కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/95 పేజీ 7
  • క్షేమాభివృద్ధి కలుగజేయండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్షేమాభివృద్ధి కలుగజేయండి
  • మన రాజ్య పరిచర్య—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆధ్యాత్మిక సంభాషణ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • క్షేమాభివృద్ధికరంగా, అనుకూలంగా మాట్లాడడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • పరిచర్యలో ఉన్నప్పుడు ఒకరినొకరు ప్రోత్సహించుకోండి
    మన రాజ్య పరిచర్య—2008
  • మన విశ్వాసానికి సద్గుణాన్ని ఎలా అమర్చవచ్చును?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1995
km 7/95 పేజీ 7

క్షేమాభివృద్ధి కలుగజేయండి

1 మనం “అపాయకరమైన కాలములో” జీవిస్తున్నాం గనుక మనందరికీ ప్రోత్సాహం అవసరం. (2 తిమో. 3:1) తన దినాల్లో కూడా దీని అవసరతను బాగా గ్రహించిన వాడై, తన సహోదరుల సహవాసాన్ని బట్టి “ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణపొందవలెనని” పౌలు ఎంతగానో అపేక్షించాడు. “పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే . . . అనుసరించమని” ఆయన తన సహోదరులను కోరాడు. (రోమా. 1:11, 12; 14:19) ఆ ప్రయత్నాలు “శిష్యుల మనస్సులను దృఢపరచి—విశ్వాసమందు నిలుకడగా” ఉంచడంలో సఫలమయ్యాయి. (అపొ. 14:22) మనకు అటువంటి ప్రోత్సాహం నేడు ఎంతగానో అవసరం.

2 మనం చెప్పే దాన్నిబట్టి మనం ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగజేయు వారిగా ఉండగలం. సరిగ్గా ఉపయోగిస్తే మన మాటలు “చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటివిగా” ఉండగలవు. (సామె. 25:11) కూటాల్లో పాల్గొనడం ద్వారా, మనం ‘ఒకరినొకరం పురికొల్పుకుంటున్నాము.’ (హెబ్రీ. 10:25) మనం అనుభవాలను పంచుకుని, ఒకర్నొకరం మెచ్చుకుని లేక ఆత్మీయ విషయాలను చర్చించేటప్పుడు మన నాలుకను అనుకూలమైన విధంగా ఉపయోగించవచ్చు. నాలుకను అలా సరైన రీతిలో ‘వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనం’ పలికేందుకు ఉపయోగించడం మంచిది.—ఎఫె. 4:29.

3 క్షేమాభివృద్ధికరమైన విషయాలను గురించి మాట్లాడండి: ఫిలిప్పీయులు 4:8 నందు పౌలు మన సంభాషణకు మార్గనిర్దేశకాలను ఇచ్చాడు. ఏవి సత్యమైనవో, మాన్యమైనవో, న్యాయమైనవో, పవిత్రమైనవో, రమ్యమైనవో, ఖ్యాతిగలవో వాటినే మనం పరిగణించాలని ఆయన చెప్పాడు. మనం చెప్పేది దేవుని వాక్యంపై ఆధారపడి ఉంటే అది నిజమైనదిగా, మరి ఇతరులకు తప్పకుండా అవసరమైనదిగా ఉంటుందని మనం నిశ్చయత కలిగి ఉండవచ్చు. (యోహా. 17:17) మన క్రైస్తవ సమర్పణ, సంఘ కూటాల్లో మనం నేర్చుకునేవి, మన పరిచర్యను మనం పూర్తిగా నిర్వహించే పద్ధతి మరి ఇలాంటి విషయాలు చాలా గంభీరమైనవి. దేవుని వాక్యం యొక్క క్షేమకరమైన ప్రమాణాలు మరియు నియమాలు మనం “రక్షణార్థమైన జ్ఞానము” పొందడానికి మనకు సహాయం చేస్తాయి. (2 తిమో. 3:15) యెహోవా యొక్క పరిశుద్ధ సంస్థలోని వారు కలిగున్న నీతియుక్త ప్రవర్తననుబట్టి మనం మన మెప్పును వ్యక్తం చేయవచ్చు. మన సహోదరుల దయగల ప్రేమపూర్వకమైన క్రియలను మనం పొగడవచ్చు. (యోహాను 13:34, 35) మాట్లాడదగిన మంచి విషయాల్లో, మన సహోదరుల్లో మనం గమనించే విశ్వాసం, సంతోషం, సమాధానం మరియు దీర్ఘశాంతం వంటి చక్కని క్రైస్తవ లక్షణాలు కూడా ఇమిడి ఉన్నాయి. అలాంటి రమ్యమైన మరియు ఖ్యాతిగల విషయాలను గురించి సంభాషించడం ఇతరుల ‘క్షేమాభివృద్ధికి’ మంచిది.—రోమా. 15:2.

4 ప్రతి దినం, మనము ఈ లోకంలోని నిరుత్సాహకరమైన చింతలను ఎదుర్కొంటున్నాము. ఈ విషయాలను పక్కనబెట్టి మన సహోదరుల ప్రేమపూర్వక సహవాసాన్ని పంచుకోవడం ఎంతో ఉత్తేజకరంగా ఉంటుంది! మనందరం కలిసి గడిపే అమూల్యమైన సమయం మనం విలువైనదిగా ఎంచవలసినది. మనం ఎప్పుడూ ప్రోత్సహిస్తూ, క్షేమాభివృద్ధికరంగా ఉంటే, ఇతరులు మన గురించి ‘వారు నా ఆత్మకు సుఖము కలిగించారు’ అని యథార్థంగా చెబుతారు.—1 కొరిం. 16:18.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి