1995 “ఆనందమయ స్తుతికర్తలు” యెహోవాసాక్షుల జిల్లా సమావేశం
1 ఇండియాలో గత సంవత్సరం “దైవ భయం” జిల్లా సమావేశాలకు హాజరైన 23,363 మందిలో ఉండటం ఎంతటి ఆనందకరమైన విషయం! బాప్తిస్మం తీసుకోవడం ద్వారా 830 మంది సరైన దైవ భయాన్ని చూపారు. ఈ సంవత్సరం 1995 “ఆనందమయ స్తుతికర్తలు” జిల్లా సమావేశానికి హాజరవ్వడం ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందో కదా! మన బైబిలు విద్యార్థులతో పాటు హాజరవ్వడానికి ఆ ఆసక్తికరమైన ముఖ్యాంశం మనల్ని వాస్తవంగా పురికొల్పాలి. ఈ అంత్య కాలంలో యెహోవాను యథార్థంగా సేవించడానికి మనం కొనసాగుతుండగా, ఆ కార్యక్రమం ఆత్మీయ ఉత్తేజానికి నిజమైన ప్రోత్సాహంగా ఉంటుంది.
2 మూడు దినాల ఆనందకరమైన ఆత్మీయ కార్యక్రమాన్ని, ప్రారంభ గీతం నుండి ముగింపు ప్రార్థన వరకు పూర్తిగా ఆనందించడానికి అక్కడ ఉండేందుకు మీరు ముందే ఏర్పాట్లు చేసుకోడానికి జాగ్రత్తపడండి. మద్దతు అవసరమున్న వారు, ప్రాముఖ్యంగా కొత్తగా ఆసక్తిగల వారు కూడా ప్రతి భాగానికి హాజరవ్వడానికి వీలుపడేలా ప్రేమ పూర్వకంగా మీ పథకాల్లో వారిని చేర్చుకోండి. హాజరవ్వాలని పథకం వేసుకునే బైబిలు విద్యార్థులతో ఎవరితోనైనా ఈ ఇన్సర్ట్లోని విషయాలను పరిశీలించడం చాలా సహాయకరంగా ఉంటుంది. (గల. 6:6, 10) ఈ కార్యక్రమం శుక్రవారం ఉ 9:40కి సంగీతంతో ప్రారంభమౌతుంది మరి ఇంచుమించు సా 5:00కి అంతమౌతుంది. శనివారం ఉ 9:30కి ప్రారంభమై ఇంచుమించు సా 4:50కి పాటతో ముగుస్తుంది. ఆదివారం కార్యక్రమం ఉదయం 9:30కి ప్రారంభమై, ఆ దినపు కార్యక్రమం ఇంచుమించు మధ్యాహ్నం 3:50కి ముగుస్తుంది.
3 సంఘ కూటాలు, ప్రాంతీయ సమావేశాలు, ప్రత్యేక సమావేశ దినాలు, లేక జిల్లా సమావేశాలు ఏవైనప్పటికీ ఆత్మీయ విందుల్లో పాల్గొనటం ఎంత ఉత్తేజవంతం! ఎందుకని? దేవునికి భయపడే వ్యక్తులతో సహవాసం ఉత్తేజకరంగా ఉంటుంది, మరియు అలాంటి సందర్భాల్లో అందించబడే ఆత్మీయ విషయాలు మనకు అత్యంత ప్రాముఖ్యమైన విషయాలను జ్ఞాపకం చేస్తాయి.
4 ఇటీవలి సంవత్సరాల్లో అలాంటి ఆత్మీయ సమావేశాలకు అనేక వేలమంది ఆకర్షించబడ్డారు. మరి 1985 నుండి 1994 సంవత్సరాల మధ్యలో, ప్రపంచవ్యాప్త సంఘాల సంఖ్య 49,716 నుండి 75,573 వరకు అంటే 50 శాతం పెరిగింది. సమకూర్చే పనిని యెహోవా త్వరితం చేస్తుండగా, జిల్లా సమావేశాలు మరియు ప్రాంతీయ సమావేశాల సంఖ్య కూడా అలాగే పెరుగుతుంది. (యెష. 60:22) ఇండియాలోని జిల్లా సమావేశాల హాజరు, 1985లో 11,243 నుండి 1994లో 23,363 వరకు పెరిగింది—పది సంవత్సరాల్లో 108 శాతం పెరుగుదల అన్నమాట! ఇది సంస్థలో జరుగుతున్న అధిక పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. ఈ సమావేశాలను ఏర్పాటు చేసి, వాటిని నిర్వహించడంలో ఇమిడి ఉన్న పని మరింత ఎక్కువగా ఉంది. ఈ విందుల కొరకు సిద్ధం చేయబడిన ఆత్మీయ కార్యక్రమం నుండి ప్రయోజనం పొందడానికే మనం సమావేశమౌతాం గనుక, భౌతిక ఏర్పాట్లను చూసుకోవడంలోని అవసరతలను వీలైనంత మేరకు క్లుప్తంగా ఉంచుకోవడం జ్ఞానవంతం.
5 తీసుకోవలసిన చర్యలు: మనం పురోభివృద్ధితో ముందుకు సాగుతుండగా యెహోవా దీవెనల కొరకు మనం ఆయనవైపు చూస్తాము. ఆయన తన ప్రజలకు అవసరమున్న జ్ఞానవివేచనల ఆత్మను ఇచ్చాడని చూసి మనం సంతోషిస్తున్నాము. నమ్మకమైన దాసుని తరగతి ద్వారా, యెహోవా సంకల్పాలను అద్భుతమైన మార్గంలో నెరవేర్చడానికి యేసుక్రీస్తు సంగతులను నేర్పుగా నడిపించాడని మనం అంగీకరించాల్సిందే. (మత్త. 24:45-47; కొలొ. 1:9, 10) జూన్ మన రాజ్య పరిచర్యలోని ఒక ప్రకటన ఇలా చెబుతుంది: “ఇక మీదట, జిల్లా సమావేశాల్లోను, ప్రాంతీయ సమావేశాల్లోను మరియు ప్రత్యేక సమావేశ దినాల్లోను స్వల్పాహారం మాత్రమే లభ్యమౌతుంది. తమంతట తాముగా వడ్డించుకునే (కేఫటేరియా) తరహా భోజనం లభ్యం కాదు. హాజరయ్యేవారు ఇష్టపడేటట్లయితే, లభ్యమవుతున్న వాటితోపాటు తినడానికి తాము స్వంతంగా ఆహారాన్ని తెచ్చుకోవచ్చు.” ఈ ఏర్పాటు వెంటనే అమలులోకి వచ్చింది, అప్పటినుండి ఈ ప్రకటనకు అనుకూల ప్రతిస్పందన వచ్చింది. ఈ మార్పు ఎలా ప్రయోజనకరంగా ఉండగలదో తెలుసుకోడానికి మీరు ఆసక్తి కలిగి ఉండవచ్చు. ఈ సర్దుబాటుకు కారణమైన వాటిని గూర్చిన ఈ పునఃసమీక్ష, సమావేశాల వద్ద పనిని తగ్గించడం వలన మనం ఇప్పటికే అందుకున్న ప్రయోజనాల మంచి జ్ఞాపికగా ఉండగలదు.
