ఆసక్తి కనపర్చినవారిని వివేచనతో మరలా దర్శించండి
1 మనం ఇచ్చిన వార్తయందు ఆసక్తి కనపర్చిన వారిలో కొందరు సెలవు కార్యాల్లో తీరికలేకుండా ఉండే నెలే డిశంబరు. మరి ఇతరులనేకులు తమ అనుదిన కార్యాల్లో ఎల్లప్పుడూ బిజీగా ఉన్నట్లు కనిపిస్తారు. కనుక, ఆసక్తి కనపర్చినవారిని మరలా దర్శించినప్పుడు, మనం వివేచన కల్గివుండాలి మరి బహుశ ఎక్కువసేపు సంభాషించే కోరికను ఇంటివారు కనపర్చనంతవరకు అసలు విషయాన్ని త్వరగా చెప్పాల్సివుంటుంది.
2 మనం ఏమి మాట్లాడాలన్న విషయాన్ని గూర్చి ముందుగానే ఆలోచించండి: మనం చెప్పాలనుకుంటున్న విషయం మన మనస్సులో స్పష్టంగా ఉండాలి. అందుకు, మనం ముందు సందర్శించినప్పుడు వ్రాసుకున్న నోట్సును చూసుకుని, ఆ నాటి సంభాషణలో మాట్లాడిన విషయాలు మరియు ఇంటివారికి జవాబు చెప్పని ఏ ప్రశ్ననైనా జ్ఞాపకంచేసుకోవాల్సిన అవసరముంది.
3 యేసును విశ్వసిస్తున్నానని చెప్పుకునే వ్యక్తిని మరలా కలుస్తున్నట్లైతే మనం ఇలా చెప్పవచ్చు:
◼ “ఈ కాలంలో, క్రీస్తు పుట్టుకను గూర్చి అనేకమంది ప్రజలు ఆలోచిస్తున్నారు. మనం పోయినసారి మాట్లాడుకున్నప్పుడు, యేసుక్రీస్తు అందరికీ భిన్నంగా విశేషమైన వ్యక్తి అని నేను చెప్పాను. యేసు బేత్లెహేములో పుడతాడని 700 సంవత్సరాలకు పూర్వమే బైబిలు ప్రవచించిందని మీకు తెలుసా?” జవాబు చెప్పనివ్వండి. పిదప, మీకా 5:2 చదివిన తర్వాత మీరు ఇలా చెప్పవచ్చు: “అది అద్భుతమైన ప్రవచనం, కదండీ? ఇది ఆసక్తికరమైన బైబిలు వాస్తవమైనప్పటికీ, బైబిలు ప్రవచనాలు మన దినాల్లో కూడా నెరవేరుతున్నాయని మీకు తెలుసా?” ఆ వ్యక్తికి సమయం ఉంటే, మనం సంభాషణను కొనసాగించవచ్చు లేక ఆయన బిజీగా ఉంటే మనం తిరిగి సందర్శించి, దీన్ని ఆయనతో చర్చించవచ్చు.
4 “ఈ లోకం నిలుస్తుందా?” అన్న కరపత్రాన్ని, బైబిలు జ్ఞానమేలేని వ్యక్తికి ఇచ్చివున్నట్లైతే, మనం ఈ క్రింది విధంగా చెప్పవచ్చు:
◼ “3వ పేజీలో ‘సూచన’ అనే ఉపశీర్షిక క్రింద ఏమి చెప్పారో గమనించండి. ఇవి, ప్రస్తుత లోకపు అంత్యదినాలను సూచించేవని యేసు చెప్పిన ప్రవచనాలకు సంబంధించినవి. [ఇంటివారితో రెండు లేక మూడు ప్రవచనాలను పరిశీలించండి.] మన దినాల్లో ఈ ప్రవచనాలు నెరవేరుతున్నాయనేందుకు రుజువుందని మీరంటారా?” నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని గానీ లేక మహాగొప్ప మనిషి అనే పుస్తకాన్ని గానీ తీసుకోమని ఇంటివారిని మీరు కోరవచ్చు. నిరంతరము జీవించగలరు అనే పుస్తకంలోని 18వ అధ్యాయం లేక మహాగొప్ప మనిషి పుస్తకంలోని 111వ అధ్యాయం యేసు ఇచ్చిన సూచనల సంబంధంగా మరిన్ని వివరాలను ఎలా అందిస్తుందో చూపించండి.
5 ఓ గృహ బైబిలు పఠనాన్ని ప్రతిపాదించడం: మనం మహాగొప్ప మనిషి అనే పుస్తకాన్ని ఇంటివారికి ఇచ్చినట్లైతే లేక ఆయనకు అప్పటికే ఒక ప్రతి ఉన్నట్లైతే, 111వ అధ్యాయాన్ని ఉపయోగించి గృహ బైబిలు పఠనాన్ని ఎలా చేస్తారో ప్రదర్శించడం మంచిది. సంఘ పుస్తక పఠనంలో ఉపయోగించే అదే పద్ధతిని మనం ఉపయోగించవచ్చు. పఠనం పురోగమిస్తున్నట్లైతే, ఏదోక బ్రోషూర్ను పఠించవచ్చు లేక నిరంతరము జీవించగలరు అన్న పుస్తకం నుండే పఠించవచ్చు.
6 ఆసక్తి కనపర్చబడినప్పుడల్లా మనం తిరిగి దర్శించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందాము. ప్రతి సంభాషణాంతంలోనూ ఆసక్తికరమైన ప్రశ్నలను వేస్తూ భవిష్యత్ సందర్శనాలకు త్రోవను సరాళం చేసుకునేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. ఇది మనం “ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు” సహాయపడుతుంది.—2 తిమో. 3:17.