కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/94 పేజీ 1
  • వాళ్లు సాక్ష్యమివ్వక మానలేదు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వాళ్లు సాక్ష్యమివ్వక మానలేదు
  • మన రాజ్య పరిచర్య—1994
  • ఇలాంటి మరితర సమాచారం
  • బహిరంగ సాక్ష్యం ఇచ్చేందుకు ఒక కొత్త ఏర్పాటు
    మన రాజ్య పరిచర్య—2014
  • బహిరంగ ప్రదేశాల్లో సమర్థవంతంగా సాక్ష్యమివ్వడం
    మన రాజ్య పరిచర్య—2005
  • సువార్తనందించుట—సాయంకాల వేళలలో
    మన రాజ్య పరిచర్య—1991
  • ‘పూర్తిగా సాక్ష్యమివ్వడానికి’ కష్టపడి పనిచెయ్యండి
    మన రాజ్య పరిచర్య—2003
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1994
km 9/94 పేజీ 1

వాళ్లు సాక్ష్యమివ్వక మానలేదు

1 యెహోవాసాక్షులనే మన పేరు మనలను గుర్తిస్తూ, మనం చేసేదేమిటో వివరిస్తుంది. మన దేవుడైన యెహోవా గుణాతిశయాలను గూర్చి మనం సాక్ష్యమిస్తాం. (యెష. 43:10, 12) సంఘంలో సభ్యునిగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఈ సాక్ష్యపు పనిలో పాల్గొనవలసిందే. ప్రాథమికంగా సాక్ష్యపు పని అనేది మన బహిరంగ పరిచర్య ద్వారానే జరుగుతుంది, దీనిలో ఇంటింటికి వెళ్లడం, వీధిసాక్ష్యం చెప్పడం, పునర్దర్శనాలు చేయడం, బైబిలు పఠనాలు నిర్వహించడం కూడా యిమిడివున్నాయి. మనమందరం పూర్తిగా భాగం వహించాలని సరిగ్గానే ఉద్బోధించబడ్డాము.—1 కొరిం. 15:58.

2 అయినప్పటికి, సంఘంలోని కొందరు తాము చేయగల్గేదాని విషయంలో పరిమితి చేయబడ్డారు. ఘోరమైన వ్యాధి లేదా బలహీనత వారిని నిర్బంధించవచ్చు. వ్యతిరేకించే బంధువులు కఠినమైన అడ్డంకులను తీసుకురావచ్చు. ఒక యౌవనుడు అవిశ్వాసులైన తల్లి లేదా తండ్రిచే అడ్డగించబడవచ్చు. మారుమూల ప్రాంతాల్లో జీవించే వాళ్లు రవాణా సౌకర్యం లేనందువల్ల సాక్ష్యమివ్వడం అసాధ్యమైనట్లు భావించవచ్చు. సహజంగా ఉండే బిడియం, భయపడే వారిని సంకోచించేలా చేయగలదు. ఇదే లేదా యిటువంటి పరిస్థితిలోనే వున్న కొందరు ప్రచారకులు చేయగల్గేది తాము చేయాలని తలంచిన దానికంటే, ఆలాగే యితరులు చేస్తున్నదానికంటే తక్కువ చేస్తున్నాము కాబట్టి తాము క్రైస్తవులుగా సరితూగమని భావించవచ్చు. తమ స్వంత ప్రయత్నాలను చిన్నచూపు చూడడానికి వారికి ఏ కారణమూ లేదు. (గల. 6:4) వారు ఏ పరిస్థితిలో వున్నప్పటికీ శ్రేష్ఠమైన దాన్ని వారిచ్చినప్పుడు యెహోవా సంతోషిస్తాడని తెలుసుకోవడంలో వారు ఓదార్పు పొందవచ్చు.—లూకా 21:1-4.

3 భాగం వహించే మార్గాన్ని కనుగొనుట: కష్టతరమైన పరిస్థితుల్లో సాక్ష్యమివ్వకుండా అడ్డగించే అడ్డంకులను కొందరెలా అనుమతించలేదో చూపే వేలకొలది అనుభవాలు వివరించబడ్డాయి. చొరవ తీసుకునే తమ యిష్టతనుపయోగిస్తూ, అనియత సాక్ష్యమివ్వడానికి అనేక రకాల మార్గాలను వారు యోచించారు. ఇంట్లోనే ఉండాల్సిన వారు సాక్ష్యపు పని అనే ద్వారాన్ని తెరవడానికి టెలిఫోన్‌ను ఉపయోగించారు. తమను దర్శించడానికి వచ్చిన ప్రతివారు వింటారనే ఆశిస్తారు. కుటుంబంలో వ్యతిరేకత ఉన్న భార్య, యింట్లో సాక్ష్యమివ్వలేకపోయినప్పటికి, ఆమె పొరుగువారితో లేదా రోజువారీ కార్యక్రమాల్లో తాను కలిసే యితరులతో మాట్లాడడానికి గల అవకాశాలను ఉపయోగించుకుంటుంది.

4 మన బహిరంగ సాక్ష్యపు పనిలో భాగం వహించడానికి ఒక యౌవనుడు తల్లి లేదా తండ్రిచే నిషేధింపబడవచ్చు. దానిని అసాధ్యమైన అడ్డంకుగా అంగీకరించడానికి బదులు, అతను తన తోటి విద్యార్థులను, ఉపాధ్యాయులను తన స్వంత “ప్రాంతంగా” దృష్టించి, మంచి సాక్ష్యమివ్వగలడు, బహుశా బైబిలు పఠనాలు కూడా చేయగలడు. మారుమూల ప్రాంతాల్లో నివసించే అనేకమంది ఉత్తరాలు వ్రాయడం ద్వారా భాగం వహించగల్గారు. క్రైస్తవ ఆసక్తితో పురికొల్పబడినవారు “మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవజ్ఞాన విషయములో . . . సోమరులైనను నిష్ఫలులైనను కాకుండ”ఉంటారు.—2 పేతు. 1:8.

5 సాక్ష్యపు పనిలో భాగంవహించే విషయానికొస్తే, మనందరికీ యెహోవా ఒకేవిధమైన ప్రమాణాన్ని దయచేశాడు, అదేమంటే మనం “మనస్ఫూర్తిగా” పనిచేయాలి. (కొలొ. 3:23) మనం ఎంత సమయం గడిపాం, ఎంత సాధించాం అనేవి భేదం కల్గివున్నప్పటికి, దాగివున్న దృక్పథంమాత్రం ఒకేరీతిలో వుంటుంది, అదే ‘పూర్ణహృదయం’ నుండి పుట్టుకువచ్చే నిజమైన ప్రేమ. (1 దిన. 28:9; 1 కొరిం. 16:14) మనం మనకు శ్రేష్ఠమైన దాన్ని యిస్తున్నట్లైతే, మనం కొంచెమే యివ్వగల్గుతున్నాం గనుక మనం విశ్వాసంలో క్షీణిస్తున్నాం లేదా సంఘంలో నిరుపయోగమైనవారం అని భావించడానికి మనకే కారణం కూడా ఉండదు. పౌలు వలెనే, మనం ‘ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగా తెలియజేయుచు బోధించామని’ యథార్థంగా చెప్పగలం.—అపొ. 20:20.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి