కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/95 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1995
మన రాజ్య పరిచర్య—1995
km 6/95 పేజీ 3

ప్రకటనలు

◼ అందించవలసిన సాహిత్యాలు జూన్‌: జీవం—అది ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? (ఆంగ్లం) వెల రూ. 45.00. ప్రాంతీయ భాషల్లో 192 పేజీల ఏ క్రొత్త పుస్తకాన్నైనా మామూలు (రెగ్యులర్‌) వెలయైన రూ. 15.00కు అందించవచ్చు. జూలై, ఆగష్టు: ముప్పై రెండు పేజీల ఈ క్రింది బ్రోషూర్‌లలో దేనినైనా రూ. 5.00 చందాకు అందించవచ్చు: “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” జీవిత సంకల్పమేమిటి? మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, నిరంతరము నిలిచే దైవనామము (ఆంగ్లం), పరదైసును తీసుకొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? మీరు ప్రేమిస్తున్న వారైవరైనా చనిపోతే. . . సెప్టెంబరు: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం రూ. 25.00 చందాకు (పెద్ద సైజు రూ. 45.00) గృహ బైబిలు పఠనాలను నిర్వహించేందుకు ప్రయత్నాలు జరగాలి.

◼ తపాలాను పొందడంలో కలిగే ఇబ్బందులను గూర్చి అనేక సంఘాలు నివేదిస్తున్నాయి గనుక, పెద్దలు స్థానికంగా తమ పరిస్థితిని పునఃసమీక్షించుకోగలరు. సంఘం పత్రికల పెద్ద కట్టలతో సహా అసాధారణమైన పరిమాణంలో బట్వాడాను అందుకుంటున్న దృష్ట్యా, తమ స్థానిక పోస్టాఫీసుతోను, పోస్టుమ్యాన్‌లతోను మంచి సంబంధాలను కలిగివుండేలా సంఘ పెద్దలు చూసుకోవాలి. పోస్టాఫీసు అధికారులతో క్రమంగా సంభాషించడానికి, మరియు సంబంధం కలిగి ఉండడానికి ఒకరిని లేక మరెక్కువ మంది యోగ్యులైన సహోదరులను నియమించడం అలాగే, ఈ అదనపు బట్వాడాను చూసుకుని, తీసుకువస్తున్నారన్న మెప్పుతో స్థానికంగా సముచితమని ఎంచబడుతున్న విధంగా పోస్టుమ్యాన్‌లకు టిప్స్‌ ఇవ్వడం ఇందులో ఇమిడి ఉన్నాయి.

◼ సంఘాధ్యక్షుడు లేక ఆయనచే నియమించబడిన వ్యక్తి సంఘ అకౌంట్లను జూన్‌ 1న లేదా దాని తర్వాత సాధ్యమైనంత త్వరగా తనిఖీ చేయాలి. ఇది చేసిన తర్వాత సంఘంలో ప్రకటించాలి.

◼ “ఆనందమయ స్తుతికర్తలు” జిల్లా సమావేశం గోవాలో మార్గోవా నుండి మాపుసాకు మార్చబడింది.

◼ ఇక మీదట, జిల్లా సమావేశాల్లోను, ప్రాంతీయ సమావేశాల్లోను మరియు ప్రత్యేక సమావేశ దినాల్లోను స్వల్పాహారం మాత్రమే లభ్యమౌతుంది. తమంతట తాముగా వడ్డించుకునే (కఫ్టిరియా) తరహా భోజనం లభ్యం కాదు. హాజరయ్యేవారు ఇష్టపడేటట్లయితే, లభ్యమవుతున్న వాటితోపాటు తినడానికి తాము స్వంతంగా ఆహారాన్ని తెచ్చుకోవచ్చు.

◼ పందొమ్మిది వందల తొంభై ఆరు సమావేశ బ్యాడ్జు కార్డులను, పరిశీలించుట 1996, 1996 క్యాలెండరులు, 1996 వార్షిక పుస్తకాలు, 1996 జ్ఞాపకార్థ ఆహ్వాన పత్రికలను ఇంతవరకూ రిక్వెస్ట్‌ చేయని సంఘాలు, వెంటనే రిక్వెస్ట్‌ చేయాలి. దీనికి సంబంధించి, ఏప్రిల్‌లోని మన రాజ్య పరిచర్యలోని ప్రకటనను దయచేసి పునఃసమీక్షించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి