ప్రకటనలు
• సాహిత్య అందింపులు:
డిశంబరు: న్యూవరల్డ్ ట్రాన్స్‌లేషన్ బైబిలును త్రిత్వము, లేక లుక్! బ్రొషూరుతో పాటు రూ. 48.
జనవరి: “కొశ్చన్స్ యంగ్ పీపుల్ ఆస్క్—ఆన్సర్స్ దట్ వర్క్” పుస్తకమును 15రూ. లకు అందించుము. (ఇది లభ్యముకానిచోట ప్రత్యేక అందింపు 192 పేజీల పాత పుస్తకములను రెండు 12రూ. లేక ఒకటి 6రూ. లకు ఉపయోగించుము.)
ఫిబ్రవరి మరియు మార్చి: 192 పేజీల పాతపుస్తకముల ప్రత్యేక అందింపు రెండు 12రూ.లు లేదా ఒకటి 6రూ.లు.
ఏప్రిల్: లివ్‌ఫరెవర్ పుస్తకమును 35రూ.లకు, చిన్నది 20రూ.లకు అందించుము. ఈ సాహిత్యములు అందుబాటులో లేనిచోట ప్రత్యేక అందింపు రెండు 192 పేజీల పాత పుస్తకములను ఒకదాని ధరకు అందించుము. ప్రాంతీయ భాషలలో ఒక ప్రత్యేక అందింపు పుస్తకము సగము ధరకు అందించుము.
మే మరియు జూన్: ది వాచ్‌టవర్‌కు ఒక సంవత్సర చందా 50రూ.లకు. ఆరునెలల చందాలు లేక నెలసరి పత్రికలకు ఒక సంవత్సర చందా 25రూ.లు. (నెలసరి పత్రికలకు ఆరునెలల చందాలేదు. చందా చేయనిచోట రెండు పత్రికలు ఒక బ్రొషూరు కలిపి 8రూ.లకు అందించవచ్చును.)
• 30 కంటె ఎక్కువ పత్రికల డిస్ట్రిబూటరు ఆర్డర్లను కలిగియున్న సంఘములు, ఆర్డరు చేయునప్పుడు సాధ్యమైతే 5తో హెచ్చించగా వచ్చిన సంఖ్యయే ఉండునట్లు పంపవలెను. దయచేసి ఈసారి మీ పత్రికల ఆర్డర్లలో మార్పును పంపించునప్పుడు దీనిని మనస్సునందుంచుకొనండి.
• పాల్గ్‌ట్ జిల్లాసమావేశపు హాలు అడ్రసు: మునిసిపల్ టౌన్ హాల్, పాల్గాట్, కేరళ.
• రానైయున్న మాసములకు పత్రికలను అధికముగా కోరు సంఘములు తమ ఆర్డర్లను పంపవలెను. ఏప్రిల్ మరియు మే మాసములు అనేకులు ఆక్సిలరీ పయినీరులో పాల్గొను ప్రత్యేక కార్యముతో నిండినవి గనుక, సంఘములు చాలినన్ని పత్రికలు తమయొద్ద ఉండులాగున నిశ్చయపరచుకొనవలెను.