6 తగ్గించడానికి ముందు సవరణలు: స్వచ్ఛంద సేవకుల సేవ, రూమింగ్ వంటి ప్రమాణీకరించబడిన, సులభం చేసిన జిల్లా సమావేశ ఏర్పాట్లను అమలు చేయకముందు, సమావేశానికి ముందు పనిలో వేలాదిమంది ప్రాంతీయ సహోదర సహోదరీలు ఎంతో పని చేయవలసి వచ్చేది. అనుదిన జీవితం మరియు సంస్థ యొక్క ఎడతెగని పెరుగుదల వలన మన సహోదరులపై వచ్చే ఒత్తిడి, పని దృష్ట్యా, పనిని సులభం చేయడానికి సవరణలు చాలా అవసరమయ్యాయి. దానికి తోడు, కేవలం అమెరికాలోనే ఆహార సేవల పనిని సులభం చేయడం మూలంగా, 1978లో మనకు ఆహారాన్ని అందించడానికి కార్యక్రమం జరుగుతుండగా కష్టించి పని చేసిన 70,000 మంది సహోదర సహోదరీలు కార్యక్రమాన్ని వినగల్గారు. సమావేశాల్లో ఆహార సేవ విషయంలో 1987లో సులభం చేసే తదుపరి పద్ధతులు అమలుపర్చబడ్డాయి మరి మరుసటి సేవా సంవత్సరంలో ఆ దేశంలోని సమావేశ హాలుల్లో అలా చేయడం జరిగింది. ఈ సంవత్సరం నుండి మొదలౌతూ, ఆ దేశంలోని ఏ సమావేశాల్లో కూడా ఎటువంటి ఆహారమూ ఇవ్వబడదు. పని చేసే వారు కార్యక్రమంలో ఎక్కువ భాగాన్ని విని ఆనందించగల్గుతూ, పనిని తక్కువ చేస్తూ, సమావేశం యొక్క ఆత్మీయ పక్షానికి ఎక్కువ అవధానాన్ని ఇవ్వడానికి వీలు కల్గించిన ఈ మార్పులు ప్రయోజనకరమైన సవరణలుగా రుజువయ్యాయి. (ద్వితీ. 31:12) అనేక సంవత్సరాల యథార్థమైన సేవ చేసిన, మన మధ్య ఉన్న నమ్మకమైన వారు ఈ మార్పులను బాగా జ్ఞాపకం ఉంచుకున్నారు మరి అందుకున్న నడిపింపు విషయమై మెప్పును వ్యక్తం చేశారు. ఆత్మీయ కార్యక్రమం నుండి సంపూర్ణంగా ప్రయోజనాన్ని పొందడం సులభతరం చేసేందుకు మరి పనిని తగ్గించేందుకు ఈ దేశంలో కూడా అలాంటి మార్పులనే చేయవచ్చా?
7 ఎదురుచూసిన మార్పులు: సులభంగా మార్చిన మెనూను ఇతర దేశాల్లో సిద్ధం చేసి అందించిన సంవత్సరాల్లో, సాపేక్షికంగా “కొన్ని వస్తువులు” మాత్రమే వాస్తవంగా “అవసరమై” ఉన్నాయని గుర్తించడం జరిగింది. (లూకా 10:38-42 పోల్చండి.) హాజరైనంత మందికి పూర్తి భోజనాన్ని వండటమంటే ఎక్కువ వస్తువులు ఉండాలి ఎక్కువ పని కూడా జరగాలి, అంతేకాక ఖరీదైన సామాగ్రిని అద్దెకన్నా తీసుకోవాలి లేక వాటిని కొని సర్క్యుట్లు రవాణా చేస్తూ, వాటిని జాగ్రత్త చేస్తూ ఉండాలి. ఈ ఏర్పాటును సంస్థీకరించి, మద్దతు ఇవ్వడానికి అనేకమంది స్వచ్ఛంద సేవకులు అవసరం. ఆహారాన్ని కనీసం కొంత సమయం కొరకైనా భద్రపర్చాల్సి ఉంటుంది. కేఫటేరియా విభాగం నుండి ఎంతమంది ఆహారం తీసుకుంటారు అనేది కచ్చితంగా అంచనా వేయడం దాదాపు అసాధ్యం, అందుకని కొన్నిసార్లు ఆహార కొరత ఏర్పడినప్పుడు, సహోదరులు దానికి సిద్ధపడి ఉండరు లేక ఆహారం వృథా అవుతుంది. ఇదంతా కూడా సంస్థ ఎక్కువ నష్టాలను భరించాల్సి వచ్చింది. సర్క్యుట్లు తమ స్వంత వంట పాత్రలను కలిగి ఉన్నప్పుడు కూడా, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం, భద్రపర్చడం మరి రవాణా చేయడానికి పని, సమయం మరియు ఖర్చు అవసరమౌతాయి. సులభం చేయడం ద్వారా, ఈ పని చాలామేరకు తగ్గుతుంది, అనేకమంది సహోదరులకు ఈ పనులు తప్పుతాయి.
