ్య పరిచర్య వెనుక పేజీలోని క్రొత్త రూపం, పునర్దర్శనాలు చేయడానికి బాగా సిద్ధమై ఉండేందుకు మనకు సహాయపడేలా రూపుదిద్దబడింది. ఎక్కువ రోజులు వేచి ఉండే బదులు ఒకటి లేక రెండు రోజుల్లోపలే పునర్దర్శనం చేయడం తరచూ జ్ఞానయుక్తం కనుక, ఒకే సేవా కూటంలో ఇంటింటి దర్శనాల కొరకు, పునర్దర్శనాల కొరకు ఇవ్వబడిన అందింపులను మనం చర్చిస్తాము. 2, 3 పేరాలను క్లుప్తంగా సమీక్షించిన తర్వాత, ఒక్కోదానికి ఒక్కో ప్రదర్శన ఉంటుంది. మొదటి అందింపులో ప్రపంచవ్యాప్త పనికి విరాళాలెలా ఇవ్వవచ్చుననే దానిపై క్లుప్త వ్యాఖ్యానాలను చేర్చాలి. ఈ శీర్షికలోని మిగిలిన అందింపులు తరువాతి రెండు సేవా కూటాల్లో చర్చించబడతాయి.

పాట 143 (76), ముగింపు ప్రార్థన.

జూన్‌ 10తో ప్రారంభమయ్యే వారం

పాట 63 (32)

5 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్‌ రిపోర్ట్‌.

10 నిమి: “‘దినమంతా’ యెహోవాను స్తుతించండి.” ప్రశ్నా జవాబులు. సహాయ, క్రమ పయినీరు పనికి అనుకూల దృక్పథంతో ప్రోత్సాహాన్నివ్వండి.

10 నిమి: “నిత్యజీవానికి నడిపించే జ్ఞానాన్ని వ్యాప్తి చేయుట.” (4-5 పేరాలు) ఒక క్లుప్త ఉపోద్ఘాతం తరువాత, 4, 5 పేరాల్లో ఉన్న మొదటి దర్శనం కొరకైన అందింపులను పునర్దర్శనం కొరకైన అందింపులను ప్రదర్శించండి. జ్ఞానము పుస్తకాన్ని ఇచ్చిన చోటికెల్లా వెంటనే తిరిగి వెళ్ళాలని ప్రచారకులను ప్రోత్సహించండి.

20 నిమి: “జ్ఞానము పుస్తకంతో శిష్యులను చేసే పద్ధతి.” 1-2 పేరాల ఆధారంగా క్లుప్తమైన ప్రారంభ వ్యాఖ్యానాలను చేయండి. ప్రశ్నాజవాబులతో 3-11 పేరాలను చర్చించండి. ఇన్‌సర్ట్‌లోని మిగతా భాగం జూలై, ఆగస్టు నెలల్లోని సేవా కూటాల్లో పరిశీలించబడుతుందని వివరించండి. దానిని భద్రపరచుకోమని అందరినీ ప్రోత్సహించండి.

పాట 92 (51), ముగింపు ప్రార్థన.

జూన్‌ 17తో ప్రారంభమయ్యే వారం

పాట 157 (73)

10 నిమి: స్థానిక ప్రకటనలు.

15 నిమి: “స్నేహపూర్వకమైన సంభాషణలు హృదయాన్ని చేరుకోగలవు.” ప్రశ్నాజవాబులు. స్నేహపూర్వకంగా సమీపించడంవల్ల తాము ఎలా మంచి ప్రతిస్పందనను పొందారో చూపించే ప్రోత్సాహకరమైన అనుభవాలను వివరించమని ఒకరు లేక ఇద్దరు ప్రచారకులను ఆహ్వానించండి.

20 నిమి: “నిత్యజీవానికి నడిపించే జ్ఞానాన్ని వ్యాప్తి చేయుట.” (6-7 పేరాలు) 8వ పేరాను పరిశీలించి, పునర్దర్శనం చేయడంలోని లక్ష్యాలను నొక్కి తెల్పండి:ఆసక్తిని పెంపొందించండి, పఠనాన్ని ప్రారంభించండి, తిరిగి వెళ్లేందుకు స్పష్టమైన ఏర్పాట్లు చేసుకోండి. 6, 7 పేరాలలోని అందింపులను క్లుప్తంగా సమీక్షించిన తరువాత, పఠనాన్ని ఎలా ప్రారంభించవచ్చో చూపిస్తూ, ఒక్కొక్కటి ప్రదర్శించండి. జనవరి 15, 1996 కావలికోట నందలి 14వ పేజీలోని 17వ పేరాను చదవండి.

పాట 211 (66), ముగింపు ప్రార్థన.

జూన్‌ 24తో ప్రారంభమయ్యే వారం

పాట 6 (4)

5 నిమి: స్థానిక ప్రకటనలు.

8 నిమి: ప్రాంతీయ సేవలో పిల్లలకు శిక్షణనివ్వడం. ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం. చిన్న వయస్సు నుండి పిల్లలు మనతో సేవలో చురుకుగా ఉండాలి. వారు పొందే శిక్షణ, అనుభవం తరువాతి సంవత్సరాలలో వారి విశ్వాసానికి, ఆసక్తికి బలమైన ఆధారాన్ని ఇస్తాయి. పరిచర్యను గంభీరంగా తీసుకుని, సరిగా ప్రవర్తించవలసిన అవసరతను వారు గుణగ్రహించడం ప్రాముఖ్యం. పిల్లలు రౌడీ ప్రవర్తనను చేపట్టకూడదు; సేవ అంటే ఆడుకునే సమయం కాదు. వారు పెద్దలతో పనిచేయడం వారికి మంచిది. వారి సామర్థ్యాలనుబట్టి సువార్తను అందించడంలో పాల్గొనడానికి వారికి సహాయం చేయాలి. (ఆగస్టు 1, 1988 కావలికోట (ఆంగ్లం) నందలి 15వ పేజీలోని 20వ పేరా చూడండి.) పర్యవేక్షించే బాధ్యత తలిదండ్రులది; పిల్లలను పర్యవేక్షించడానికి ఒక పెద్ద మనిషి లేకుండా వారిని సేవ కొరకైన కూటాలకు పంపించకూడదు. పిల్లలు చక్కగా పని చేసినప్పుడు వారిని మెచ్చుకోండి.

12 నిమి: స్థానిక అవసరాలు. (లేక జనవరి 1, 1996 కావలికోట, 29-31 పేజీలలోని “సత్యవాక్యమును సరిగా ఉపదేశించుట” ఆధారంగా ఒక ప్రసంగం ఇవ్వండి.)

20 నిమి: “మరలా సేవ చేసేలా వారికి సహాయం చేయండి.” ఒక పెద్దచే ప్రసంగము, చర్చ. నిష్క్రియులను ప్రోత్సహించడానికి ఆగస్టు 1, 1992 కావలికోట (ఆంగ్లం) నందలి “మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీతట్టు తిరుగుదును” అనే శీర్షికను ఉపయోగించడాన్ని సూచించండి. కొన్ని ముఖ్య విషయాలను తెల్పండి.

పాట 71 (96), ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి