మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి
1 యెహోవా సమయాన్ని గూర్చి జాగరూకత గలవాడు. మనం కూడా సమయాన్ని గూర్చి మెలకువ గలవారమై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం సమయాన్ని గూర్చి జాగరూకత గలవారమై ఉండేందుకు ఆయన తన సంస్థ ద్వారా సహాయం చేస్తున్నాడు. ఎల్లప్పుడూ మనం ‘ప్రభువు పనిలో ఎంతో చేయాలని’ ఉద్బోధించబడుతున్నాము. (1 కొరిం. 15:58) ఈ విధంగా, మనం యెహోవా సేవలో మరింత సమర్థవంతులం కాగలము.
2 ప్రతీ వారం మనకందరికీ ఉన్న కాలనిడివి ఒక్కటే—168 గంటలు. మనం మన సమయాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకుంటున్నాం? యెహోవా దృక్కోణంలో ఇది ఏ సమయమై ఉందో మనకు నిజంగా తెలుసని మనం చూపిస్తున్నామా? అనవసరమైన కార్యకలాపాల వల్ల మన అవధానం మళ్ళించబడుతోందా?
3 మనం బాగా సంస్థీకరించబడి ఉండడం ప్రాముఖ్యం. ప్రాముఖ్యత ఇవ్వబడిన వాటి పట్టిక ప్రకారం పనిచేయడానికి అనేకులు ప్రయత్నిస్తారు. ప్రతి పని దాని ప్రాముఖ్యతను బట్టి పట్టిక వేయబడుతుంది. అదెలా తీర్మానించబడుతుంది? మానవుడు ‘కష్టార్జితము వలన మంచిని చవిచూడవలెనని’ బైబిలు చెబుతుంది. (ప్రసం. 3:13) కొన్ని పనులు మిగిలిన వాటికన్నా మంచి ఫలితాలను ఇస్తాయి. ప్రతి ఒక్కటి తెచ్చే ఫలితాలను గూర్చి ఆలోచించండి. ఆ పనిని పూర్తి చేయడం ప్రత్యేక ప్రయోజనాలనిస్తుందా? మీరు కష్టించి చేసే పని వల్ల ‘మంచిని చవిచూస్తారా?’ లేనట్లయితే, అది అంత ప్రాముఖ్యమైన పని కాకపోవచ్చు.
4 మన పరిచర్యలో: ఇతరులు సేవా కూటాలకు సరైన సమయానికి చేరుకుని, ఉపదేశాలను జాగ్రత్తగా విని, పరిచర్యకు వెంటనే వెళ్ళినప్పుడు మనం ప్రశంసిస్తాము. మనం వేచి ఉండే బదులు, ప్రకటించడంలో బిజీగా ఉంటాము. “సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి” అని పౌలు వ్రాసినప్పుడు, మంచి క్రమంగా ఉండవలసిన అవసరత ఉందని ఆయన గట్టిగా నమ్మాడన్నది స్పష్టము.—1 కొరి.14:40.
5 మనం పరిచర్యలో ఉన్నప్పుడు, టీ త్రాగడానికి వెళ్ళడంవల్ల విలువైన సమయాన్ని కోల్పోవచ్చు. అయినప్పటికీ, వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కొంత విశ్రాంతి తీసుకోవడం మనలను పునరుత్తేజపరచి, కొనసాగడానికి మనకు సహాయపడవచ్చు. అయితే, అనేకులు పరిచర్యకు కేటాయించిన సమయంలో టీ త్రాగడానికి సహోదరులతో కలిసే బదులు ప్రజలకు సాక్ష్యమివ్వడంలో బిజీగా ఉండడానికి ఇష్టపడతారు. సమతుల్యత అవసరం.
6 “సంకుబడి కొంగ” వలస వెళ్ళవలసిన “తన కాలమునెరుగును,” చీమ శీతాకాలం కొరకు సిద్ధం చేసుకునేందుకు “వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును,” అని బైబిలు చెబుతుంది. (యిర్మీ. 8:7; సామె. 6:6-8) సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలోని రహస్యం అక్కడే ఉంది. మనం కూడా మన ‘నియామక కాలాలను తెలుసుకోవాలి.’ మనం మరీ నిక్కచ్చిగా ఉండక, సమయాన్ని గూర్చి జాగరూకత గలవారమై ఉండాలి. మనం ఏమి చేయాలన్నదే కాక, దానిని ఎప్పుడు చేయవలసిన అవసరం ఉందన్నది కూడా మనం తెలుసుకోవలసిన అవసరముంది. సంభవించగల కాలయాపనలను మినహాయిస్తూ, మనం ముందుగా పథకం వేసుకునే అలవాటు చేసుకోవాలి. మన కూటాలకు సిద్ధమవ్వడం, ప్రాంతీయ పరిచర్య, ఇతర దైవపరిపాలనా కార్యకలాపాలు వంటి మరింత ప్రాముఖ్యమైనవాటికి సమయం ఉండేలా కొన్ని కార్యకలాపాలను తగ్గించుకోవడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి.
7 “ప్రతిదానికి సమయము కలదు” అని మనకు బోధించే మన పరలోక తండ్రియగు, యెహోవా దేవుని వలె ఉండాలని మనం కోరుకుంటాం. (ప్రసం. 3:1) మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనం ‘మన పరిచర్యను సంపూర్ణముగా జరిగించ’గలము.—2 తిమో. 4:5.