1993 యెహోవాసాక్షుల “దైవిక బోధ” జిల్లా సమావేశములు
1 ప్రపంచమంతటా, 1992 “వెలుగు ప్రకాశకులు” జిల్లాసమావేశములకు హాజరైనవారందరు అంధకారముతో నిండిన లోకములో వెలుగు ప్రకాశకులుగా సేవచేసే ఆధిక్యతయెడల తమ మెప్పును ఉన్నతపరచుకొన్నారు. (2 పేతు. 1:19) ప్రపంచవ్యాప్తంగా వేలాది ప్రియమైనవారు నీటి ద్వారా బాప్తిస్మముపొంది, వెలుగు ప్రకాశకులైన గొప్ప జనములో భాగమగుట ఎంతటి పులకరింపజేయు సంగతి! వెలుగు ప్రకాశకులు ఫలవంతముగా నుండుటకు మహాగొప్ప ఉపదేశకుని మరియు గొప్ప బోధకుని అనుసరించవలసివున్నారు. నిజానికి మనము “బలమైన” వర్తమానాన్ని కలిగివున్నాము. అంతేగాక ఈ ప్రాముఖ్యమైన సమాచారముతో ప్రజల హృదయాలలోకి చేరుటలో మనము ఫలవంతులమై యుండటానికి, ఈ సంవత్సరపు “దైవిక బోధ” జిల్లా సమావేశములు మనకు సహాయముచేస్తాయి. (కీర్తన 119:160; మత్త. 28:20) ప్రపంచవ్యాప్తంగా నున్న మిషనరీలు తమ స్వదేశాలలో ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు ఇప్పటికే పథకాలు వేసుకొంటున్నారు. మీరు మరియు మీ కుటుంబము అలాగే పథకాలను వేసుకొంటున్నారా? ఈ బలమైన ఆత్మీయ విందుకు హాజరయ్యేందుకు మీ బైబిలు విద్యార్థులను ఎందుకు ప్రోత్సహించకూడదు?
2 దానియొక్క నాలుగు దినముల సంతోషభరిత ఆత్మీయకార్యక్రమమును ప్రారంభ పాటనుండి ముగింపు ప్రార్థనవరకు ఆనందించేలా మీ సమావేశ ఏర్పాటులను జాగ్రత్తగాను, ప్రార్థనాపూర్వకంగాను వేసికొనుటకు నిశ్చయం చేసికొనండి. మీ సహాయము అవసరమైనవారు, ప్రత్యేకంగా క్రొత్తగా ఆసక్తిచూపువారు ప్రతికార్యక్రమమునకు హాజరయ్యేలా మీ పథకాలలో వారినికూడా ప్రేమపూర్వకంగా ఇమడ్చండి. (గలతీ. 6:10) కార్యక్రమము గురువారము మధ్యాహ్నము 1:30కి ప్రారంభమై దాదాపు సాయంకాలము 5:00 గం. ముగుస్తుంది. శుక్రవారము మరియు శనివారము కార్యక్రమం ఉదయం 9:20కి ప్రారంభమై దాదాపు సాయంకాలం 5:00 గం. ముగుస్తుంది. ఆదివారము ఉదయము కార్యక్రమము 9:20కి ప్రారంభమై దాదాపు 4:10కి ముగుస్తుంది. ఈ క్రింద ఇవ్వబడే సమాచారము మీ ప్రాథమిక సిద్ధపాటులకు సహాయపడుతుంది.
3 ఈ సంవత్సరం ఇండియాలో 18 సమావేశములు జరుగుటకు ఏర్పాటుచేయబడ్డాయని తెలుసుకొనుటకు మీరు సంతోషిస్తారు. వీటిలో మొదటిది సెప్టెంబరు ఆఖరులో జరిగేలా ఏర్పాటుచేయబడింది. సమావేశములు అక్టోబరు మరియు నవంబరు మాసములలో ఉంటాయి. రెండు సమావేశములు డిశంబరు మాసములో కేరళలో జరుగుతాయి. మీకు తెలిసినట్లుగా గత కొన్ని సంవత్సరాలలో మనం దాదాపు 30 సమావేశాలను కలిగియుంటున్నాము. అయితే ఈ సమావేశములలో ప్రతిదానికి ఎక్కువమంది సహోదరులు కూడుకొనునట్లు ఈ సంవత్సరం ఇవి తక్కువ చేయబడినవి. ఈ సమావేశములు సాధ్యమైనంత పెద్దగా ఉండునని మేము ఎదురుచూస్తున్నాము. పెద్ద సమూహములు సహోదరులలో గొప్ప ఉత్సాహాన్ని రేకెత్తించి, చూసేవారికి మంచి సాక్ష్యాన్నిస్తాయి. అది మాకుకూడా సమావేశ ప్రసంగీకులను శ్రేష్టమైన రీతిలో ఎన్నుకోడానికి అవకాశాన్నిస్తుంది. ఇది అనేక సమావేశాల ప్రమాణాన్ని ఉన్నతపరస్తుంది.
4 వసతిని ఏర్పాటును చేసుకొనుటకు ఉపదేశాలు: సాధారణమైన రీతిలోనే ఈ సంవత్సరం రూము రిక్వెస్టింగ్ ఫారంలను మేము పంపుతున్నాము. సమావేశ రూమింగ్ ఏర్పాటుద్వారా వసతిని పొందాలనుకునే వారందరూ, రూమ్ రిక్వెస్టు ఫారంలో అవసరమైన సమాచారమును స్పష్టంగా, చక్కగా వ్రాసి వెంటనే వారి సంఘ కార్యదర్శికి లేక సమావేశ సమన్వయకర్తకు ఇవ్వాలి. ఆయన దానిని పరిశీలించి సంతకముచేసి ఆలస్యములేకుండా వెంటనే మీరు హాజరుకావాలనుకున్న పట్టణ రూమింగ్ డిపార్టుమెంటుకు పంపును. దయచేసి ఈ పనిని మీ సమావేశమునకు చాలా ముందుగా చేయండి. ఒక్కొక్క రూమ్‌కు ఒక్కొక్క ఫారంను పంపించాలి. కేవలం ఒక రూములో ఉండబోయేవారి పేర్లు మాత్రమే ఒక ఫారంపై ఉండాలి. ఒక రూములో ఉండేవారి సంఖ్య ఎక్కువగా ఉంటే, వారిలో కొంతమందిని రూమింగ్ డిపార్టుమెంట్ వేరే రూమ్‌కు మార్చవలసి వస్తుంది.
5 హోటల్ రూమ్‌లు కావాలనుకున్నట్లయిన, మీరు ఎంత వెలలో ఉండాలనుకుంటున్నారో దానిని కుడివైపు ఉన్న స్థలంలో సూచించండి. దయచేసి మీరు ఉండాలనుకుంటున్న వెలలో ఆ కాలానికి తగినంత డబ్బును మీ ఫారంతోపాటు మనియార్డరు చేయండి. పోస్టల్ ఆలస్యము, దానిలో పోగొట్టుకొనే అవకాశమున్న దృష్ట్యా, మీ రిక్వెస్టును చాలా ముందుగా పంపేలా ఖచ్చితంగా చూడండి. మీ టపాలను అక్నాలెడ్జ్మెంటుతో రిజిస్టరు చేయడం సురక్షితమైన పద్ధతి.
6 మీకొరకు వసతి ఏర్పాటుచేయబడిన వెంటనే ఈ విషయం మీకు తెలియపర్చబడుతుంది. ఒకసారి ఏర్పాటుచేసుకొన్న తర్వాత, దయచేసి మీకు నిర్ణయించబడిన రూమును అంగీకరించండి. ఎందుకంటే మీకు ఆతిథ్యమిచ్చేవారికి లేక హోటల్ నిర్వాహకులకు మీరు ఇచ్చిన తారీఖుకు మీరు వస్తున్నారని తెలియజేయటం జరిగింది.
7 మీరు సమావేశ పట్టణానికి వచ్చే తారీఖును తెలియజేసేటప్పుడు, మీరు అదే తారీఖుకు చేరుకొనే లాగున చూడండి. ఎందుకంటే మీకొరకు మీరు కోరిన విధంగా రిజర్వేషన్లు చేసిపెట్టబడతాయి. మీరు చేరుకున్న వెంటనే మీకు నిర్ణయించబడిన వసతికి సాధ్యమైనంత త్వరగా వెళ్లండి. ఏవైనా అనివార్య కారణాలవల్ల మీరు నిర్ణయించుకొనిన సమయానికి రాలేక పోయినట్లయిన మీ హోటల్ లేక సత్రము మేనేజర్‌కు దాన్ని తెలియపరచండి.
8 ప్రత్యేక అవసరతలు: ప్రత్యేక అవసరతలు కల్గిన వ్యక్తులకు వారు హాజరయ్యే సంఘము వారి అవసరతలను గూర్చి శ్రద్ధవహించాలి. ఆయా వ్యక్తుల వ్యక్తిగత పరిస్థితులు తెలిసిన పెద్దలు మరియు ఇతరులు ప్రేమపూర్వకంగా వారికి సహాయాన్ని అందజేయవచ్చును. దీనిలో ప్రచారకులు తరచు పూర్తికాలసేవలో ఉన్నవారు, వృద్ధులు, వికలాంగులు లేక ఇతరుల అవసరతలను ప్రచారకులు గమనించవలసిన అవసరమేర్పడ వచ్చును. ప్రచారకులు అట్టివారిని తమతోపాటు తీసుకెళ్లడం, లేక ఇతర విధాలలో వారి అవసరతలను గూర్చి శ్రద్ధ తీసుకోవడం చేయవచ్చును.—యాకో. 2:15-17; 1 యోహాను 3:17, 18.
9 నిజమే, ప్రత్యేక అవసరతలుగల ప్రచారకులకు సంఘము సహాయముచేయలేని పరిస్థితిలో ఉంటే, వారికి బహుశా రూమింగ్ డిపార్టుమెంట్ తగిన రూమింగ్ వసతులను కలిగించుటకు ప్రయత్నిస్తుంది. ఇటువంటి ప్రచారకులు వారి పరిస్థితిని సంఘ సెక్రెటరీతో చర్చించవచ్చును. సెక్రెటరీ ఈ విషయమును సంఘ సేవా కమిటితో చర్చించి, ఈ వ్యక్తులకు వారి స్వంత రూమింగ్ వసతికొరకు సంఘము సహాయముచేయడం సాధ్యమౌతుందేమో కనుగొంటాడు. ఒకవేళ సంఘము అవసరమైన సహాయాన్ని అందించేందుకు సామర్ధ్యములేనిదైతే, సెక్రెటరీ సమావేశ రూమింగ్ డిపార్టుమెంటుకు ప్రత్యేకమైన ఉత్తరము వ్రాయవచ్చును. ఈ పరిస్థితులను సెక్రెటరీ స్పష్టంగా వివరించవలెను. వీటన్నిటిని సమావేశమునకు ఎంతో ముందే చెయ్యాలి. ఇలా కోరేవ్యక్తికి నేరుగానే వారి వసతినిగూర్చి తెలియజేయబడుతుంది.
10 కొన్నిసార్లు ఆ యా గృహాలలో వసతి ఏర్పాటు చేయబడటం జరుగుతుంది. అలా కోరవచ్చును. అలా కోరేవారు సహోదరుల ఇట్టి ఆతిథ్యమునుబట్టి సమావేశానికి ముందేగాని లేక తరువాతేగాని అదనపు రోజులు వారికి వసతిని దయచేయాలని భావించటం సరైనది కాదు. ఈ రూములు కేవలం సమావేశ దినముల కొరకు మాత్రమే దయచేయబడుతున్నవి. ఇటువంటి వసతులను పొందేవారు, తమ పిల్లలతోపాటు వారికి ఆతిథ్యమిచ్చేవారి గృహముపట్ల గౌరవంగా మెలుగుతూ, ఇంటివారి వస్తువులను తిరగవేయడం, వారి వస్తువులకు నష్టంకలిగించడం లేక ఇంట్లోని వారి వ్యక్తిగత ప్రాంతాలకు వెళ్లడం చేయకూడదు. ఇంటివారు ఈ విషయాలలో ఏ సంబంధంగానైనా కష్టాన్ని ఎదుర్కొంటే వెంటనే దానిని సమావేశములో రూమింగ్ ఓవర్ సీర్ దృష్టికి తెచ్చినట్లయితే సహాయపడుటకు ఆయన సంతోషిస్తాడు.
11 నియమించబడిన ప్రాంతమునకు వెలుపలనుండి హాజరగు ప్రతినిధులు: దాదాపు అన్ని సందర్భాలలో మీరు హాజరవటానికి నియమించబడే ప్రాంతము మీ సంఘానికి దగ్గరగా ఉంటుంది. నియమించబడిన ఆయా సంఘములలోని ఎక్కువ మంది ప్రచారకులు హాజరవుతారనే ఉద్దేశముతో సరిపడురీతిలో సీట్లు, సాహిత్యము, ఆహారము, రూమింగ్ వసతులు మొదలగునవి ఏర్పాటుచేయబడతాయి. ఏమైనప్పటికి, ఏదైనా మంచి కారణాలనుబట్టి మీరు మీకు నియమించబడిన ప్రాంతానికిగాక వేరొక సమావేశమునకు హాజరవుతున్నట్లయిన, మేము తరువాత మీకు అందచేసే సమావేశ కేంద్రాల అడ్రసుకు మీ రూము రిక్వెస్టు ఫారాలను పంపవచ్చును.
12 మీ సహకారము అవసరము: రూమింగ్ ఏర్పాటుయొక్క విజయము అందులో ఇమిడియున్నవారందరి సహకారముపైన ఆధారపడియున్నది. (హెబ్రీ. 13:7) అందుచేత, సొసైటియొక్క రూమింగ్ ఏర్పాటుతో అందరూ పూర్తిగా సహకరించాలని మేము కోరుతున్నాము. తద్వారా కొన్ని హోటల్లవారితో సంధికూర్చుకునే విషయాలలో మనము ఇంకను ఎదుర్కొంటున్న యిబ్బందులను తొలగించుకొనగలము. అనేకమంది ప్రచారకులు గతమందలి సమావేశ ఇన్సర్ట్లలో ఇవ్వబడిన నడిపింపులను హృదయంలోకి తీసుకొంటున్న మూలంగా అనేక మంచి ఫలితాలను పొందుతున్నాము. అయినా ప్రతి ఒక్కరిని ఇంకనూ ఇలా కోరవలసిన అవసరత ఉంది. దయచేసి హోటల్ వసతిని కోరడంలో క్రింది మార్గదర్శకాలను పాటించండి:
(ఎ) దయచేసి మీరు ఉపయోగించ దలచుకోని హోటల్లో మీకై మీరు స్వంతగా రిజర్వేషన్ చేసికొనవద్దు. లేక ఏది బాగుంటే దాన్ని తీసుకొని మిగతావాటిని రద్దు చేసుకోవచ్చులే అను అభిప్రాయంతో ఒక దానికంటె ఎక్కువ హోటల్లను రిజర్వు చేసికొనవద్దు. (మత్తయి 5:37) ఇది ధర్మము కాదు. ఎందుకనగా అది హోటల్ యజమానుల వ్యాపారానికి నష్టం కల్గిస్తుంది. అంతేగాక పూర్తి అవసరతగల ఆ దశలో మరొక ప్రచారకులు దానిని వాడకోకుండాను అది ఆటంకము కల్గిస్తుంది.
(బి) మీకేగాని లేక ఇతరులకేగాని పేర్లు ఇవ్వకుండా లేదా వెంటనే డబ్బు పంపించకుండా రూములను రిజర్వు చేసికొనవద్దు.
(సి) చట్టము లేక హోటలు యాజమాన్యము అనుమతించు దానికంటే ఎక్కువ మందిని రూములో అనుమతించవద్దు. సాధారణంగా పిల్లలతో సహా నలుగురు లేక ఐదుగురు వ్యక్తులు రూముకు ఉండవచ్చును. మీరు ఎంతమందైతే ఉంటామని ఒప్పుకుంటారో అంతమందికే ధర చెల్లిస్తున్నారని గుర్తుంచుకొనుము.
13 ఇలాంటి విషయాలలో మనము నియమాలను ఉల్లంఘిస్తే, సరియైన ధరలకు వసతి ఏర్పాటు చేసుకోవడం కష్టమౌతుంది. అది యెహోవా నామమునకు, సంస్థకు కూడా నిందతెస్తుంది. (కీర్త. 119:168) అందువలన హోటల్ యాజమాన్యము ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులను ఎదుర్కొంటుందా, అలాగైతే దానికి బాధ్యులెవరో హోటల్ యాజమాన్యమును విచారించి తెలుసుకోమని రూమింగ్ డిపార్టుమెంటును సొసైటి అడుగుతుంది. సమావేశ వ్యవస్థ సాధ్యమైనంత తక్కువగా సహోదరులకు ఖర్చులయ్యేందుకు ఎంతో కష్టపడి పనిచేస్తుంది. కాబట్టి అందరి క్షేమము దృష్ట్యా, ఈ ఏర్పాటు కొనసాగే లాగున సొసైటి ఏర్పాటుతో అందరూ పూర్తిగా సహకరించాలి. రూమింగ్ డిపార్టుమెంటు మనతో సహకరించే యాజమాన్యంగల మంచి శ్రేష్టమైన వసతికొరకు ప్రయత్నిస్తుంది. ప్రతినిధులు మంచి సౌకర్యములతో మరియు సాధ్యమైనంత తక్కువ ఖర్చులో వసతిపొంది, సమావేశములో మంచి ఆత్మీయ కార్యక్రమమును ఆనందించుటయే మా ఉద్దేశము.