8 ఈ పనుల్లో సహాయం చేసిన అనేకమంది స్వచ్ఛంద సేవకుల ఇష్టపూర్వక సేవ అత్యంత విలువైనది మరి అది మెచ్చుకోబడుతుంది. అంతేకాకుండా, ఇలా సులభం చేయడం వలన, సామాన్లను చూసుకుని, కొనుగోలు చేసి, ఆహారం సిద్ధం చేసి, వండి, వడ్డించడంలో సహాయం చేసిన వందలాది సహోదర సహోదరీలు, సమావేశాల్లో సహవాసాన్ని పూర్తిగా ఆనందించడంతో పాటు, ఇతర ఆవశ్యకమైన రాజ్య పనులకు తమ సమయాన్ని ఉపయోగించుకోవడానికి వీలౌతుంది. ఆహార సేవల్లో సహాయం చేసే స్వచ్ఛంద సేవకుల్లో అనేకమంది ఇప్పుడు అటెండెంటు మరియు క్లీనింగు వంటి ఇతర విభాగాలకు మద్దతు ఇవ్వగలరు. ఇది అందరి భారాన్ని తగ్గిస్తుంది, మరి అనేక ఆహార సేవల విషయంలో ఉన్నట్లు అనేకమంది రాత్రి చాలా సేపటి వరకు, తెల్లవారుజామునే, లేక కార్యక్రమం జరిగేటప్పుడు పని చేయనవసరం ఉండదు.
9 ఏర్పాట్లకు మద్దతు ఇవ్వడం: ఆహార సేవలతో పాటు సమావేశ ఏర్పాట్లలో సహోదరసహోదరీలైన మీరు సంవత్సరాలుగా “పూర్ణమనస్సుతో” ఇచ్చిన చక్కని మద్దతును సొసైటీ మెచ్చుకుంటోంది. (1 దిన. 29:9) ఇది అనేక మార్గాల్లో సహాయం చేసింది. మంచి నిర్మాణాలను అద్దెకు తీసుకోడాన్ని మరియు సమావేశ ఖర్చులపట్ల శ్రద్ధ వహించడాన్ని అది సాధ్యం చేసింది. హాజరౌతున్న వారు స్వల్ప మధ్యాహ్న విరామ సమయంలో ఆహారాన్ని పొంది, సమావేశ స్థలంలో ఉండిపోయి, ఉత్తేజితులై ఆత్మీయ కార్యక్రమం కొరకు అక్కడ ఉండటాన్ని సాధ్యం చేసింది. ఈ ఏర్పాట్ల కొరకు విరాళాలిచ్చి తమ ఉదారతను, మద్దతును చూపిన సహోదరసహోదరీలు అలా చేయడంలో కొనసాగుతారనడంలో సందేహం లేదు. వారు తమ మెప్పును ఆచరణాత్మకమైన పద్ధతిలో వ్యక్తపర్చారు.—సామె. 11:25; లూకా 16:9.
10 మీ ఆహార అవసరతల కొరకు శ్రద్ధ వహించడం: అయితే, ఈ సవరణలతో, వ్యక్తులు మరియు కుటుంబ గుంపులు మధ్యాహ్న విరామ సమయంలో తమకు అవసరమయ్యే ఆహారాన్ని తెచ్చుకోవలసి ఉంటుంది. ఆత్మీయ కార్యక్రమం యొక్క చక్కని ప్రయోజనాలను మనం ఎంతో మెచ్చుకుంటున్నాము. భౌతిక ఆహారం అనవసరమైనంత ప్రాముఖ్యతను పొందేలా అనుమతించడం అవివేకం. ఈ విషయంలో ప్రతి ఒక్కరు “శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుట” చాలా ప్రాముఖ్యం. (ఫిలి. 1:9) పోలండ్, రష్యా మరియు యూక్రేన్ మరితర ప్రాంతాల్లో జరిగిన యెహోవా ప్రజల ఇటీవలి పెద్ద సమావేశాలు ఆహార సేవల ఏర్పాట్లు లేకుండానే విజయవంతంగా జరుపబడ్డాయి. అంతేకాక, ఈ దేశంలోని కొన్ని సర్క్యుట్లు ఇప్పటికే తమ సమావేశాలు, ప్రత్యేక దిన సమావేశ కార్యక్రమాలలో పూర్తి ఆహారం కాక అల్పాహారాన్ని అందించి జరుపుకున్నారు. కొన్ని సందర్భాల్లో హాజరైన వారు తమ స్వంత ఆహారాన్ని తెచ్చుకున్నారు. సాండ్ విచ్చులు, ఉడకబెట్టిన గ్రుడ్లు, పళ్లు లభ్యమౌతాయి, మరి అనేకమందికి ఇవే చాలు. అయితే తమకు ఇంకా కొంత బలమైనది కావాలని ఇతరులు అనుకుంటే, వాళ్లు కొంత స్వల్పమైన మధ్యాహ్న భోజనాన్ని తెచ్చుకుంటే, వారు చురుకైన మానసిక స్థితిలో ఉండి మధ్యాహ్న కార్యక్రమం నుండి పూర్తి లాభాలను పొందగలమని గ్రహిస్తారు. దీనికి సమన్వయంగా, ఆహారం తెచ్చుకునే వారు ఎవరైనా సామాన్యమైన, పోషకమైన ఆహారాన్ని తెచ్చుకోవాలి. ఉదాహరణకు, యేసు జనసమూహానికి ఆహారాన్ని పెట్టినప్పుడు, ఆయన రొట్టెలు, చేపలు కేవలం రెండు పదార్థాలను మాత్రమే పెట్టాడు. (మత్త. 14:16-20; లూకా 10:42 కూడా చూడండి.) ఆ విషయంలో, సులభం చేయబడిన మధ్యాహ్న విరామంలో ఏది సరైనది, ఆచరణాత్మకమైనది అనే విషయంలో కొన్ని సలహాలను ఇవ్వడానికి మేము సంతోషిస్తున్నాము.
11 సమావేశంలో ఆహార సేవ ఏర్పాట్లు ఇక ఉండవు గనుక, చక్కగా పథకం వేసుకోవడం ద్వారా హాజరయ్యేవారు అటు ఇంట్లోనైనా లేక ప్రాంతీయ భోజనశాలలో తమ కుటుంబంతో ఉదయ ఫలహారాన్ని తీసుకోవచ్చు. ముందురోజు రాత్రి తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా మర్నాడు ఉదయాన్నే లేచి అవసరమైనంత పోషణను పొంది, హాజరౌతున్న మిగతా వారితో సహవాసాన్ని ఆనందించడానికి సమావేశానికి తగినంత ముందే రాగల్గాలి. ఈ క్రొత్త ఏర్పాటులోని మరో ప్రయోజనమేమంటే, ఆహార సేవల స్వచ్ఛంద సేవకులు తమ కుటుంబాలతో పాటు వచ్చే సరికి హాలును సిద్ధంచేసి తెరవాల్సిన అవసరం ఉండదు. ప్రత్యేక పనుల నియామకం ఉండటం వలన రావటం తప్పనిసరియైన వారికి మినహా, అనేక సందర్భాల్లో, హాజరయ్యేవారికందరికీ నిర్మాణం తలుపు ఉదయం 8:00 గంటలకు మాత్రమే తెరువబడుతుంది. ముందులాగే, సీట్ల కొరకు సమావేశ స్థలానికి త్వరగా వచ్చేయనవసరం లేదు, ఎందుకంటే వచ్చే వారందరి కొరకు తగినన్ని సీట్లు ఉండేలా పథకం వేయబడింది.
12 మధ్యాహ్న విరామం సమావేశాల్లో ముందు ఉన్నంత దానికంటే కొంత తక్కువే ఉంటుంది. అయినప్పటికీ, కొంత అల్పాహారం తీసుకునే అవకాశాన్ని, అలాగే ఇతరులతో సహవసించడానికి సమయాన్ని కూడా అది ఇస్తుంది. సమావేశం జరిగే పట్టణంలో లేక దానికి దగ్గర్లో నివసిస్తూ ప్రతిరోజు సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లే సహోదరసహోదరీలు, రిఫ్రెష్మెంట్ స్టాండ్ వద్ద లభించేవే కాక ఇతరమైనవి తినాలని ఇష్టపడితే ఆ రోజు మధ్యాహ్న విరామంలో తినేందుకు తమ కుటుంబంలోని ప్రతి వ్యక్తికి సరిపడేంత ఆహారాన్ని కొంత తెచ్చుకోవచ్చు. అది పాఠశాలకు పిల్లలు తీసుకెళ్లే మధ్యాహ్నభోజనం వలెనే ఉంటుంది. అనేకమంది ప్రజలు తమ ఉద్యోగ స్థలాలకు కూడా అలాంటి మధ్యాహ్నభోజనం తీసుకెళ్తారు.
13 సమావేశం జరిగే పట్టణాల వెలుపల నివసించే వారు, తమ మధ్యాహ్న ఆహార వస్తువుల కొరకు ముందుగా ప్లాను వేసి తమకు కావలసినవి తీసుకోవాల్సి ఉంటుంది గనుక, ఇది వారికి కొంత మేరకు సవాలువలె ఉంటుందనడంలో సందేహం లేదు. తమ అవసరతలను కొన్ని తడి లేని, నిలువచేయగల పదార్థాలు తీర్చగలవని కొందరు భావించవచ్చు, మరి వీటిని ఇంటినుండి కూడా తీసుకురావచ్చు. ప్రతి దినం యొక్క మధ్యాహ్న విరామం కొరకు అవసరమయ్యే ఇతర ఆహార వస్తువులు సమావేశం జరిగే పట్టణంలోని సరుకుల కొట్టుల్లో లభ్యమౌతాయి.
14 ఒక జ్ఞాపికగా, వంట చేయడానికి హోటలు వారు ఏర్పాటు చేయకపోతే, దయచేసి హోటలు గదుల్లో వంట చేయకండి. అది ప్రమాదకరం, కొన్నిసార్లు చట్టవిరుద్ధం మరి అది మరకలు మచ్చలు కలుగజేసి గదిలోని వస్తువులను పాడుచేయగలదు. అది గదుల్లో నుండి తీసివేయడం చాలా కష్టంచేసే వాసనలను ఉత్పన్నం చేయగలదు. దాన్ని పూర్తిగా శుభ్రపరచడానికి అయ్యే ఖర్చులు, పని లేకుండా గదిని మళ్లీ అద్దెకు ఇవ్వడానికి హోటలు వారికి కష్టంగా ఉంటుంది. అందుకనే, కనీసం సమావేశంలో ఒకటి లేక రెండు రోజులు ఉపయోగించుకోడానికి పాడవ్వని వస్తువులను ఇంటి నుండి తెచ్చుకోవడం లేక కొనడం చేయవచ్చేమో చూచుకోవడం వివేకం. ఎక్కువ తేమ ఉండని మధ్యాహ్నభోజనాన్ని మీకు ప్యాక్ చేయగల రెస్టారెంటును మీరు కనుగొంటే మీరు ఉదయాన్నే వాటిని సమావేశ స్థలానికి తెచ్చుకోవచ్చు. ఇలాంటి ప్యాక్ చేయబడిన మధ్యాహ్నభోజనాన్ని కొనడం హోటలు గదుల్లో ఆహారం తయారు చేయడాన్ని నివారిస్తుంది.
15 సమావేశ సమయంలో సమావేశ స్థలం ఒక పెద్ద రాజ్యమందిరంగా మారుతుంది గనుక, మధ్యాహ్న విరామం సమయంలో పిక్నిక్ వంటి వాతావరణాన్ని ఏర్పర్చకుండా ఉండటం వివేకయుక్తం. రాజ్యమందిరంలో కూటాలు జరిగేటప్పుడు మనం తినకుండా ఎలా ఉంటామో, సమావేశం జరిగేటప్పుడు కూడా తినడం, త్రాగడం చేయము. ఆడిటోరియంలోకి పెద్ద ఇన్సులేటెడ్ పాత్రలను తీసుకురావడం వివేకయుక్తం కాదు. అవి ప్రమాదాలు సృష్టించవచ్చు, మరి వాటిని మార్గాల్లో లేక సీట్లపై ఉంచకూడదు. మన మధ్యాహ్న విరామంలో అవసరమయ్యే స్వల్ప మధ్యాహ్నభోజన ఐటమ్స్ కొరకు బహుశా ప్లాస్టిక్ బ్యాగులు లేక ప్యాకెట్లే చక్కగా నప్పుతాయి. ఒకవేళ అవసరమయితే, ఒక చిన్న టిఫిన్డబ్బా లేక ప్లాస్టిక్ పాత్రను అంటే సీటుపై కాక సీటు క్రింద పెట్టగల దాన్ని ఉపయోగించవచ్చు.
16 సమావేశ స్థలానికి మనం తీసుకురావాలనుకునే పాత్రలు ఎలాగున్నాయని కూడా పరిగణించడం అవసరం. ఏ విధమైన గాజు పాత్రలు కూడా ప్రమాదకరమైనవిగా ఉండగలవు. కొన్ని స్థలాల్లో వాటిని ఉపయోగించడం కూడా నిషేధించబడింది. కావున, గాజు పాత్రలను లేక సీసాలను తీసుకురావద్దని మేము కోరుతున్నాము.
17 అదనపు ప్రయోజనాలు: అలాంటి సవరించిన ఏర్పాట్లలోని వివేకాన్ని మనం వాస్తవంగా చూడగలము. మనం సమావేశమవ్వడానికి గల వాస్తవ సంకల్పం, అదే ఆత్మీయ ప్రయోజనాలను అందుకోవడానికి మనం పూర్తి అవధానాన్ని ఇవ్వగలము. ఈ ప్రయోజనాలు మనం ఆనందించే సహవాసంలో అలాగే కార్యక్రమంలో కూడా అందించబడుతున్నాయి. రిఫ్రెష్మెంట్ విభాగం అందించే వాటికంటే ఎక్కువ కావాలనుకుంటే, మధ్యాహ్న విరామ సమయంలో సమావేశ స్థలాన్ని వదలి ఆహారం కొరకు వెదుకుంటూ వెళ్లే బదులు కొంత మన వెంటే తెచ్చుకోవడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అది మనం మన సహోదరసహోదరీల సహవాసాన్ని ఆనందించడాన్ని సాధ్యం చేస్తుంది, మరి మధ్యాహ్న కార్యక్రమాన్ని దేన్నీ పోగొట్టుకోకుండా ఉండేందుకు వీలు కలిగిస్తుంది.
18 మధ్యాహ్న కార్యక్రమం తర్వాత ఆత్మీయంగా ఉత్తేజితులై, ప్రాంతీయ భోజనశాలలో మరింత పోషకమైన ఆహారాన్ని తీసుకుంటూ నేర్చుకున్న మంచి విషయాలను గురించి సంభాషిస్తూ క్రైస్తవ సహవాసంలో కొనసాగాలని కొందరు ఇష్టపడవచ్చు. ఇతరులు రెస్టారెంటు లేక కొట్టులో ఏదైనా కొనవచ్చు. తమ స్వంత ఇళ్లకు వెళ్లగల వారు, ఇతర దినాల్లో లౌకిక పనిలో లేక ప్రాంతీయ సేవలో గడిపినప్పటి వలెనే సాయంత్రం భోజనం చేయాలని ఇష్టపడవచ్చు.
19 క్రొత్త ప్రచురణలు, చక్కని బోధ మరియు ఆచరణాత్మక సలహా పొందే సమావేశాలు మరియు సభల్లో మనం వాస్తవంగా ఆత్మీయ విందులను ఆనందిస్తున్నాము. హాజరైన దేవుని ప్రజలతో ఉండటంలోని ఆనందంతోపాటు ఈ దీవెనలనే ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకుంటారు. సామెతలు 10:22 ఇలా చెబుతుంది: “యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువకాదు.” యెహోవా ప్రజలుగా, వస్తుదాయక అవసరతలు మరియు ఐశ్వర్యాలను దృష్టిలో ఉంచుకుని మనం సమావేశాలకు హాజరుకాము. ఆత్మీయ విధంగా వీలైనంత గొప్ప ప్రయోజనాలను పొందాలన్న అనుకూల కోరికతో మనం సమావేశమౌతాము, మరి మనం చూపే స్ఫూర్తిని బట్టి యెహోవా మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు.—1 తిమో. 6:6-8; హెబ్రీ. 11:6.
20 ప్రోత్సాహానిచ్చే ఆ సందర్భాలు, ఆత్మీయ కోత యొక్క అభివృద్ధిని కూడా మనకు చూపిస్తాయి. (యోహా. 4:35, 36) యెషయా 54వ అధ్యాయం ఆనందభరితమైన పెరుగుదల కొరకు సిద్ధపడమని యెహోవా యొక్క భార్యవంటి సంస్థకు చెబుతుంది. అదనపు పెరుగుదల, విస్తరణ మరియు వినూత్నమైన శక్తి యెషయా ప్రవచించిన విధంగా సమీప భవిష్యత్తులో ఉన్నాయి: “నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాసస్థలముల తెరలు నిరాటంకముగ సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగుచేయుము నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు.” ఆసక్తికరమైన ఈ ప్రవచన నెరవేర్పు, మనం నేడు చూస్తున్నట్లుగా సత్యారాధన యొక్క గోచర విస్తరణకు దారి తీసింది.—యెష. 54:1-4.
21 సిద్ధపర్చబడిన ఆత్మీయ కార్యక్రమాన్ని అందరూ ఎక్కువ పరధ్యానం లేకుండా ఆనందించగల్గేందుకు సులభం చేయబడిన ఈ సమావేశ ఏర్పాట్లను అమలు చేయడం వివేకవంతమైన పనిగా ఉంటుందని వాస్తవంగా కనిపిస్తుంది. అదనపు పెరుగుదలపట్ల ప్రభావవంతంగా శ్రద్ధ వహించడానికి వీలు కలిగిస్తుంది గనుక దీనిపైన కూడా యెహోవా దీవెనలు ఉంటాయని మనం నమ్మవచ్చు. అవసరమైన దానిపై దృష్టి నిలపడం ద్వారా, ఆనందకరమైన సహవాసం మరియు ఆత్మీయ మంచి సంగతుల పథకం వేయబడిన దినాలను మనం ఆనందించగలము. మనం సమావేశమై, ఆయన బల్లవద్ద భుజించడంలో కొనసాగుతుండగా యెహోవా మన ప్రయత్నాలనన్నింటినీ దీవించాలన్నదే మా యథార్థమైన ప్రార్థన.—ద్వితీయోపదేశకాండము 16:14, 15 పోల్చండి.
[6వ పేజీలోని బాక్సు]
సులభం చేయబడిన ఆహార సేవల ఏర్పాట్ల ప్రయోజనాలు
◼ కార్యక్రమం ముందు, జరిగేటప్పుడు మరియు ఆ తర్వాత సహవాసానికి వీలు కలిగిస్తూ తక్కువ పని ఉంటుంది.
◼ నియంత్రించడానికి తక్కువ ఆహార సేవల పరికరాలు
◼ అనేకులు ఆత్మీయ కార్యక్రమం వైపు అవధానాన్ని ఇవ్వగలరు
◼ ఇతర విభాగాలలో సహాయం చేయడానికి ఎక్కువమంది స్వచ్ఛంద సేవకులు
◼ ఇతర దైవపరిపాలనా గమ్యాల కొరకు ఎక్కువ సమయం ఉంటుంది
ఇష్టమైతే మధ్యాహ్న విరామం కొరకు తెచ్చుకోగల ఐటమ్లు
◼ స్వల్పమైన, సాధారణమైన మరియు పోషకమైన మధ్యాహ్నభోజన ఐటమ్లు
◼ చపాతీలు లేక వండిన కూరగాయల తక్కువ తేమగల పరోటా
◼ ఎండు ద్రాక్షాలవంటి పళ్లు, పప్పులు, బేక్ చేసిన పదార్థాలు, తాజా పళ్లు
◼ సమావేశానికి హాజరైన వారు తినేందుకు సమావేశ స్థలంలో వీలు ఉంటే అన్నము, వండిన కూరగాయల వంటకాన్ని కూడా తెచ్చుకోవచ్చు
సమావేశ స్థలానికి తీసుకు రాకూడనివి
◼ మత్తు పానీయాలు
◼ గాజు వస్తువులు లేక సీసాలు
◼ కుటుంబమంతటికీ సరిపోయే పెద్ద ఆహార పాత్రలు
మాంసాహార భోజనాన్ని తెచ్చే విషయంలో జాగ్రత్త వహించండి. అనేక హాళ్లు అలాంటి ఆహారాన్ని ఆవరణంలో తినకూడదని నిషేధిస్తారు. ఒకవేళ సందేహం ఉంటే అలాంటి వాటిని మానేయడం మంచిది.