పునర్దర్శనాల్లో ఆసక్తిని పెంపొందించుట
1 పరిచర్య వ్యవసాయంతోను, పునర్దర్శనాలు చేయడం సేద్యం చేయడంతోను, నీళ్ళు పోయడంతోను సరైన విధంగానే పోల్చబడింది. (మత్త. 13:23; లూకా 10:2; 2 కొరిం. 9:10) కొత్తగా మొలకెత్తిన ఏ విత్తనమైనా పరిపక్వత చెంది, ఫలించడానికి సహాయపడవలసిన బాధ్యత ‘దేవుని జత పనివారమైన’ మనకుంది. (1 కొరిం. 3:6, 9) మనం దీనిని సరైన రీతిలో ఎలా నెరవేర్చగలం?
2 ఆసక్తి చూపించే వారినందరిని పునర్దర్శించడానికి త్వరపడండి. మీ ఇంటింటి రికార్డులను పునఃసమీక్షించి, ఎవరిని దర్శించాలో, ఏమి చర్చించాలో తీర్మానించుకోండి. సాధారణంగా, మీరు మొదట దర్శించినప్పుడు ఏమి చర్చించారో దానిని బట్టి చర్చించవలసిన అంశాన్ని తీర్మానించవచ్చు. పరిచయం చేయదగిన యితర లేఖనాల వివరాలను మనస్సులో ఉంచుకొని, అవసరాన్ని బట్టి వాటిని గూర్చి మాట్లాడండి. హృదయాన్ని చేరుకోగల బైబిలు శక్తిని గుర్తించి, ఎల్లవేళలా దానిని ఉపయోగించడం మంచిది.—హెబ్రీ. 4:12.
3 మన సమస్యలు అనే బ్రోషూర్ను తీసుకున్నవారిని ఎలా ప్రభావవంతంగా పునర్దర్శించవచ్చో సలహాల కొరకు మన రాజ్య పరిచర్య ఆగష్టు 1992, పుట 4 చూడండి.
“దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?” అనే బ్రోషూర్ను యిచ్చినట్లయితే, మీరు యీ విధంగా చెబుతూ ఆరంభించవచ్చు:
◼ “దేవుడు భూమిని నాశనము చేయబోతున్నాడని కొందరు యథార్థవంతులైన ప్రజలు నమ్ముతుంటే, మనుష్యులే ఆ పని చేస్తారని మరికొందరు భయపడుతున్నారు. మీరేమనుకుంటున్నారు [జవాబు చెప్పనివ్వండి.] దేవుడు భూమిని నాశనంచేసే బదులు, అవినీతిని తుడిచి వేసి, దాన్ని శాంతి భద్రతలు గల స్థలంగా మారుస్తాడని బైబిలు మనకు చెబుతుంది. నేరుగా 22వ పుటలోకి అవధానాన్ని మళ్ళించి, అక్కడ ఉదాహరించిన సామెతలు 2:21, 22 చదవండి. ఆసక్తి కనిపించినట్లయితే, గృహ బైబిలు పఠన ఏర్పాటును గూర్చి వివరించండి, లేదా కొత్త పత్రికలను అందించండి, పునర్దర్శనానికి ఏర్పాటు చేసుకొని దేవుడు వాగ్దానం చేసిన నూతన లోకాన్ని గూర్చి మరి ఎక్కువగా చర్చించండి.
4 మీరు “ఇదిగో . . . . సమస్తము” అనే బ్రోషూర్ను అందించినట్లయితే, యీ విధంగా చెప్పవచ్చు:
◼ “నేను క్రితం వచ్చినప్పుడు, మీకిచ్చి వెళ్ళిన బ్రోషూర్ కవరుమీద చిత్రీకరించినట్లుగా, భూమిని పరదైసుగా చేస్తానన్న దేవుని వాగ్దానాన్ని గూర్చి మనం బైబిలులో చదివాము. దేవుని చిత్తాన్ని గూర్చి, అది మనలను ఎలా ప్రభావితం చేస్తుంది అనే దాని గురించి మరెక్కువగా నేర్చుకోడం ద్వారా మనం యీ ఆశీర్వాదాన్ని అనుభవించవచ్చు.” యోహాను 17:3 చదివి, 27వ పేజీలోని 52, 53 పేరాలకు తిప్పండి. దేవుని వాక్యాన్ని గూర్చిన సరైన జ్ఞానాన్ని సంపాదించవలసిన అవసరత ఎందుకుందో క్లుప్తంగా చర్చించండి.
5 చర్చీకి వెళ్ళే వ్యక్తికి “జీవిత సంకల్పం” అనే బ్రోషూర్ను యిచ్చిన తరువాతి సందర్శనంలో మీరీ విధంగా చెప్పడం సరైనదని గుర్తించవచ్చు:
◼ “మీరు పరలోక ప్రార్థన అనేకసార్లు చేసి ఉండవచ్చు. దేవుని రాజ్యము వచ్చును గాక అని మీరు ప్రార్థించేటప్పుడు మీ మనస్సులోకి ఏ తలంపు వస్తుంది?” గృహస్థుడు జవాబు చెప్పిన తరువాత 26వ పేజీలోని 8, 9 పేరాలను ఉదాహరించి, ఆ తర్వాత దానియేలు 2:44 చదవండి. దేవుని రాజ్యం వస్తుందంటే, దాని భావం దుష్టత్వాన్ని, కష్టాలను అంతం చేస్తుందని వివరిస్తూ, బహుశా మీ సంభాషణను కొనసాగించగలరు. మనం దేవుని దృష్టిలో నీతిమంతులమైతే, యిదే భూమిపై పరదైసులో నిరంతర జీవితాన్ని అనుభవించగలమని చెప్పండి.
6 సాహిత్యం తీసుకున్నా, తీసుకోకపోయినా, వినడానికి యిష్టపడుతున్న ఎవరినైనా పునర్దర్శించాలని జ్ఞాపకముంచుకోండి. ప్రతి వారం కొంత సమయం పునర్దర్శనాలు చేయడానికి కేటాయించుకోండి. మీరు కనుగొన్న ఆసక్తిని పెంపొందించడానికి మీరు చేసే గట్టి ప్రయత్నాన్ని యెహోవా ఆశీర్వదిస్తాడు. ఆయన మహిమ నిమిత్తం అది ఫలించును గాక.—యోహాను 15:8.